Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home చరిత్ర, సంస్కృతి

మన ప్రధానమంత్రులు : మన్మోహన్‌ సింగ్‌ – 2

param by param
May 12, 2024, 11:53 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Our Prime Ministers, Their Leadership and Administration
Skills – Special Series – Part 10

******************************************************************

సత్యరామప్రసాద్ కల్లూరిరచన : మన
ప్రధానమంత్రులు

******************************************************************

మన్మోహన్‌ సింగ్‌ (26-09-1932)
: యుపిఎ 1 & 2

******************************************************************

మన్మోహన్ సింగ్ హయాంలో దేశ పాలనలో
లోపాలు, ఆంతరంగిక భద్రతకు వాటిల్లిన నష్టాలూ పరిశీలిస్తున్నాం కదా. ఆ క్రమంలో
తరువాయి చూద్దాం…   

 

(ఊ) జాతీయతకు వ్యతిరేకులైనవారిని,
భజనపరులైన వృత్తి నిపుణులను విచక్షణారహితంగా ప్రోత్సహించడం:

(1) యాసిన్‌ మాలిక్‌
దీనికి ఉదాహరణ. అతగాడు జమ్మూ-కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ JKLF ప్రముఖనాయకుడు.అతడికి ప్రస్తుత మోదీ ప్రభుత్వ హయాంలో (2022)
యావజ్జీవ కారాగారవాసంవిధించబడింది. గతంలో ఇస్లామిక్‌ స్టడీస్‌ లీగ్‌కు కార్యదర్శి. 1987లోనే
అతగాడు రావల్పిండిలో శిక్షణ పొంది, తరువాత పాక్‌-ఆక్రమిత కశ్మీర్‌కు
చేరుకున్నాడు. “1989లో ఒక హైకోర్టు
న్యాయమూర్తినిచంపించడం, నలుగురు భారతీయ వైమానికదళ అధికారులను చంపించడం, వీపీ సింగ్‌ కాలంలో మంత్రి ముప్తీ మొహమ్మద్‌ సయీద్‌ కుమార్తెను 1999లో ఎత్తుకొనిపోవడం, ‘నీలకంఠ్‌ గంజూ’ అనే న్యాయమూర్తిని చంపడం- ఇవన్నీ ఇతడి ‘సాహసకృత్యాలు’. 
అంతటి ‘ధీరోదాత్తుడిని’ 2006 ఫిబ్రవరిలో చర్చలకు రావలసినదిగా పిలచి,
ఘనంగా స్వాగతించింది 
యుపిఎ ప్రభుత్వం. (అతడు సోనియా గాంధీ
ఇంటిని కూడా దర్శించినట్లు, నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఒక
జర్నలిస్టు ఇంటివద్ద కలిసినట్లు ఆ రోజుల్లో వార్తలు వచ్చాయి.)

(2) వివాదాస్పదులైన,
పక్షపాత వైఖరి కలిగిన జర్నలిస్టులను ‘పద్మ’
పురస్కారాలతో సన్మానించడం ఆ ప్ర
్రభుత్వపు వేడుకలలో ఒకటి. బర్ఖాదత్‌ (2008),
రాజదీప్‌ సర్దేశాయ్ (2008) ఆ విధంగాసత్కరింపబడినవాళ్ళే. (ప్రముఖులపైన సునాయాసంగా నీలాపనిందలను వేయడం, వాళ్ళు ప్రతికూలంగాస్పందిస్తే క్షమాపణ చెప్పడం’ విషయంలో రాజదీప్‌ను మించినవాళ్ళెవరూ లేరని అందరికీ తెలిసినదే! ఇక బర్ఖాదత్‌
విషయానికి వస్తే, ఆమెకుగల ‘హిందూ వ్యతిరేకత, హిందూ సాంప్రదాయికచింతనపైన ఆమెకు గలదురభిప్రాయం’ కూడా అందరూ ఎరిగినదే. కశ్మీరీ పండిట్ల
విషయంలో ఆమె ఎంత వ్యతిరేకంగా వ్యవహరించిందో అందరికీ తెలుసు. 2004లో ఒక విడియో ద్వారా వైరల్‌ అయిన ఆమె తన మాటల్లో చెప్పిన కుంటి సాకు
– “కశ్మీరీ పండిట్లను అక్కడి ముస్లిములు
బెదరించి తరిమివేయడానికి ముఖ్యకారణం కశ్మీరీ ముస్లిముల జీవనప్రమాణం కంటే ఆ పండిట్ల
జీవనప్రమాణం మెరుగ్గా ఉండడమేనట.” ‘నీరా రాడియాటేపుల’ విషయంలోనూ వివాదాస్పదమైన ఆమె పాత్ర కూడా జగద్విదితం. అంతేగాక,
1999లో కార్గిల్‌ దగ్గర పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధపు
రోజుల్లో ఆ యుద్దఘట్టాలను కొన్నిటిని టీవీద్వారా చూపిస్తూ, ఆయా స్థలాల ఉనికిని ప్రయత్నపూర్వకంగానో, అప్రయత్నంగానో శత్రువులకు తెలిసేటట్లు చేసిందనీ, దాని కారణంగామన సైనికులు కొందరు ఎక్కువ సంఖ్యలో మరణించడానికి ఆస్కారం
ఏర్పడిందనీ ఆమెను ఆ రోజుల్లో ఎందరో తూలనాడారు కూడా. ఇదంతా ఒక ఎత్తు, నేటికీ ఆమె కాంగ్రెసు పార్టీకి వీరాభిమాని కావడం మరొక బహిరంగ రహస్యం!

