Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home చరిత్ర, సంస్కృతి

మన ప్రధానమంత్రులు : మన్మోహన్‌ సింగ్‌ – 1

param by param
May 12, 2024, 11:50 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Our Prime Ministers, Their Leadership and Administration
Skills – Special Series – Part 9

******************************************************************

సత్యరామప్రసాద్ కల్లూరి రచన : మన
ప్రధానమంత్రులు

******************************************************************

మన్మోహన్‌ సింగ్‌ (26-09-1932)
: యుపిఎ 1&2

******************************************************************

యుపిఎ కూటమికి
నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీయే అయినా
, ఆమె
ప్రధానమంత్రిణి కావడానికి 
కొన్ని సాంకేతిక కారణాలు అడ్డురావడంతో
మన్మోహన్‌సింగ్‌ను ప్రధానిగా ఆ పార్టీ ఎన్నుకున్నది. (దానినే “శ్రీమతి సోనియా గాంధీ తన పదవిని త్యాగం
చేయడం”గా ఆమె భజనపరులు కొందరు కీర్తించారు కూడా.) మన్మోహన్ సింగ్‌ ఆ కాలంలో
రాజ్యసభ సభ్యుడు.

 

15వ లోకసభ ఎన్నికల ఫలితాలు – 2009

ఈసారి కూడా కాంగ్రెస్‌ పార్టీ
నేతృత్వంలో ఏర్పడిన యుపిఎ కూటమికి ఆధిక్యం వచ్చింది
.వామపక్ష కూటమి, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌
పార్టీ మొదలైన పార్టీల మద్దతుతో ఆ సంఖ్య 322కి పెరిగి, పూర్తి 5 సంవత్సరాలవరకూ ఆ కూటమి
పరిపాలించగలిగింది.


******************************************************************

మన్మోహన్‌ సింగ్‌ (26-09-1932)
: యుపిఎ 2

******************************************************************

రెండవసారి కూడా మన్మోహన్‌ సింగే
ప్రధానిగా కొనసాగాడు. (ఈయన ఈసారి కూడా రాజ్యసభ సభ్యుడే.) ఈసారి మమతా బెనర్జీ
అధ్యక్షతలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెసు కూడా ఈ కూటమిలో మరొక ముఖ్య భాగస్వామి అయింది.


యుపిఎ 1, యుపిఎ 2 పదేళ్ళ పరిపాలనలో ముఖ్యమైన
శాఖలను నిర్వహించిన మంత్రుల పేర్లు:

ఆర్థిక శాఖ: పి చిదంబరం, మన్మోహన్
సింగ్, ప్రణబ్ ముఖర్జీ, పి చిదంబరం

హోం శాఖ: శివరాజ్
పాటిల్, పి చిదంబరం, పి చిదంబరం, సుశీల్ కుమార్ షిండే

రక్షణ శాఖ: ప్రణబ్ ముఖర్జీ, ఎకె
ఆంటోనీ, ఎకె ఆంటోనీ

విదేశాంగ శాఖ: నట్వర్‌ సింగ్‌, మన్మోహన్‌
సింగ్‌, ప్రణబ్‌ ముఖర్జీ, ఎస్‌ ఎమ్‌ కృష్ణ, సల్మాన్‌ ఖుర్షీద్‌


మొదటి రెండు మూడు ఏళ్ళ పాటు ఈ
ప్రభుత్వపు పని తీరు బాగానే ఉన్నట్లు పైపైన అనిపించినా, (కొంతవరకూ గత ప్రభుత్వం మొదలుపెట్టిన కొన్ని మార్పుల, పథకాల ఫలితంగా కూడా) ఆ తరువాత 7 సంవత్సరాల పాలన కాలంలో అది నానాటికి తీసికట్టుగా పరిణమించిందని
కొంచెం లోతుగా పరిశీలించిన ఎవరికైనా అర్థమైపోతుంది. మన్మోహన్‌ సింగ్‌ ‘పేరుకు
మాత్రమే’ ప్రధానమంత్రి, శ్రీమతి సోనియా ‘అప్రకటిత’ ప్రధానమంత్రి అని అందరికీ
అర్థమైపోయింది. ఆ పది సంవత్సరాల కాలాన్ని “భారతదేశంలో ‘వృథా అయిపోయిన దశాబ్దం’గాకొందరు పేర్కొనడంలో ఏవిధమైన అతిశయోక్తీ లేదని చాలామందికి అర్ధమైంది.
ఎందుకంటే ఆ కాలం ‘కుంభకోణాలు, ఉగ్రవాద దాడులు, ఆశ్రిత పక్షపాతం, పరిపాలనా రాహిత్యం, ప్రాంతీయ
పార్టీల పైచేయి, పొరుగు దేశాలతో సరైన సంబంధాలు లేకపోవడం,
రక్షణ రంగంలో సంసిద్ధత లేకపోవడం’ వంటి అవలక్షణాలతో గడచిపోయింది. రెండు మాటల్లో
చెప్పాలంటే ‘మూడు కుంభకోణాలు, ఆరు ఉగ్రవాద దాడులు’గా గడచిన దశాబ్దం అది.


