Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home చరిత్ర, సంస్కృతి

మన ప్రధానమంత్రులు :: అటల్ బిహారీ వాజపాయి

param by param
May 12, 2024, 11:44 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Our Prime Ministers, Their Leadership and Administration
Skills – Special Series – Part 8

******************************************************************

సత్యరామప్రసాద్ కల్లూరిరచన : మన
ప్రధానమంత్రులు

******************************************************************

అటల్ బిహారీ వాజపాయి (25-12-1924 : 16-08-2018)
:: 1

******************************************************************

1996 నాటి 11వ లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ
జనతా పార్టీ అత్యధికంగా స్థానాలను సంపాదించగలిగినా (
161), సగంకంటే ఎక్కువమంది ప్రతినిధులు – ముఖ్యంగా తాను సెక్యులర్‌
(ధర్మనిరపేక్ష) అని చెప్పుకుంటూ వచ్చిన ఏ పార్టీ కూడా (కమ్యూనిస్టు
, జనతాదళ్‌ మొ.వి) తనను సమర్ధించకపోవడంతో వాజపాయి ప్రధానిగా మొదటి
పర్యాయం కేవలం
13 రోజులు (16-05-1996 నుండి 01-06-1996 వరకూ)మాత్రమే కొనసాగగలిగాడు.


******************************************************************

ఎచ్‌ డీ దేవెగౌడ (18-05-1933)

******************************************************************

లోక్‌సభ రద్దు కాకుండా ప్రయత్నాలు మళ్ళీ
మొదలు. కాంగ్రెసుకేమో ఇంకా తక్కువ స్థానాలు (140). దానితో జతకట్టడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరు. అప్పుడు ‘నేషనల్‌
ఫ్రంట్‌’పేరుతో జనతాదళ్‌ ప్రధానపార్టీగా ఒక కూటమి ఏర్పడింది. దానికి కాంగ్రెస్
బైటనుండి మద్దతు ఇస్తానని ఒప్పుకోవడంతో 542స్థానాలున్న లోక్‌సభలో
మొత్తం 305 మంది అంగీకారంతో ఆ ‘జనతా దళ్‌ కూటమి’ ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగింది. కర్ణాటకకు చెందిన దేవెగౌడ
దాని నాయకుడు, ప్రధానమంత్రి.

ఆ ఏర్పాటు కూడా ఎక్కువ కాలం నిలవలేకపోయింది.
46 స్థానాలున్న జనతాదళ్‌లో 17మంది అసమ్మతి బావుటా ఎగురవేశారు. దానితో కాంగ్రెసు యథాపూర్వంగా తన మద్దతును
ఉపసంహరించుకుంది.దేవెగౌడ రాజీనామా చేయవలసివచ్చింది. అవ్విధంబుగా దేవెగౌడ అతికష్టం మీద
పరిపాలించగలిగినది కేవలం 10 నెలలు (01-06-1996 నుండి 21-04-1997
వరకు) మాత్రమే.

దేవెగౌడ పరిపాలనా కాలమంతా నామమాత్రంగా
ఉన్న కేంద్రప్రభుత్వంగా సారహీనంగానే నడిచింది.


******************************************************************

ఇందర్‌ కుమార్‌ గుజ్రాల్‌ (04-12-1919
: 30-11-2012)

******************************************************************

దేవెగౌడ రాజీనామా తరువాత జనతా దళ్‌
మరొక ఏర్పాటు చేసుకుని
, అటు భాజపా మద్దతు గాని, ఇటు కాంగ్రెసు మద్దతు గాని తీసుకోవలసిన
పరిస్థితి మళ్ళీ ఏర్పడింది. అప్పుడు ఐకే గుజ్రాల్‌ను ఆ పార్టీ తమ నాయకుడిగా ఎన్నుకోగా, కాంగ్రెసు తిరిగి ‘బయటనుండి మద్దతు’ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. గుజ్రాల్‌ 1997 ఏప్రిల్‌ 2న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశాడు.

