Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home చరిత్ర, సంస్కృతి

వర్తమాన రాజకీయాల్లో సావర్కర్ ఆలోచనాధార ప్రాసంగికత

Phaneendra by Phaneendra
May 28, 2024, 06:20 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బ్రిటిష్ వలసపాలన బానిసత్వం నుంచి భారతదేశాన్ని విముక్తం చేయడానికి దేశం నలుమూలల నుంచీ ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ప్రతీ భారతీయుడూ తన శక్తిమేర కష్టపడ్డాడు. దేశం కోసం ఎంతోకొంత చేయాలన్న తపన 1857 తిరుగుబాటు తర్వాత ప్రతీ పౌరుడిలోనూ బాగా పెరిగింది. ఆ తిరుగుబాటులో దేశపు ఉత్తర, పశ్చిమ భాగాల ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. ఆరోజుల్లో ఆ ఉద్యమపు సజీవగాధను సామాన్యులకు చేర్చడం చాలా ముఖ్యంగా ఉండేది. దానివల్ల ప్రజల్లో జాతీయతాభావాన్ని ప్రోది చేయడం సాధ్యమయ్యేది. అటువంటి విప్లవవీరుల చిరంజీవ గాధలు సాహిత్యంలో నిక్షిప్తమై ఉన్నాయి. అవి భవిష్య తరాలకు స్ఫూర్తి, ప్రేరణ కలిగిస్తూనే ఉంటాయి. తన రచనా శక్తి ద్వారా ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ విశేషాలను సజీవం చేసిన సమర్థుడైన రచయితగా వినాయక్ దామోదర్ సావర్కర్ నిలిచిపోయాడు.

వినాయక్ దామోదర్ సావర్కర్ అఖిల భారత హిందూ మహాసభ వ్యవస్థాపకుల్లో ఒకడు. ఆ సంస్థ, స్వామి వివేకానంద ప్రేరణతో, ఈ దేశంలో సామాజిక స్పృహను రగిల్చే ఎన్నో రచనలను ప్రచురించింది. ఆ పుస్తకాలు, వాటి ప్రచురణ, ప్రచారం బ్రిటిష్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. సావర్కర్ రచనలు జాతీయ సమైక్యతను విస్తృతంగా ప్రచారం చేసాయి. ఫలితంగా హిందువుల కాషాయధ్వజం, ముస్లిముల ఆకుపచ్చజెండా రెండూ నీలి ఆకాశంలో కలిసి, తెల్లవాడి యూనియన్ జాక్‌కు వ్యతిరేకంగా ఎగిరాయి. అయితే దేశీయ ప్రభుత్వం స్థిరంగా లేకపోవడం, బలహీనంగా ఉండడాన్ని అవకాశంగా తీసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం సావర్కర్ రచనలు ఎన్నింటినో నిషేధించింది. వాటిలో ప్రధానమైనది, 1906లో రాసిన ‘రివోల్ట్ ఆఫ్ 1857’. ఎందుకంటే, కులం మతం జాతి వంటి విషయాలను పక్కన పెట్టి ప్రజల్లో జాతీయతావాదం, సోదరభావాలను కలగజేయడంలో ఆ పుస్తకం నిప్పురవ్వలు రగిలించింది. అతని రచనల ప్రభావం కారణంగానే 1910 డిసెంబర్ 23న సావర్కర్‌కు 50 ఏళ్ళకు సరిపడా రెండు జీవితఖైదు శిక్షలు విధించబడ్డాయి. అండమాన్ నికోబార్ దీవుల్లోని కాలాపానీ జైలులో మరికొన్ని రోజుల్లో శిక్ష విధించానికి ముందు సావర్కర్ ముంబై జైల్లో నెల రోజులు, పుణే జైలులో కొన్ని రోజులూ ఉన్నాడట.

అండమాన్ నికోబార్‌ దీవుల్లోని కాలాపానీ జైలులో శిక్ష అనుభవిస్తూ ఉండగా, స్వామి వివేకానంద ‘రాజయోగం’ పుస్తకాన్ని అధ్యయనం చేసారు వివేకానంద. దాని ప్రేరణతోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం తప్పనిసరి అంటూ సావర్కర్ తదితరులు నినాదాలు చేసారు. ఆయన సప్తర్షి, హిందుత్వ పేరుతో పేరుతో కవిత్వం, సాహిత్యం వెలయించారు. సావర్కర్ ‘హిందుత్వ’ నినాదం ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవరావు బలీరాం హెడగేవార్‌కు ప్రేరణ కలిగించింది. దాని ఫలితంగానే ఆయన 1925లో సొంతఇల్లు కట్టుకున్నారు. సంఘానికి సైద్ధాంతిక అండను అందించినవి సావర్కర్ ‘హిందుత్వ’, తిలక్ నడుపుతున్న కేసరి పత్రికలు.   