(అ) యుపిఎ పదేళ్ళ పాలనాకాలంలో (2004-2014)
తేబడిన “పౌరులందరికీ ప్రయోజనకారులైన
కొన్ని ప్రముఖ చట్టాలు:

(1) 2005 సమాచార హక్కు చట్టం: గత వాజపేయి ప్రభుత్వం రూపొందించిన 2002 సమాచార స్వేచ్ఛ హక్కు చట్టాన్ని మరికొంత మార్చిచేసిన చట్టం అది. ఆ చట్టం 2005 అక్టోబరునుండి అమలులోనికి వచ్చింది. దానివలన ఏ పౌరుడైనా సరే –
ఏ ప్రభుత్వ శాఖ, లేదా ఏ సంస్థనుండైనా సమాచారాన్ని పొందే అవకాశం ఏర్పడింది. ఆ సదుపాయం సగటు
పౌరుడికి ఎంతగానో ఉపయోగిస్తుందనడంలో ఏ విధమైన సందేహం లేదు.

(2) 2016 ఆధార్ చట్టానికి బాటవేసిన “భారతదేశంలో ఏకైక గురింపు అదికార యంత్రాంగపు (Unique
Identification Authority of India – UIDAI) ఏర్పాటు:
యుపిఎ ప్రభుత్వం 2009లో నందన్‌ నీలేకని ఆధ్వర్యంలో “భారతదేశంలో ఏకైక గుర్తింపు అధికార యంత్రాంగాన్ని
(UIDAI) ఏర్పరచింది. ఆయన దానికి ‘ఆధార్‌’ AADHAR అని నామకరణం చేశారు కూడా. ఆధార్‌ను
తీసుకోవడం ఐచ్ఛికమే. అయితే, “గోప్యతకు అడ్డంకులవంటి సమస్యలు తలెత్తుతాయనే
కారణంతో ‘ఆధార్‌’ చట్టం చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోలేకపోయింది.

(3) 2009 విద్యా హక్కు చట్టం:
2009 ఆగస్ట్‌ 4న చేసిన ఈ చట్టం 6నుండి 14 ఏళ్ళ వరకూ వయస్సు ఉన్న బాల బాలికలకు భారతరాజ్యాంగంలోని 21(A) అధికరణం ‘‘చదువు
ప్రతీ శిశువుకూ ప్రాథమిక హక్కు’’ అని చెప్పిన దానికి అనుగుణంగా చదువుకొనే హక్కును
కలిగిస్తోంది.

నిజానికి ఈ చట్టం గతంలో వాజపేయి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సర్వశిక్షా అభియాన్‌’కు కొనసాగింపే.
అందులో ‘పాఠాల నిర్దేశం, విద్యావిషయిక ప్రణాళికారచన, ఉపాధ్యాయులకు శిక్షణ,
నిర్వహణ’ మొదలైన అంశాలనెన్నింటినో 
మెరుగుపరచే విధానాలు పొందుపరిచారు.

ఈ చట్టం 2010 ఏప్రిల్‌లో అమలులోకి వచ్చింది. దాంతో 6-14వయస్సున్న పిల్లలకు ఉచిత, నిర్బంధవిద్య’కు శాసన సంబంధమైన బలం చేకూరినట్లయింది.