వేరే పార్టీలకు చెందిన ప్రభుత్వాలు
సజావుగా నడుస్తూంటే చూస్తూ ఊరుకోవడం కాంగ్రెసు నైజంకాదు కదా! ఈసారి జైన్‌ కమిషన్‌నివేదికలో రాజీవ్‌గాంధీని చంపించడంలో డీఎంకే పాత్ర ఉన్నదని ప్రకటించడంతో
ఆ పార్టీని జనతాదళ్‌ కూటమినుండి బైటకు పంపకపోతే మద్దతుఉపసంహరించుకుంటానని బెదిరించడంతో గుజ్రాల్‌ కూడా రాజీనామా
చేయవలసివచ్చింది.(మహావిచిత్రమేమిటంటే 2004నుండి నేటివరకూ అదే డీఎంకే కాంగ్రెసు కూటమిలోని ప్రధాన
పార్టీలలో ఒకటి. 2004-2014 కాలంలో ముఖ్యమైన శాఖలలో ఆ
పార్టీవాళ్ళు మంత్రులుగా పనిచేశారు కూడా.) గుజ్రాల్‌సుమారు 10నెలల కాలం మాత్రమే ప్రధానిగా ఉండగలిగాడు.


12వ లోక్‌సభ ఎన్నికల పలితాలు – 1998

మొత్తం సీట్లు 529 భాజపా 182 కాంగ్రెస్ 141 సిపిఐ(ఎం) 032 అన్నాడిఎంకె 018 తెలుగుదేశం 012 ఇతరులు 144

ఈసారి కూడా ఏ పార్టీకీ సగం సీట్ల
ఆధిక్యం కూడా రాలేదు.


******************************************************************

అటల్ బిహారీ వాజపాయి (25-12-1924 : 16-08-2018)
:: 2 (NDA 1)

******************************************************************

ఈసారి భారతీయజనతా పార్టీ ‘అన్నా డీఎంకే, శివసేన, జనతాదళ్‌(యు), బిజూ జనతాదళ్‌, అకాలీ దళ్‌, లోక్‌ జనశక్తి మొదలైన పార్టీలతో కలిసి,
నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (NDA) అనే కూటమిని ఏర్పరచుకుంది. దానికి తెలుగుదేశం బైటనుండి మద్దతు
ఇవ్వడంతో స్వల్ప ఆధిక్యతతో అటల్‌ బిహారీవాజపేయి నాయకత్వంలో NDA ప్రభుత్వాన్ని ఏర్పరచుకోగలిగింది. ఆయన 1998 మార్చి 19న ప్రధానిగాప్రమాణస్వీకారం చేశాడు.

అయితే, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఎన్నెన్నో సందర్భాలలో ఆ కూటమి
ప్రభుత్వానికి సహాయనిరాకరణ, బెదిరింపులు చేయసాగింది! సరిగ్గా 13 నెలల తరువాత ఆమె పార్టీ తన మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు
ప్రకటించింది. ఆ పార్టీకి మొదటినుండీ శత్రువైన డీఎంకేమద్దతుఇవ్వడానికి ముందుకు వచ్చినా, వాజపేయి ప్రభుత్వం అవిశ్వాసతీర్మానంలో ఓడిపోయింది. మళ్ళీ ఎన్నికలను
జరపవలసిన పరిస్థితి ఏర్పడింది. వాజపేయి ఆపద్ధర్మ ప్రధానిగా 1999 అక్టోబర్‌ వరకూ కొనసాగాడు.

ఆ తరువాత జరిగిన ఎన్నికలలో NDA కొన్ని క్రొత్త సమీకరణాలతో ఏర్పడింది. అందులో భాజపా, డీఎంకే, తెలుగుదేశం, జనతాదళ్‌ (యు), శివసేన ముఖ్య భాగస్వాములు.


13వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు – 1999

మొత్తం సీట్లు 529        
భాజపా 182 తెలుగుదేశం 029 జనతాదళ్ (యు) 021 డీఎంకే 12 శివసేన 15
కాంగ్రెస్ 114 సిపిఐ(ఎం) 033 ఇతరులు 123
   

ఈసారి NDA పేరుతో భారతీయజనతా పార్టీ ముఖ్యమైన పార్టీగాకూటమి ఏర్పడి, ఆ ప్రభుత్వం పూర్తి కాలం పనిచేయగలిగింది.


******************************************************************

అటల్ బిహారీ వాజపాయి (25-12-1924 : 16-08-2018)
:: 3 (NDA 2)

******************************************************************

(వాజపేయి ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న
సమయంలో భారతదేశానికి అనుకూలమైన ఒక సంఘటనజరిగింది. అదే ‘‘1999
మే, జూలై మధ్య పాకిస్తాన్‌ పైన కార్గిల్‌ విజయం’’. ఆ
చర్య పేరు ‘‘ఆపరేషన్‌ విజయ్‌.’’)

ఈ ‘క్రొత్త NDA ఏర్పాటు భాజపాకు బాగానే కలిసివచ్చి, ఆ కూటమి సమర్థవంతంగా పూర్తి అయిదేళ్ళూ పరిపాలించగలిగింది. (భాజపా స్వంత
సంఖ్యకు (182), సమర్థకుల సంఖ్య తగినంతగా ఉండడంతో మొత్తం NDA సంఖ్య సగానికి దాటింది; 29 స్థానాలున్న
తెలుగుదేశం బయటనుండి మద్దతు ఇచ్చింది.

 

వాజపేయి ప్రభుత్వం చేపట్టిన
ప్రయోజనకరమైన
, అభివృద్ధికరమైన పనులు

1) శ్రీ వాజపేయి చిరకాలపు కలయైన “స్వర్ణచతుర్భుజి”
రహదారుల ఉద్యమానికి ఆయన కాలంలోనే (1999)శ్రీకారం చుట్టారు. మొదట్లో దాని
పరిమితి దేశంలోని
‘నాలుగుప్రధాన నగరాలను కలపడమే అయినా, నానాటికీ అది “ఇంతింతై…” అన్న తీరులో శాఖోపశాఖలుగా
విస్తరించి
,నేటికి దేశంలో ఉన్న ప్రధాన నగరాలకు
ప్రాకింది. ఈనాడు ఈ కార్యక్రమమంతా
‘భారత జాతీయ రహదారుల అధారిటీ – NHAI ఆధ్వర్యంలో సమర్థవంతంగా సాగిపోతోంది. 2004-2014 మధ్య కాంగ్రెసు/UPA ప్రభుత్వకాలంలో ఒక మోస్తరుగా
పెంపొందినా, 2014 నుండి రహదారుల, రోడ్ల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ నాయకత్వంలో అహోరాత్రాల కృషితో ఆ కార్యక్రమం
దూసుకుపోతోంది.

పనిలో పనిగా ప్రధానమంత్రి గ్రామీణ రహదారుల
పథకానికీ ఆయన కాలంలోనే శ్రీకారం చుట్టారు. శరవేగంతో ఎన్నో గ్రామాలు ఇప్పటికే మంచి
రోడ్లతో కలకలలాడడాన్ని కళ్ళారా చూడగలుగుతున్నాం కదా.

2) వాజపేయి హయాంలో సగటు స్థూలజాతీయోత్పత్తి అభివృద్ధి రేటు 6 నుండి 8శాతం వరకూ ఉండేది.
ద్రవ్యోల్బణం రేటు
4.8%కు కాస్త అటూ ఇటూగా ఉండేది. అంటే
వస్తువుల ధరలు అదుపులో ఉండేవన్నమాట.

మరొక ముఖ్యవిశేషం – భారతదేశపు
విదేశీమారకద్రవ్యపు నిలువ
100 బిలియన్‌ డాలర్లకు పైబడి ఉన్నది. (ఆ
రోజుల్లో అది భారతదేశానికి ఒక రికార్డు
; ప్రపంచంలో ఏడవ
స్థానం.)