దేశాభివృద్ధి కోసం తన మొత్తం జీవితాన్నే పణం పెట్టిన సావర్కర్‌కు భారత చరిత్రలో ఇసుమంతైనా చోటు లేకుండా చేసారు. స్వాతంత్ర్యం వచ్చాక వామపక్ష చరిత్రకారులు, రాజకీయ ఉన్మాదులూ సావర్కర్ కథను ఇష్టంవచ్చినట్టు మార్చేసారు. అలాగే, అతని ఇమేజ్‌కు భంగం కలిగేలా చాలామంది కష్టపడ్డారు. అతన్ని బ్రిటిష్ వారి బ్రోకర్ అంటూ ప్రచారం చేసారు. ఫలితంగా ఎన్నో హిందూ సంస్థల ప్రతిష్ఠ దిగజారినట్లయింది. వాటి యజమానుల్లో ఆత్మన్యూనతా భావం మొదలైంది. నిజానికి భారతీయ సంస్కృతిలో పురుషార్థాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. తద్వారా వ్యక్తి అంతర్గత శక్తిని తెలుసుకుని దాన్ని సమాజసంక్షేమానికి వినియోగించడం సాధ్యమవుతుంది.

వర్తమానంలో దేశంలోని రాజ్యాంగ, రాజకీయ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఛాందసుల వల్ల సమాజంలోని ఐక్యతను దెబ్బతీసేలా అజెండా అమలవుతోంది. ఈరోజుల్లో భారతీయ సామాజిక ఆలోచనను కేవలం కొన్ని సంస్థలకే వదిలేసి భారతీయులు గుడ్డిగా నిద్రపోతున్నారు. మరోవైపు దేశాన్ని లూటీ చేయాలనే మానసిక స్థితి కలిగిన మతాల వారు కశ్మీర్, బెంగాల్, మోప్లా వంటి పరిస్థితులను దేశమంతటా సృష్టిస్తున్నారు. ఒకప్పుడు తమకంటూ ఒక్కదేశమూ లేని శాంతిమతం ఇవాళ 57 దేశాలను ఆక్రమించింది. ప్రపంచం అంతటినీ ఒకే కుటుంబంగా భావించే సనాతన సంస్కృతి మాత్రం భారతదేశానికి పరిమితమైంది. ఇక్కడ కూడా అంతర్గత సమస్యల మబ్బులు దాన్ని ఆవరించేసాయి. దేశభక్తి, సామాజిక స్పృహ వంటి భావాలను పోగొట్టుకున్న పర్షియా, మెసపొటేమియా వంటి దేశాలు ఇవాళ మనుగడే లేకుండా పోయాయి.

సామాజిక స్పృహ అనేది సమాజంలోని అందరికీ ఉండడం చాలా అవసరం. దానివల్ల సమాజ ఐక్యత సాధ్యమవుతుంది. ప్రమాదకరమైన జిహాద్‌లు, మతమార్పిడులకు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠినమైన చట్టాలు చేసేలా ఒత్తిడి తేగలగాలి. ప్రజల్లో జాతీయతాభావాన్ని చైతన్యపరచడం ద్వారా అటువంటి అంతర్గత సమస్యలను అడ్డుకునేలా సమాజం ఎదగాలి. ‘సంఘే శక్తి కలియుగే’, కలియుగంలో అందరూ కలిసి ఉండడమే శక్తినిస్తుంది అన్న వాక్యాన్ని అన్వయించుకుని, భరతమాత ప్రియపుత్రుడైన సావర్కర్ ప్రేరణతో దేశాన్ని ఐక్యత దిశగా నడిపించాలి. అది భారతీయుడైన ప్రతీఒక్కవ్యక్తి కర్తవ్యం.

Tags: BharatHindutvaPatriotismSavarkar Birth AnniversarySLIDERTOP NEWSVeer Savarkar
ShareTweetSendShare

Related News

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం
general

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు
general

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్
Opinion

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు
Opinion

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు

1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కారణం ఎవరు, ఎలా?
Opinion

1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కారణం ఎవరు, ఎలా?

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.