(4) 2013 ఆహారభద్రతా చట్టం: 2013 జూలై 5 నుండి అమలులోకి వచ్చిన ఈ జాతీయ ఆహారభద్రతా చట్టం ప్రభుత్వవిధానాన్ని
“సంక్షేమదృక్పథం”నుండి “హక్కులతో ముడిపడినఆహారభద్రతాదృక్పథం”వైపుత్రిప్పింది. ఈ చట్టం ప్రజాపంపిణీ
వ్యవస్థ 
క్రింద 75% శాతం గ్రామీణప్రజలు, 50% పట్టణప్రజలురాయితీపై తిండిగింజలను పొందే హక్కును కల్పించింది. మరో విధంగా చెప్పాలంటే
– దీనితో దేశజనాభా మొత్తంలో 2/3 మందికి ఈ రాయితీ తిండిగింజలను పొందగలిగే సౌలభ్యం 
ఏర్పడింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు,
కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ చట్టం వర్తిస్తుంది;
సుమారు 80 కోట్లమంది 
ప్రస్తుతం ఈ చట్టంవలన ప్రయోజనాన్ని
పొందుతున్నారు.

(5) 2013 లోక్‌ పాల్‌, లోక్‌ ఆయుక్త చట్టం:  కేంద్రస్థాయిలో ‘లోక్‌పాల్‌’, రాష్ట్రస్థాయిలో
‘లోక్‌ఆయుక్త’ఉండాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది. ఈ
రెండు హోదాలకు రాజకీయంతో ప్రమేయం ఉండదు; రెండూ
చట్టబద్దమైనవి. ఇవి ప్రభుత్వ శాఖలలోను, ప్రభుత్వ
సంస్థలలోను జరిగే అవకతవకలు, అన్యాయాలు మొదలైనవాటిపై వచ్చేఫిర్యాదులను దర్యాప్తు చేస్తాయి. 
ఈ చట్టం పలు విధాలైన అవినీతిని
అడ్డగించడంలో ప్రధానపాత్ర పోషించగలదనే ఉద్దేశంతో రూపొందించబడింది.


(ఆ) ఇదే పాలనాకాలంలో
(2004-2014) తేబడిన “కేవలం
అల్పసంఖ్యాకులకు ఎక్కువ మేలుచేసేది, 
వాస్తవానికి మతసామరస్యానికీ తూట్లు
పొడిచేది” – 2004 NCMEI చట్టం:

ఈ అల్పసంఖ్యాకుల విద్యాసంస్థల జాతీయ కమిషన్‌
చట్టం ‘భారతరాజ్యాంగంలోని 30(1) అధికరణాన్నిఅనుసరించి, అల్పసంఖ్యాకుల విద్యాహక్కులను
పరిరక్షించడంకోసం రూపొందించబడింది. అయితే, ఈ ‘అల్పసంఖ్యాకుల సంస్థలకు” 2005RTI చట్టం ప్రకారం అడిగే సమాచారాన్ని
ఇవ్వడం విషయమైమినహాయింపు ఇవ్వబడింది!

ఈ ‘సంతుష్టీకరణప్రయత్నం’ అంతటితో ఆగలేదు. ఆ ప్రభుత్వం తేబోయి, భంగపడి, వెనక్కు తీసుకున్న బిల్లు ఒకటి ఉన్నది. అది కూడా
“ఎవరూ ఎప్పటికీ మరచిపోకూడని మరో దురాలోచనతో కూడిన ప్రయత్నమే”.  అదేమిటంటే – “ప్రజలచేత ఎన్నుకోబడనిదీ, శ్రీమతి సోనియాగాంధీని అధ్యక్షురాలుగాకలిగినదీ” అయిన జాతీయ సలహాదారు పాలకసంస్థ (National Advisory
Council – NAC) 2011లోఒక బిల్లును ప్రవేశపెట్టింది. ఆ బిల్లు ‘మతవిద్వేష-వ్యతిరేక బిల్లు’గా పేర్కొనబడింది.అది దురుద్దేశంతో కూడినదేననీ, నిజానికి మితవిద్వేషాన్ని పెంచి, పోషించేందుకు మాత్రమే అది బాగా అనుకూలమైనదనీ ఎందరో గొడవ చేశారు.

అదృష్టవశాత్తు చట్టసభల్లో
తీవ్రవాదోపవాదాలు జరిగిన పిమ్మట ఆ బిల్లును 2014 ఫిబ్రవరిలో ఆ ప్రభుత్వం 
ఉపసంహరించుకోవలసివచ్చింది.