(ఋ) ఈశాన్య రాష్ట్రాలను
పట్టించుకోకపోవడం: 

ఇప్పటి అసోం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ
చెప్పినదేమింటే – “యుపిఎ ప్రభుత్వపు హయాంలో 
‘దిగ్బంధనం సర్వసాధారణమైన విషయం.
మణిపూర్‌ను దేశపు ‘దిగ్బంధనపురాజధాని’గా పరిగణించేవారు. పెద్ద రహదారుల్లో ఏడాదికి 30 నుండి 130 దిగ్బంధనాలుండేవి.
(అటువంటి దిగ్భంధనాలలో మకుటాయమానమైనది ఒకటి 4 నెలలపాటు సాగింది.)

2004-2014 మధ్య మొత్తం 900మంది సాధారణపౌరులు, భద్రతాసిబ్బంది గొడవల కారణంగా
మరణించారు. ఇదే కాంగ్రెస్‌/యుపిఎ ప్రభుత్వం మణిపూర్‌ను 2017
వరకూ ఏలింది; తరువాత అది ఎన్‌డిఎ చేతులలోకి వెళ్ళింది.

 

ముఖ్యంగా 2004-12 మధ్య ఈశాన్యరాష్ట్రాలలో మొత్తం 8,000 ఆందోళనకరమైన సంఘటనలు జరగగా, వాటిలో 2,000మంది చనిపోయారు. వీటిలో చాలా ముఖ్యమైనది ‘కోక్రఝార్‌’ అనేచోట బోడో తెగలు, ముస్లిముల మధ్య జరిగింది. అందులో
సుమారు 100మంది చనిపోయారు; అధికసంఖ్యలో ముస్లిములు నిర్వాసితులయ్యారు.

 

(2004- 2022మధ్య ఈశాన్యరాష్ట్రాలలో తిరుగుబాటు
కార్యక్రమాల గణాంకాలద్వారాతెలియవస్తున్నదేమిటంటే – ఆ బాపతు
సంఘటనలు మొత్తం 14000 జరిగాయి.అయితే ఆ రేటు 83% మేరకు – అనగా 1,200కి తగ్గింది. (2004లో 7,200 కాగా,2021లో 200). ఆ మెరుగుదల ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక గణనీయంగా ఉన్నది. ఆ
తిరుగుబాటు ప్రయత్నం 2020లో కనిష్టంగా ఉన్నది. ఈశాన్యరాష్ట్రాలలోని
2,600తిరుగుబాటు గుంపులు తమ ఆయుధాలను
వదలిపెట్టి, జాతీయ జనజీవనస్రవంతిలో చేరారు.)

మరొక మరువరాని విశేషం – 2012నుండి (ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌, అస్సామ్‌,ఈశాన్యభారతంలోని కొన్ని చిన్న
రాష్ట్రాలద్వారా) బర్మానుండి బయటకు గెంటబడిన రోహింగ్యాలు” ఈ యుపిఎ హయాంలోనే
మన దేశంలోనికి చొరబడడం మొదలైంది. వాళ్ళందరూ రహస్యపద్ధతులలో బెంగాల్‌,తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, తమిళనాడు, కేరళ, జమ్మూకాళ్ళికీ వంటి ‘సురక్షిత, స్నేహపూర్వక’రాష్ట్రాలలోకి కూడా చొరబడి, స్థిరపడడం మొదలయింది.

