Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

ఎన్నికల ఫలితాల తర్వాత కేరళ ప్రభుత్వానికి చర్చ్ హెచ్చరిక

Phaneendra by Phaneendra
Jun 8, 2024, 01:21 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని అధికార ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఆ వెంటనే పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి జాకోబైట్ సిరియన్ క్రిస్టియన్ చర్చ్ హెచ్చరిక జారీ చేసింది. ఈ ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే కేరళలో సీపీఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో పట్టిన గతే పడుతుందని హెచ్చరించింది.

జాకోబైట్ సిరియన్ క్రిస్టియన్ చర్చ్‌కు చెందిన నీరానం డయోసీస్‌కు చెందిన మతాధికారి జీవార్గీస్ మార్ కూరిలోస్ లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో సిపిఎంను, ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాన్నీ ఘాటుగా విమర్శించారు. పినరయి ప్రభుత్వం వైఫల్యాలను, వారి అహంకారాన్నీ దుమ్మెత్తిపోసారు. ప్రజలకు కొన్ని ఆహార పదార్ధాలు పంచిపెట్టి, ఎన్నికల్లో గెలిచేస్తామనుకుంటే అంతకుమించిన మూర్ఖత్వం ఉండదని వివరించారు. ‘సిపిఎం తమ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకపోతే పశ్చిమబెంగాల్, త్రిపురలో ఎదురైన పరిస్థితే తలెత్తుతుంద’ని హెచ్చరించారు.

సిపిఎం ఘోరమైన ఓటమికి కారణాలను కూరిలోస్ అంచనా వేసారు. వామపక్ష విద్యార్ధి విభాగం ఎస్ఎఫ్ఐ రాజకీయ హింసాకాండ, ప్రతిపక్షాల విమర్శల పట్ల తీవ్ర అసహనం, ఓటుబ్యాంకు కోసం బుజ్జగింపు విధానాలు, పనికిమాలిన ఆర్థిక నిర్ణయాలు, వనరుల దుర్వినియోగం, సహకార బ్యాంకుల్లో అంతులేని అవినీతి, మీడియాపై శత్రుత్వం, సాధారణ పౌరులపై పోలీసుల అమానుషకాండ.. ఆ కారణాల వల్లే తాజాగా ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం దారుణ పతనానికి కారణమని విశ్లేషించారు. పినరయి విజయన్ ప్రభుత్వం అదే అహంకారపూరిత వైఖరితో వ్యవహరిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే వారు మరిన్ని ఎదురుదెబ్బలు తినడం ఖాయమని హెచ్చరించారు.   

కేరళలో సీపీఎం అళత్తూర్ నియోజకవర్గంలో మాత్రమే గెలిచింది. చాలా స్థానాల్లో మూడో స్థానానికి పడిపోయింది. అయినప్పటికీ ఆ పార్టీకి చెందిన నాయకులు తమ ఓటుబ్యాంకు యథాతథంగా ఉందని, పార్టీ నిర్మాణం బలంగానే ఉందనీ చెప్పుకుంటున్నారు. పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలు మాత్రం ప్రభుత్వం విధానాల పట్ల ప్రజావ్యతిరేకత కారణంగానే ఎన్నికల ఫలితాలు అంత దారుణంగా ఉన్నాయని చెబుతున్నారు.

కూరిలోస్ వ్యాఖ్యలు ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం పట్ల కేరళ క్రైస్తవ సమాజంలో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. బీజేపీ తదితర ప్రతిపక్షాలు చిరకాలంగా చేస్తున్న విమర్శలు నిజమని నిరూపిస్తున్నాయి. కేరళ క్రైస్తవుల రాజకీయ దృక్పథంలో మార్పును ప్రతిబింబిస్తున్నాయి. ఎల్‌డిఎఫ్ ప్రభుత్వపు మతపరమైన బుజ్జగింపు వైఖరి, పాలనా వైఫల్యాల పట్ల చర్చ్ అసంతృప్తిని వెల్లడిస్తున్నాయి. భవిష్యత్తులో కేరళ రాజకీయాల్లో గణనీయమైన మార్పు కనిపిస్తుందన్న సంకేతాలనిస్తున్నాయి.

Tags: Jacobite Syrian Christian ChurchKerala. LDF GovernmentLok Sabha ElectionsPinarayi VijayanSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.