వరుసగా రెండు సార్లు ఒకే ప్రధాని నిర్దేశంలో,
ఒకే విధానాలతో, ఒకే దృక్పథంతో పరిపాలించిన యుపిఎ
ప్రభుత్వపు చర్యలలోని పెద్ద లోపాలు:

(అ) ద్రవ్యోల్బణపు రేటు క్రమక్రమంగా
పెచ్చు పెరిగిపోవడం:  

చాలామంది విశ్లేషించినట్లుగా 2004-14
యుపిఎ పరిపాలనాకాలం ఆర్థికపరంగా ‘భారతదేశం నష్టపోయిన దశకం’ అని
నిస్సందేహంగా చెప్పవచ్చు.  
అంతకు ముందు వాజపేయి హయాంలో (1999-2004)
ద్రవ్యోల్బణపు రేటు 4.5%. 
యుపిఎ-1 కాలంలో (2004-09)
సగటు ద్రవ్యోల్బణపు రేటు 5.8% కి పెరిగి, యుపిఎ-2 కాలంలో 
(2009-14) అది 10.4% కి గెంతింది.

ఎందరో ఆర్థికనిపుణుల విశ్లేషణ ప్రకారం యుపిఎ
ప్రభుత్వం తనముందున్న వాజపేయి ప్రభుత్వంనుండి 7% అభివృద్ది రేటును అందుకొని, పది సంవత్సరాల
తరువాత తాను గద్దె దిగిమోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు. “5% కంటే తక్కువ అభివృద్ధి రేటును” అందజేసింది.

(ఆ) విచక్షణారాహిత్యంతో
వివిధ సంస్థలకు అప్పులివ్వడం, మొండి బకాయిలను అంతకంటే 
విచక్షణారాహిత్యంతో మాఫీ చేయడం.
తద్వారా ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించడం: 

‘అస్మదీయులైన పారిశ్రామికవేత్తలకు’,
నిజాయితీలేని ఎన్నో కార్పొరేట్లకు సుమారు ౩6 లక్షల కోట్ల రూపాయలను 2005-73 మధ్యకాలంలో ఆ ప్రభుత్వం అప్పులుగా ఇచ్చింది; వాటిలో ఎందరికో బుణమాఫీలు (కొంతమేరకు కుంభకోణాలలో భాగంగా) కూడా చేసింది.
ఒక అంచనా ప్రకారం 2005-06, 2013-14 సంవత్సరాలమధ్య
“మొండి బాకీల నిష్పత్తి 132%కు పెరిగిపోయింది.

(ఇ) రెండు అధికార కేంద్రాలు:

(1)  కేవలం పేరుకి (de jure) – (అధికారికంగా) మన్మోహన్‌ సింగ్‌ దగ్గర (2) వాస్తవానికి (de facto)– శ్రీమతి సోనియా గాంధీ వద్ద

(గాంధీ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నించకుండా
ఉండే విధేయతను ప్రదర్శించే మంత్రులు, అధికారులతో 
కూడినది)

ఆ రోజుల్లో ఏ ముఖ్యమైన ఫైల్ అయినా (ఏ
మంత్రిత్వబాధ్యతా లేని) సోనియా వద్దకు కచ్చితంగా వెళ్ళేదనేది ఆ రోజుల్లోని
బహిరంగరహస్యాలలో ఒకటి.

అంతేగాక, ‘ఏ విధమైన రాజ్యాంగపరమైన అధికారం
ఉండడానికి ఆస్కారం లేనటువంటి’, ‘ప్రధాని తమ ప్రభుత్వపు ఆశలను ఆశయాలను సమర్థవంతంగా
నిర్వహించేందుకు సహాయపడే సదుద్దేశంతో’ ఏర్పరచినట్లు చెప్పుకొన్నజాతీయ సలహాదారు పాలకసంస్థ (National Advisory Council – NAC) అనేది 2004 జూన్‌లో
ఏర్పరచబడింది. మన్మోహన్‌ సింగ్‌ మాజీ కార్యదర్శులలో ఒకాయన తరువాతి రోజుల్లో చెప్పినదాని ప్రకారం సదరు సంస్థలో
“హిందువుల సంక్షేమానికి విరుద్ధమైన ఆలోచనావిధానాన్ని” కలిగిన, వామభావజాలపక్షపాతులైన ‘యోగేంద్ర యాదవ్‌,
అరుణా రాయ్‌, హర్ష్ మందేర్‌, ఫరా నక్వీ వంటి సాంఘిక కార్యకర్తలు
అధికసంఖ్యలో ఉండేవారు. పేరుకు అది ఒక సలహాదారు సంస్థే అయినా, మన్మోహన్‌ సింగ్‌తో సహా ఆయన మంత్రివర్గంలోని వాళ్ళెవరూ ఆ సంస్థ చేసిన
ప్రతిపాదనలకు గాని, తీసుకున్న నిర్ణయాలకు గాని ఎదురుచెప్పే
సాహసం చేయగలిగేవారు కాదట.