ఆ రోహింగ్యాలు మన దేశానికి పెద్ద
తలనొప్పిగా పరిణమించారని ప్రజలందరికీ తెలుస్తూనే ఉంది కదా.

‘అనుకూలమైన కొన్ని
రాష్ట్రప్రభుత్వాలు” వాళ్ళను భారతదేశపు పౌరులుగా మార్చేశారు ఇప్పటికే. 2011 సెప్టెంబరు నాటికే అధికారికంగా ఆ రోహింగ్యాల సంఖ్య 40,000 దాటిపోయిందంటే వారి ఈనాటి నిజమైన జనాభా ఎంతగా ఉండచ్చునో –
ఊహించుకోవలసిందే.


(ౠ) రక్షణరంగంలో కొరవడిన
సంసిద్ధత & శత్రుదేశం చైనాతో అవగాహనా ఒప్పందం

(1) దాదాపు వరుసగా
ఎనిమిదేళ్ళు రక్షణమంత్రిగా ఉన్న ఏకే ఆంటొనీ 2014 ఫిబ్రవరిలో (ఈ యుపిఎ ప్రభుత్వపు ఓటమికి కొద్ది రోజులకు ముందు) ‘126 రఫేల్‌ యుద్ధవిమానాలు కొనుగోలు చేయడానికి తమ ప్రభుత్వం దగ్గర తగినంత
ధనం లేద’ని పార్లమెంటు సాక్షిగా చెప్పాడు.ఆ మాటలు ‘దేశరక్షణకు సంబంధించి సంసిద్ధత విషయమై యుపిఎ ప్రభుత్వపు బాధ్యతారాహిత్యాన్ని
తెలుపకనే తెలుపుతున్నాయి.

అదిగాక, రక్షణమంత్రిగా ఆంటొనీ వైఫల్యాలకు మరికొన్ని మచ్చుతునకలు –

(అ) ఆంటొనీ, రక్షణమంత్రిత్వశాఖలోని అధికారులు కలిసి తయారుచేసిన “రక్షణావసరాల
సేకరణకు పాటించవలసిన పద్దతుల పత్రమే వాటిసేకరణకు
(ముఖ్యంగా ఇతరదేశాల విక్రేతలకు) పెద్ద అడ్డంకిగా నిలిచింది. ఆయన తననిజాయితీని చూపెట్టుకోవడానికే అది తయారయిందా? అన్నట్లుగా ‘అనవసరమైన చిన్నా, చితకా అవసరాలు’ అందులో ఎక్కువగా ఉండడంతో దానికి సంబంధించిన
వ్యవహారాలను నడపడం కష్టమై,రక్షణశాఖకు అందవలసిన మానవవనరులు,
సామగ్రి సకాలంలో లభించడం అపురూపమైపోయింది. అంత చేసినా, ఆయన కట్టెదుటే కొన్ని కుంభకోణాలు
జరిగిపోయాయి కూడా.

(ఆ) సకాలంలో,
సరైన నిర్ణయాలను తీసుకోవడంలో ఆంటొనీ దారుణంగా
విఫలమయ్యాడు! రక్షణసామగ్రి ఆధునికీకరణ కూడా అతడి హయాంలో చాలా మందకొడిగా – ‘ముఖ్యంగా నౌకాదళం విషయంలో’ సాగింది. రక్షణరంగ
విషయమై అంతవరకు పాకిస్తాన్‌ పైనభారతదేశానికి ఉన్న “పైచేయి” కొంతవరకూ
పడిపోయింది!

