Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

జులై 4న బ్రిటన్ ఎన్నికలు

Phaneendra by Phaneendra
May 23, 2024, 11:36 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జులై 4న నిర్వహిస్తామని ప్రధానమంత్రి ఋషి శునక్ ప్రకటించారు. ఆమేరకు ప్రస్తుత పార్లమెంటు మే 30న రద్దవుతుందని బుధవారం వెల్లడించారు. పార్లమెంటు రద్దుకు బ్రిటన్ రాజు ఛార్లెస్‌ను ప్రధాని ఋషి శునక్ అనుమతి కోరగా, రాజు అంగీకరించారు. ఆ విషయం గురించి శునక్ లండన్‌లో వర్షం కురుస్తున్న వేళ 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ మెట్ల మీద నిలబడి ప్రకటన చేయడం విశేషం. అంతేకాదు, బుధవారం రాత్రే ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించేసారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ 2019 ఎన్నికల్లో గెలిచి గద్దెనెక్కింది. బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. అయితే పలు వివాదాలు, ప్రత్యేకించి కరోనా సమయంలో అధికార పక్షంలోని నేతలు పార్టీలు చేసుకోవడంపై చెలరేగిన వివాదం, బోరిస్ జాన్సన్ పదవికి ముప్పు తెచ్చాయి. ఎన్నికలను నివారించేందుకు కన్జర్వేటివ్ పార్టీ 2022లో మొదట లిజ్ ట్రస్‌ను ప్రధానిగా చేసింది. కానీ ఆమె ప్రభుత్వం 50 రోజులు కూడా నిలవలేకపోయింది. ఆ సమయంలో భారత సంతతికి చెందిన టోరీ పార్టీ ఎంపీ ఋషి శునక్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.

ఋషి శునక్ ప్రభుత్వానికి 2025 జనవరి వరకూ సమయం ఉంది. ఇటీవల జరిగిన ఉపయెన్నికలు, స్థానిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ వరుసగా ఓటమిని చవిచూస్తూ వస్తోంది. ఈసారి ఎన్నికల్లో నాయకత్వ మార్పు తప్పదనీ, లేబర్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనీ దాదాపు అన్ని ఒపీనియన్ పోల్స్ ఏకాభిప్రాయం వ్యక్తం చేసాయి.

నిజానికి బుధవారం మధ్యాహ్నం బ్రిటిష్ పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ శునక్ ఇంగ్లండ్ సార్వత్రిక ఎన్నికలు ఈ ఏడాది ద్వితీయార్థంలో ఉంటాయని చెప్పారు. ఆ జవాబిచ్చిన కొద్దిసేపటికే మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. దానికోసం విదేశాల్లో ఉన్న మంత్రులు సైతం తమ పర్యటనల షెడ్యూళ్ళను మార్చుకుని స్వదేశానికి వెంటనే చేరుకున్నారు. క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే ‌ఋషి శునక్ ఎన్నికల ప్రకటన చేసారు.

Tags: Conservative PartyLabor PartyRishi SunakSLIDERTOP NEWSUK Elections
Share1TweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.