(1) శ్రీమతి సోనియా గాంధీకి సంతోషాన్ని
కలుగజేసేందుకు చేసిన ఒక ప్రయత్నం – ఏ విధమైన సాధికారిక ఏర్పాట్లనూ, తతంగాలనూ పూర్తిచేయకుండానే “శ్రీమతి సోనియా గాంధీ తన
పుట్టినరోజు సందర్భంగా తెలంగాణా ప్రజలకు ఇవ్వబోతున్న కానుక – “ప్రత్యేక
తెలంగాణా” అంటూ అప్పటి గృహమంత్రి చిదంబరం పార్లమెంటులో 2009 డిసెంబర్‌ 9న చేసిన ప్రకటన. అయితే, ఆంధ్రప్రదేశ్‌ వైపునుండి పెద్దగా నిరసన తలయెత్తడంతో ఈయన కొద్ది రోజుల్లోనే
ఈ విషయమై వెనుకకు తగ్గవలసివచ్చింది (ఆ రోజుల్లో ఆమె మంత్రివర్గంలోని కొందరి
భట్రాజు మనస్తత్వం, బాధ్యతా రాహిత్యం ఈ విధంగా ఉండేది.
నిజానికి ప్రత్యేక తెలంగాణా రాష్ట్రపు ఏర్పాటు ఆ ప్రకటన జరిగిన 4సంవత్సరాలవరకూ రూపుదిద్దుకోలేకపోయింది. అంతే కాదు, ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ 
విభజన ఎంత అడ్డగోలుగా, అశాస్త్రీయంగా జరిగిందో – అందరికీ ఎరుకే.)

2014లో ప్రత్యేక తెలంగాణా” ఏర్పడిన
సందర్భంలో ఒక కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు, మెదక్‌జిల్లాకు చెందిన స్థానిక శాసనసభ్యులు
కొందరు, స్థానిక ‘కాంగ్రెసు భక్తులతో’కలిసి శ్రీమతి సోనియా గాంధీకి కృతజ్ఞతాపూర్వకంగా ఒక “దేవాలయాన్ని”
కట్టి, ఆమె విగ్రహాన్ని అందులో ప్రతిష్టించారు.

రాహుల్‌ గాంధీ దురుసుతనానికి, దుందుడుకు స్వభావానికి ఒక మచ్చుతునక ఒక ఆంగ్లవార్తాపత్రిక మాటల్లో (2013 సెప్టెంబర్‌) –

“ఆర్డినెన్సును తూలనాడి, ప్రభుత్వాన్ని
అవమానించిన రాహుల్‌ గాంధీ”

(2013 సెప్టెంబర్‌ లో కాంగ్రెసుకు సర్వోన్నత
నాయకుడివలె ప్రవర్తిస్తూ (అప్పుడతడు ఆ పార్టీకి ఉపాధ్యక్షుడు మాత్రమే) రాహుల్‌
గాంధీ “దోషులుగా తేల్చబడిన శాసనసభ్యులకు ఉపశమనం కలిగే విధంగా” శ్రీ మన్మోహన్‌
సింగ్‌ ప్రభుత్వం జారీచేసిన ఒక ఆర్డినెన్సును ‘పూర్తిగా అర్థరహితమైనది’ అంటూ
తిట్టిపోసి, అప్రయత్నంగానే ఆ ఆర్డినెన్సును బుట్టదాఖలా చేశాడు. (బహుశః ఆ ఆర్డినెన్సు అతడి
కోపానికి గురైనందున సహజమరణాన్ని పొంది ఉండాలి.) ఆ సంఘటన పాత్రికేయుల సమావేశంలో
జరిగింది. ఆ విధంగా అతడు సాక్షాత్తు తమ పార్టీకి చెందిన ప్రధానికి ఉన్న అధికారాన్నే
నలుగురిలో అణగద్రొక్కాడు.