ఒక పత్రిక ఆంటోనీ నాయకత్వంలో రక్షణశాఖకు
సోకిన ‘తెగులు’ గురించి ఇలా పేర్కొంది:

“భారతదేశపు రక్షణశాఖకు మంత్రిగా
అత్యధికంగా 8 సంవత్సరాలు పనిచేసిన ఆంటొనీ
ఆధిపత్యంలో 
‘రక్షణశాఖ’ఒక సంక్షోభంనుండి మరొకదానిలోకి పడిపోసాగింది. వాటిలో స్పష్టంగా బయటపడినవాటిలో
ఒకటి – త్రివిధ దళాల అధిపతులకు సంబంధించిన వివాదాలు. 
మరికొన్ని – జనరల్‌ వికె సింగ్‌ 2012లో ప్రభుత్వనిర్ణయానికి వ్యతిరేకంగా
సర్వోన్నతన్యాయస్థానం వద్దకు పోవడం;సీబీఐ 2013లో మాజీ ఎయిర్‌ ఛీఫ్‌ మార్షల్‌ ఎస్‌పి త్యాగిపైన లంచాలు తిసుకున్నాడనే
అభియోగం మోపి, ఆయనమీద ఛార్జ్‌ షీట్‌ చేయడం; వరుసగా యుద్ధనౌకల ప్రమాదాలతో (2013 ఆగస్టు 14న ఒక జలాంతర్గామి నాశనమైపోయి దానిలోని 78మంది సిబ్బంది చనిపోవడం, 2014 ఫిబ్రవరి 26న మరొక జలాంతర్గామిలో చెలరేగిన మంటల వల్ల ఇద్దరు అధికారులు మరణించడం
మొదలైనవి.

“అవమానకర సంఘటనలలో కెల్లా ఇది పరాకాష్ట –
యుపిఎ ప్రభుత్వం, రక్షణమంత్రి, సంబంధితఅధికారులూ, వాళ్ళు చేసిన తప్పులకు
సిగ్గుతో తలవంచుకోవలసిన అవమానభారం ఇది!” అని మాజీ రక్షణమంత్రి జస్వంత్‌ సింగ్‌ ఒక
సందర్భంలో ఘాటుగా వ్యాఖ్యానించాడు.

(2) “పుండుమీద కారం
చల్లినట్లుగా” ఈ యుపిఎ ప్రభుత్వలోని
ప్రధాన పార్టీ అయిన కాంగ్రెసు 2008లో చైనా 
కమ్యూనిస్టు పార్టీతో ఒక ‘ఒడంబడిక పత్రం’పైన సంతకంపెట్టింది. దానిపైన కాంగ్రెసు పార్టీ తరఫున రాహుల్‌ గాంధీ సంతకం
చేయగా, చైనా తరఫున అప్పటి చైనాఉపాధ్యక్షుడైన షి జిన్‌పింగ్ సంతకం చేశాడు. ఆ ఒడంబడిక “ఇరు
దేశాలమధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ,అంతర్జాతీయ అంశాలపైన పరస్పరం సంప్రదించుకొనేందుకు” అవకాశాన్ని
కలుగజేస్తుందట. ఆ సమయంలో అక్కడ అప్పటి కాంగ్రెసు అధ్యక్షురాలైన సోనియా గాంధీ కూడా
ఉన్నదట. చిత్రమేమిటంటే – ఆ ఒప్పందంలోని వివరాలు “నేటికీ గోప్యంగానే ఉన్నాయి!”

2020 జూన్‌లో దాని ‘లక్ష్యం, గోప్యత’ల విషయమై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో
ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలైంది. “భారతదేశంతో సత్సంబంధాలు
లేని చైనాతో 
యుపిఎ ప్రభుత్వంలో
కేవలం ఒక భాగస్వామి అయిన కాంగ్రెసు పార్టీ అటువంటి ఒప్పందం ఎందుకు, ఏ 
హక్కుతో చేసుకున్నది? అని ఆ అభ్యర్థనదారుల అభ్యంతరం.
అదే సంవత్సరం ఆగస్టు నెలలో సర్వోన్నత న్యాయస్థానం “ఒక రాజకీయ పార్టీ విదేశానికి
చెందిన మరొక పార్టీతో అటువంటి ఒప్పందం చేసుకోవడమేమిటి?” అంటూ విస్తుపోయింది! ఆ వ్యవహారాన్ని తేలికగా తీసుకోకూడదని, అటువంటి విచిత్రమైన పని అంతవరకూ కనీవినీ ఎరుగనిదనీ అంటూ ఆ అభ్యర్థనదారులుహైకోర్టుకు వెళ్ళి, న్యాయం పొందవచ్చునని చెప్పింది.