(ఆ దుందుడుకు చర్య అతడి లోక్‌సభ
సభ్యత్వానికే ఎసరుపెట్టేటంత ఇబ్బందిని 2023 మార్చిలోకలుగజేసిందంటూ ఒక పత్రికా విలేఖరి జ్ఞాపకం చేశాడు – సూరత్‌
న్యాయస్థానం ఒక పరువునష్టం కేసులో అతడిని దోషిగా తేల్చి, 2 సంవత్సరాల కారాగారవాసాన్ని కూడా విధించింది. అదృష్టం బాగుండి సర్వోన్నత
న్యాయస్థానం తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అతడు ఆ గొడవనుండి బయటపడగలిగాడు.)

(ఈ) కుంభకోణాల
బాహుళ్యం:

ఒక ప్రచారమాధ్యమ బ్యూరో అంచనా ప్రకారం
మన దేశలోని అతిపురాతమైన కాంగ్రెసు పార్టీ ‘ఒక 
కుంభకోణం వెంట మరొక కుంభకోణం”
అన్నట్లుగా 70 సంవత్సరాల వ్యవధిలో ఈ దేశసంపద చాలా
పెద్ద 
మొత్తమే ఆవిరైపోవడానికి కారణమయింది! ఆ
పార్టీ, దాని కూటమిలోని కొన్ని పార్టీలు 2జి,
బోఫోర్స్‌, అగస్టా 
వెస్ట్‌ ల్యాండ్‌ హెలికాస్టర్‌, స్కార్పైన్
సబ్‌ మెరైన్‌, మహారాష్ట్ర నీటి పారుదల, కామన్‌ వెల్త్‌ క్రీడలు, బొగ్గు 
కుంభకోణం వంటి కుంభకోణాలలో యథేచ్చగా  భుజించాయని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు.

ఆ రోజుల్లో (2004-14) ఒక వార్తాపత్రికతో తన అనుభవాలను గురించి చెబుతూ, ఆ నాటి ఒక సిబిఐ డైరక్టరు ‘‘యుపిఎ
కూటమి ‘సిబిఐని ప్రభావితం చేయడమనే కళలో’ ఎంతగానో ఆరితేరిపోయింది’’ అన్నాడు.

కోట్లాది కుంభకోణాలలో పెద్దపెద్ద
కాంగ్రెసు నాయకులు ఎంతో సంపాదించుకున్నారంటూ ఋజువులతోసహా వాళ్ళపై ఆరోపణలు వచ్చాయి.ఆ పార్టీలలోని కొందరు పెద్దమనుషులు తిన్న మొత్తాలను 1945నుండి నేటివరకు లెక్కిస్తే అవి సుమారు 4.8 లక్షల కోట్ల దాకా ఉండచ్చునని” ఒక అంచనా. ఆ కుంభకోణాలలో
లబ్ధిపొందినవాళ్ళలో ఎందరో అధికారుల, ప్రభావం కలిగిన
వ్యక్తుల పాత్ర కూడా ఉన్నదనేది కూడా ఒక బహిరంగరహస్యమే! 

అట్టి ఘనమైన కుంభకోణాలలో మచ్చుకు
కొన్ని –

(1) బొగ్గు
కుంభకోణం:

కుంభకోణపు వివరాలు: 194 బొగ్గు గుట్టల వేలంలో అవకతవకలు

భాగస్వాములు: ఎందరో మంత్రులు, పార్లమెంటు సభ్యులు, అధికారులు

ఖజానాకు నష్టం – 1.86 లక్షల కోట్లు

అధికార యంత్రాంగం పోటీ పద్ధతిలో బొగ్గు
గుట్టల వేలం జరపవలసి ఉండగా, వాళ్ళు అలా చేయని కారణంగా ఈ కుంభకోణం
జరిగిందని కంప్ట్రోలర్‌ & ఆడిటర్‌ జనరల్‌ (CAG) నిందారోపణ చేసింది.