(సోనియా గాంధీ చైనా ఎంబసీ నుండి తన
భర్తపేరిట నడుపుతున్న “రాజీవ్‌ గాంధీ స్మారకనిధికి (దానిలో సర్వశ్రీ మన్మోహన్‌
సింగ్‌, చిదంబరం, ప్రియాంకా వాద్రా ప్రభృతులు డైరెక్టర్లు) పెద్ద మొత్తాన్నే
స్వీకరించినట్లు అభియోగం ఉంది.)

అదంతా అలా ఉండగా 2019 జనవరిలో భువనేశ్వర్‌లో “భారతదేశానికి కొత్త స్వరూపాన్ని తేవడం”
అనే విషయంపై మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ తాను 2018 సెప్టెంబర్లో మానస
సరోవర్‌ ను దర్శించినప్పుడు ఇద్దరు చైనా ప్రభుత్వ మంత్రులను కలిసినట్లుగా అనాలోచితంగా
బయటపెట్టారు. మరో విశేషమేమిటంటే ఆ సమయంలో ‘డోక్లామ్‌’విషయమై భారత్‌, చైనా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని
ఉంది.


(ఎ) మైనారిటీల
బుజ్జగింపు (హిందువులకు నష్టం కలిగించేదైనా సరే – ఓటుబ్యాంకును పటిష్టపరచుకోవడం కోసం)

ఈ ప్రభుత్వానికి కూడా మైనారిటీలపైన (‘వాళ్ళ
వోట్లపైన’అంటే సమంజసమేమో?) – ముఖ్యంగాముస్లిములపైన ఉండిన ‘అధికప్రేమ’ఇంతాఅంతా కాదు! కొందరు మంత్రుల మాటలను, చేష్టలను గమనిస్తే మొత్తం ఆ దశాబ్దమంతా ఆ బుజ్జగింపుతోనే
నడచిపోయిందని తేటతెల్లమౌతుంది. కొన్ని ఉదాహరణలు –

(1) అప్పటి ప్రధాని మన్మోహన్‌
సింగ్‌ 2006 డిసెంబర్‌ 8న “జాతీయ అభివృద్ధి మండలి 52వ సమావేశంలో మాట్లాడుతూ, “ముస్లిములకు అభివృద్ధి ఫలాలు సమంజసంగా అందాలంటే వాళ్ళకు మన
దేశవనరులపైన మొదటి హక్కు ఉండాలి. అల్పసంఖ్యాకులకు, ముఖ్యంగా ముస్లిములకు సాధికారత కల్పించే విధంగా కొత్తకొత్త
ప్రణాళికలను మనం రచించుకోవాలి” అని వాక్రుచ్చాడు.

(2) అప్పటి కేంద్ర
మైనారిటీ వ్యవహారాల, న్యాయశాఖామంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ ఒక
ముస్లిమ్‌ స్వాతంత్ర్య సమర యోధుడి 750వ వర్ధంతి
సందర్భంగా 2011 అక్టోబర్‌ 15న ఉత్తర్‌ ప్రదేశ్‌ లో ఒకచోట ముస్లిములకు ప్రత్యేక కేటాయింపులు ఇప్పించాలని
తమ యుపిఎ ప్రభుత్వానికి సిఫార్సుచేయాలని తనను ఎందరో అడిగారంటూ, తన మంత్రిత్వశాఖ ఒక “సమాన హక్కుల కమిషన్‌ను ఏర్పరచడానికి సుముఖంగా
ఉందంటూ మాట్లాడాడు.

(3) ఒక వార్తాపత్రిక
మాటల్లో: “మన యుపిఎ ప్రభుత్వానికి పాకిస్తాన్లో బతుకుతున్న హిందువుల దుస్థితి 
కనబడదు. శ్రీలంక తమిళుల విషయమై
ఐక్యరాజ్యసమితిలో గొంతెత్తే ఈ ప్రభుత్వం అధికారికంగా పాకిస్తానీ హిందువుల గురించి
పట్టించుకుందా? బాంగ్లాదేశ్‌ నుండి తరలివచ్చేవాళ్ళు మన
దేశంలో పౌరహక్కులు పొందడం మాత్రం సునాయాసంగా జరిగిపోతోంది!…”