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌
జూన్‌ 2013లో బొగ్గు శాఖకు సహాయ మంత్రిగా ఉండిన
దాసరి నారాయణరావు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు నవీన్‌
జిందాల్‌తదితరులపైన కేసు వేసింది. 2014జులైలో సర్వోన్నత న్యాయస్థానం ఒక ప్రత్యేక సిబిఐ కోర్టును నియమించి,
1993 నుండి కేటాయించిన 218బొగ్గు గుట్టలలో 214 గుట్టల కేటాయింపును రద్దుచేసింది.
అంతేగాక, దానికి సంబంధించిన పనులను నిర్వహిస్తూ
ఉన్న గనుల యాజమాన్యాలు తాము పనులను మొదలుపెట్టినప్పటినుండి ఆ రోజువరకు టన్నుకు 295 రూపాయల జరిమానా కట్టాలని కూడా ఆదేశించింది.

ఇంతవరకు శిక్షింంబడినవాళ్ళు : ఢిల్లీ
న్యాయస్థానం మాజీ పార్లమెంటు సభ్యుడు విజయ్‌ దర్దా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి శ్రీ HC గుప్తాలకు నాలుగేళ్ళ కారాగారశిక్షను విధించింది.

ప్రస్తుత పరిస్థితి: మరికొందరికి
శిక్షలు పడవలసి ఉంది.


(2) 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం 2008:

కుంభకోణపు వివరాలు: ‘ఎంపిక చేసిన’ కొందరు
టెలికామ్‌ ఆపరేటర్లకు అనుకూలంగా ఉండే షరతులతో 122 టూజీస్పెక్టమ్‌ లైసెన్సులను జారీచేయడంలో
జోక్యం. నియమ నిబంధనలను లెక్కచేయకుండా, ఆర్థిక, న్యాయశాఖ మంత్రాంగంవారి సలహాలను పట్టించుకోకుండా అప్పటి టెలికామ్‌మంత్రి ఎరాజా లైసెన్సులను జారీచేసినట్లుగా అభియోగాన్ని ఎదుర్కొన్నాడు. మరొక
నిందితురాలు కరుణానిధి కుమార్తె అయిన శ్రీమతి కణిమొళి – కొంత సొమ్ము కలైంజర్‌ టీవి
ఛానెల్‌కు చేరే విధంగా ఒక వ్యక్తిపై ఒత్తిడి తేవడంలో రాజాతో చేతులు కలిపినట్లుగా
ఆమెపై అభియోగం.

ఖజానాకు కలిగిన నష్టం: 1.76 లక్షల కోట్లు

తీర్పు: దీనికోసం ఏర్పాటైన
ప్రత్యేకన్యాయస్థానం ‘ఈ కేసు నిరాధారమైన’దంటూ, “వీరిద్దరూ, వారితో పాటుగా

అభియోగాలు మోపబడిన వాళ్ళూ నిరపరాధులని”
చెబుతూ, కేసును కొట్టివసింది.

ప్రస్తుత పరిస్థితి : ప్రత్యేక కోర్టు
తీర్పులో కొట్టవచ్చినట్లున్న పొరపాట్లు, న్యాయపరమైన
తప్పులతో కూడిన నిర్ణయాలు ఉన్నాయంటూ సీబీఐ 2023 మే నెలలో ఢిల్లీ హైకోర్టుకు అప్పీల్‌ చేయగా, అటుపిమ్మటసర్వోన్నత న్యాయస్థానం 2023 ఆగస్టులో సీబీఐ పెట్టుకున్న రివిజన్‌ పిటిషన్‌ను ఏ రోజుకారోజు
పద్దతిలో విచారణ చేయవలసినదిగా ఆదేశించింది. అంటే ఈ వ్యవహారం ఇంకా ముగియలేదనే
నిర్ణయానికి రావచ్చును.


(3) అగస్టా వెస్ట్‌
ల్యాండ్‌ షాపర్‌ కుంభకోణం 2012:

కుంభకోణపు వివరాలు: ఉత్పత్తిదారుకు అనుకూలమైన
రీతిలో వస్తువు (షాపర్) విశేష వివరాలు పలుచన చేయబడ్డాయనే’ అభియోగంతో ఈ కుంభకోణం 2012లో వెలుగులోకి వచ్చింది.