(4) సరిగా 2014 ఎన్నికలు జరగడానికి ముందు – 2014 మార్చిలో యుపిఎ ప్రభుత్వం 123వేర్వేరు ఆస్తులను ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు ధారాదత్తం చేసింది. అయితే,
2023 ఆగస్టులో ‘గుర్తింపు రద్దుచేయబడిన వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన ఒక ద్విసభ్య
కమిటీ” సిఫారసుల మేరకు గృహనిర్మాణ, నగరవ్యవహారాల కేంద్రమంత్రిత్వశాఖ ఆ 123 ఆస్తులను వెనుకకు తీసుకోవాలని నిర్ణయించింది.తదనుగుణంగా వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌ అమానతుల్లా
ఖాన్‌కు ఒక లేఖలో తమ నిర్ణయంగురించి తెలియజేసింది.

(నెహ్రూ కాలంనాటినుండి ఈ యుపిఎ ప్రభుత్వం
ఏలినన్ని రోజులవరకు ఈ వక్ఫ్ బోర్డులు “1955వక్ఫ్
చట్టంనుండి 1995వక్ఫ్ చట్టంవరకు) క్రమక్రమంగా ఎంతగా బలపడసాగాయో
తెలుసుకోవాలంటే ఈ వక్ఫ్ బోర్డు ఈ దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఎన్నో ప్రదేశాలను కైవసం
చేసుకోవడానికి ప్రయత్నించడాన్ని బట్టి బోధపడగలదు. అటువంటి కొన్ని వివరాలకై ‘పీవీ
నరసింహారావు పరిపాలనలోని లోటుపాట్లకు’ సంబంధించిన భాగంలో చూడవచ్చు.) ఈ 123ఆస్తుల వ్యవహారం కూడా ఆ విధంగా తమదేనంటూ వక్ఫ్ బోర్డు వాదించినవాటిలో
ప్రస్తుతానికి చివరిది అనుకోవచ్చునేమో?

(5) 2004 జూన్‌ లో
ఏర్పరచిన జాతీయ సలహాదారు పాలకసంస్థ (అందులోని సభ్యులెవరూ ఎన్నికైనవాళ్ళు కారు;
దానికి సోనియా గాంధీ అధ్యక్షురాలు)’
2017లో ‘మతసామరస్యాన్ని
పెంపొందించడానికి’ అనే మిషతో ‘మత విద్వేష-వ్యతిరేక బిల్లు ఒకదానిని ప్రవేశపెట్టింది. అయితే ఆ
బిల్లు ఆర్ఎస్ఎస్‌, దాని అనుబంధ సంస్థలను దృష్టిలో
పెట్టుకొని తయారుచేసారనీ, దానిని చట్టంగా చేస్తే అది మన దేశపు
ఫెడరల్‌ స్పూర్తిని “దెబ్బతీయగలదనీ” పలువురు వాదించారు. (అంటే ఆ
చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టంవచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేయడానికి
కేంద్రప్రభుత్వం ప్రయత్నించేఅవకాశాన్ని కలుగజేస్తుందేమోననే శంక
ఏర్పడుతుందని.) ఆ బిల్లులోనే ‘మత సామరస్యం, న్యాయం,మొదలైన విషయాలకు సంబంధించి ఒక అధికారిక
సంస్థ ఏర్పాటు గురించి కూడా ప్రతిపాదన చేయబడింది. అంతేకాదు, అందులో ఉండే సభ్యుల సంఖ్య ఏవిధంగా చూచినా, అధికారంలో ఉండే పార్టీకే అనుకూలంగా ఉండే విధంగా విధంగా ఏర్పరచబడింది.

దేశప్రజల అదృష్టం బాగుండి, ఎన్నో తీవ్రమైన వాదప్రతివాదనల తరువాత ఆ బిల్లు 2014ఫిబ్రవరిలో ఉపసంహరించుకోబడింది.

(6) రాజ్యాంగంలోని 30(1)అధికరణంలో పొందుపరచిన మైనారిటీల
విద్యావిషయక హక్కుల పరిరక్షణ” పేరిట‘2004 మైనారిటీల విద్యాసంస్థలకోసం జాతీయచట్టం’అనే చట్టాన్ని ఆ యుపిఎ ప్రభుత్వం చేసింది.దాని ప్రకారం రాజ్యాంగంలోని 29,30 అధికరణలను అనుసరించి మైనారిటీలకు రక్షణ ఉంది గనుక, “2005 సమాచార హక్కు చట్టం ఆ సంస్థలకు వాటి నిర్వహణ విషయమై వర్తించదట.

పై విపరీతపు పోకడలను గమనించే అయి
ఉండాలి -‘Observer Research Foundation’ అనేసంస్థకు చెందిన రషీద్‌ కిద్వాయ్‌” అనే విదేశీ సందర్శకుడు 2019 జూన్‌లో “భారతదేశంలోని అధికసంఖ్యాకులను పక్కన పెట్టి, అల్పసంఖ్యాకులను అధికంగా ఆకర్షించడానికి ప్రయత్నించడమే యుపిఎ ప్రభుత్వపతనానికి
ముఖ్యకారణం” అన్నాడు.

ప్రస్తుతం ఈ యుపిఎ కూటమివాళ్ళు సమయం
దొరికినప్పుడల్లా “మోదీ గారి ఎన్‌డిఎ ప్రభుత్వంలోమైనారిటీలకు అన్యాయం జరిగిపోతోం”దని ఆడిపోసుకుంటూనే ఉన్నారు కదా.
మరి, ఒక వార్తాసంస్థప్రచురించిన ఒక గణాంకాన్ని గమనించండి – “2009-14లో ఉండిన యుపిఎ-2 ప్రభుత్వంలో ప్రయోజనం పొందిన ముస్లిం విద్యార్థుల
సంఖ్యకంటే 2014-79లో ఏర్పడిన ఎన్‌డిఎ
ప్రభుత్వంలో ప్రయోజనం పొందిన ముస్లిం విద్యార్థుల సంఖ్య 4 లక్షలకు పైగా ఎక్కువగా ఉంది.”


(ఏ) తారుమారైన ప్రాముఖ్యాలు &
కొన్ని అంతుచిక్కని ఆత్మహత్యలు:

(1)ఒక ప్రైవేటు ఛానల్‌ చంద్రయాన్‌-3 విజయవంతంగా ప్రయోగింపబడిన సందర్భంలో ఏర్పాటు చేసిన ఒక చర్చలో అంతకు
ముందు ప్రయోగింపబడిన ‘చంద్రయాన్‌-2’ ప్రోజెక్టు చాలా ఆలస్యం కావడానికికారణాలను రెట్టించి అడగ్గా యుపిఎను సమర్ధించడానికి ప్రయత్నించిన
కొందరు నీళ్ళు నమలవలసి వచ్చింది. ఇస్రో మాజీ ఛైర్మన్‌ మాధవన్‌ నాయర్‌(2003-2009)
జూన్‌ 2019లో మరొక సందర్భంలో చెప్పిన క్రింది మాటలద్వారా ‘చంద్రయాన్‌-2’ప్రోజెక్టు ఆలస్యానికి కారణం
కొంతవరకైనా దొరకవచ్చు.

“చంద్రయాన్‌-1 2008 అక్టోబర్‌ 22న విజయవంతంగా ప్రయోగింపబడడంతో, తరువాతి ఘట్టంగాచంద్రయాన్‌-2ను 2012లో ప్రయోగించాలని మొదట సంకల్పించారు. ఆ
ఆలస్యం ఆందోళనకరంకాకపోయినా, యుపిఎ-2 ప్రభుత్వపు విధానాలలో మార్పు రావడంవల్ల ఈ ఆలస్యం జరిగింది. అయితే,
మోదీజీ వచ్చాక, ఎన్‌డిఎ
ప్రభుత్వం ఈ అంతరిక్ష యాన ప్రోజెక్టులకు కొంత
ఊపును కలిగించి, శివన్‌ సారథ్యంలో వాటిని వేగవంతం
చేసింది (2019 ప్రాంతంలో). కొన్ని నెలలలోనే ఎన్నో
విన్యాసాలు (designs)చేయబడ్డాయి.

యుపిఎప్రభుత్వం 2014 ఎన్నికలకు ముందే కొన్ని గొప్ప
విజయాలను తన ఖాతాలో చూపించేఉద్దేశంతో “మంగళ్ యాన్‌కు (అంగారకగ్రహం
చుట్టూ రాకెట్‌ తిరిగే ప్రోజెక్టు) ప్రాధాన్యం ఇచ్చింది.