వీవీఐపీల వినియోగార్థం ఇటాలియన్‌
కంపెనీ ఫిన్‌ మెకానికా నుండి 12 అగస్టా వెస్ట్‌ ల్యాండ్‌ ఎడబ్లూ101 షాపర్లను సరఫరా చేసేందుకు 3,600 కోట్ల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారు. ఆ వ్యవహారానికి
మధ్యవర్తులుగా

వ్యవహరించిన ముగ్గురిలో
“క్రిస్టియన్‌ మిషెల్‌” అనే వ్యక్తి 4.2 కోట్ల యూరోలు కమిషన్‌గా తీసుకున్నాడనే అభియోగం వచ్చింది. (2018లో అతడిని యుఎఇ నుండి భారత్ తీసుకువచ్చి మరికొంత విచారణ జరిపారు
కూడా.)

భారతదేశంలోని మాజీ ఎయిర్‌ ఛీఫ్‌
మార్షల్‌ SP త్యాగిని ఆ కేసులో 2016 డిసెంబర్‌లో అరెస్టు చేశారు. తదనంతర పరిణామం – ఈ మొత్తం ఒప్పందాన్నే
యుపిఎ ప్రభుత్వం 2014లో రద్దు చేసుకోవలసివచ్చింది.


(4) తత్రా ట్రక్కుల
కుంభకోణం 2012:

కుంభకోణపు వివరాలు: ఈ తత్రా టక్కులను
సైన్యవిభాగానికి చాలా ఎక్కువ ధరలకు అమ్మారనే అభియోగంతో ఈ కుంభకోణం 2012లో వెలుగులోకి వచ్చింది. ఈ ‘తత్రా’ ఒక జెక్‌ కంపెనీ. ఈ ట్రక్కుల సరఫరా వ్యవహారమంతా చాలా డొంకతిరుగుడు
మార్గంలో నడిచింది.

మిలిటరీవాళ్ళు ‘తత్రా’ కంపెనీ వారి ‘ఆమ్నిపోల్‌’ వద్ద “మొదట కొంతకాలం కొంటూ,క్రమక్రమంగా వారివద్ద ఉండే సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకుని,
కొంతకాలం తరువాత వాటిని స్వయంగా తయారుచేసే
విధంగా” తమ తరపున ప్రభుత్వరంగసంస్థయైన ‘భారత్‌ ఎర్త్‌
మూవర్స్‌ (BEML)కుఆ పనిని ఒప్పగిస్తూ ఒప్పందం చేసుకున్నారు. మరొక ముఖ్యవిషయమేమిటంటే –
రక్షణశాఖ నియమాల ప్రకారం దానికి సంబంధించిన కొనుగోళ్ళన్నీ తిన్నగా ఉత్పత్తిదారు దగ్గరనుండే
చేయవలసి ఉంటుంది.

అయితే ఇందులో హాంకాంగ్‌ కు చెందిన వెక్ట్రా,
తత్రా సిపోక్స్‌ – అనే రెండు కంపెనీలు
రంగంలోకి వచ్చాయి. ‘తత్రా సిపోక్స్‌’ కేవలం వ్యాపారసంస్థ మాత్రమే! ఇన్ని చేతులు మారడంతో ఒక్కొక్క ట్రక్కు
ధర ఉత్పత్తిదారు దగ్గర నేరుగా లభించే ధరకు రెట్టింపును దాటిపోయింది!

ఈ మొత్తం కాలంలో BEML అసలు ఏ విధమైన సాంకేతికపరిజ్ఞానాన్ని పొందలేదు సరికదా – అధికధరకు
కొనుగోలు చేయడం మాత్రమే చేస్తూ, ఆ ట్రక్కులను మిలటరీకి పంపసాగింది.

ఆ కుంభకోణం కారణంగా ఆ కంపెనీ ఈ విధంగా
రెండు దశాబ్దాల కాలం సరఫరా చేసిన 7000వాహనాలకు గాను
సుమారు 750 కోట్ల రూపాయలు వేరే చేతుల్లోకి
వెళ్ళిపోయాయి.

తదుపరి సీబీఐ ఇద్దరు మాజీ అధికారుల
ఇళ్ళలోను, ఢిల్లీ, నోయిడాలలోని “వెక్ట్రా ఆఫీసుల్లోను”తనిఖీలు చేసింది. 2072లో వెక్ట్రాకు చెందిన ‘రవి ఋషి’ అనే వ్యక్తిని

Tags: Administration SkillsLeadershipManmohan SinghOur Prime Ministers
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
Latest News

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.