ఆ ప్రయోగం యుపిఎ హయాంలో జరిగినా,
అది అంగారకుడిపైనకాలుమోపినది మోదీ గారి ప్రభుత్వం వచ్చాకనే (2014 సెప్టెంబర్‌). చంద్రయాన్‌-2 కోసం వాడవలసిన
ఎన్నోపరికరాలు, వస్తువులు ‘మంగళ్‌ యాన్‌” కోసం తరలించబడ్డాయి.
అందుకని, మేము చంద్రయాన్‌-2ప్రోజెక్టును దాదాపు మొదటినుండీ మళ్ళీ చేయవలసి వచ్చింది. మోదీ
వచ్చాకనే చంద్రయాన్‌-2 పనులు ఊపందుకున్నాయి….’’

(2) ఒక ప్రముఖ ఆంగ్ల
దినపత్రిక 2015 అక్టోబర్‌ రెండవ వారంలో ప్రచురించిన
వివరాలు ఈవిధంగా ఉన్నాయి:

‘‘ఈ దేశంలోని గత నాలుగు సంవత్సరాల
వ్యవధిలో వివిధప్రాంతాలలో 11మంది అణుశాస్త్రజ్ఞులు అనుమానాస్పద స్థితులలో మరణించారు. వారిలో 8 మంది శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు ప్రేలుడులవల్లగానీ, ఉరి వేసుకోడం ద్వారా, లేదా సముద్రంలో మునిగిపోయి మరణించారు.
న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ కు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు కూడా అదే
విధంగా అనుమానాస్పదస్థితులలోనే మరణించారు.అలాగే, ఇద్దరు రిసెర్చ్‌ ఫెలోస్‌ 2010లో ట్రాంబే BARC లో అంతుచిక్కని
అగ్నిప్రమాదంలోచనిపోయారు.’’

నాలుగేళ్ళలో అటువంటి
చావులు, వాటి వెనుక కనిపిస్తున్న కారణాలు”
విచిత్రంగానూ,అనుమానాస్పదంగానూకనిపించడంలేదా? భద్రత విషయమై అధికారుల అలసత్వం, శాస్త్రవేత్తల మానసిక దార్థ్య౦ తక్కువగా ఉండడం, వేరే ఇతర కారణాలు –
ఏవైనా సరే, అదంతాప్రభుత్వ ఉదాసీనతకే అద్దంపడుతున్నట్లుగా భావించాలి కదా.


(ఐ) నల్లధనాన్ని
వెనుకకు తెచ్చే విషయంలో ఉదాసీనత:

ఒక పత్రిక ఇలా పేర్కొన్నది: “ఆర్ధికమాంద్యం
గురించి అతిగా బాధపడుతూ ఉన్న ఈ యుపిఎ ప్రభుత్వపు 
ప్రధానమంత్రి తన ప్రసంగాలలో ‘ఎప్పుడూ,
ఎక్కడా నల్లధనం ప్రసక్తే తేకపోవడం’ఎంతో విడ్డూరమైన సంగతి!”


16వ లోక్‌సభ ఎన్నికల పలితాలు – 2014

ఈసారి భాజపా నాయకత్వంలో ఎన్‌డిఎ కూటమి
కొన్ని పార్టీల మద్దతుతో 332 స్థానాల బలిమితోపూర్తిగా 5 సంవత్సరాలవరకూ పరిపాలించగలిగింది.

అన్నాడిఎంకె, తృణమూల్‌ కాంగ్రెస్, బిజూ జనతాదళ్‌ వంటి ప్రాంతీయ పార్టీలు ఏ కూటమినీ
సమర్ధించకుండా స్వతంత్రంగా ఉండిపోయాయి. కమ్యూనిస్టులకు వచ్చిన స్థానాలు 10 దాటలేదు. ఇతర పార్టీలకు వచ్చిన స్థానాల సంఖ్యా చాలా తక్కువే.

(నరేంద్రమోదీ ప్రభుత్వం పనితీరు గురించి తరువాయి భాగంలో చూద్దాం)

Tags: Administration SkillsLeadershipManmohan SinghOur Prime MinistersTOP NEWS
ShareTweetSendShare

Related News

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం
general

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు
general

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్
Opinion

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు
Opinion

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు

1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కారణం ఎవరు, ఎలా?
Opinion

1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కారణం ఎవరు, ఎలా?

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.