3) వాజపేయి ప్రభుత్వం అంతకుముందు పీవీ
కాలంలో నిర్ణయించిన 1
994 టెలికాం పాలసీని మెరుగుపరచి, 1999 టెలికామ్‌ పాలసీని ప్రవేశపెట్టింది. దాని ఉద్దేశం ‘పర్వత ప్రాంతాలు, గిరిజన ఆవాసాలతో సహా పౌరులందరికీ
అందుబాటులో ఉండే
, సమర్ధవంతమైన టెలీకమ్యూనికేషన్‌ సేవలను
అందించడం. దానికోసం టెలికామ్‌ రంగంలో ప్రభుత్వాధిపత్యాన్ని తగ్గిస్తూ
, ప్రైవేటు రంగంలోనూ పెట్టుబడులను ప్రోత్సహించారు. దానితో 2000 నాటికే ప్రజలు దాని సత్ఫలితాలను పొందడం ప్రారంభమయింది.

4) ఆయన పరిపాలనాకాలంలోనే “ఆపరేషన్‌
శక్తి (ఫోఖ్రాన్‌-
2) – రెండవ అణ్వస్త్రపాటవ పరీక్ష విజయవంతం కావడంతో భారతదేశానికి కూడా “అంతర్జాతీయంగా
అణుపాటవ విషయమై పూర్తి స్థాయి హోదా” కలిగింది. (మొదటి పరీక్ష శ్రీమతి ఇందిరా గాంధీ
ప్రధానిగా ఉన్నప్పుడు విజయవంతంగా ముగిసింది)

5) తీవ్రవాద నిరోధక చట్టం – 2002 (POTA) : తీవ్రవాద చర్యలను అదుపుచేయడానికి ఇది ఉద్దేశించబడింది. దేశంలోని వివిధప్రాంతాలలోజరుగుతున్న, జరిగే అవకాశాలున్న తీవ్రవాదుల దాడులను దృష్టిలో ఉంచుకుని ఈ చట్టం
తేబడింది. (2001 డిసెంబర్‌ 13న పార్లమెంట్‌ భవనంపైన జరిగిన తీవ్రమైన దాడి కారణంగా ఈ చట్టం చేసి,తీవ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవలసిన అవసరం అప్పటికే
గుర్తింపబడింది.)

(అయితే, తరువాత వచ్చిన UPA ప్రభుత్వం 2004 అక్టోబర్లో మొదట
Prevention of Terrorism (Repeal)
Ordinanceద్వారా రద్దుచేసి,
దానికి అనుగుణంగా 2004 తీవ్రవాద నిరోధకచట్టపు రద్దుచట్టం 2004 చేసింది.)

6) చంద్రయాన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఖ్యాతి కూడా వాజపేయి
ప్రభుత్వానిదే. దానిగురించి ఆయన మొదటిసారి
2003 ఆగస్టు 15న ప్రకటించారు; వెనువెంటనే ఇస్రో100మంది శాస్త్రవేత్తలతో కూడిన, చంద్రయాన్‌ కార్యక్రమానికి సంబంధించిన జట్టును
ఏర్పరచింది. ఆ కార్యక్రమం
2003లోనే కేంద్రప్రభుత్వంచేత
గుర్తించబడింది. (చంద్రయాన్‌-
1, 2008లో యుపిఎ ప్రభుత్వపు ఆధ్వర్యంలో ప్రయోగించబడింది.)

7) వాజపేయి ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నప్పుడే (1999 మే, జూలై మధ్య) కార్గిల్‌ పోరాటం జరిగింది;
అందులోభారతదేశం విజయం
సాధించింది. దానినే
‘ఆపరేషన్‌ విజయ్‌’గా పేర్కొంటారు.

8) పరిశ్రమల ప్రైవేటీకరణ:  పీవీ ప్రారంభించిన ‘పరిశ్రమల ప్రైవేటీకరణ’ను
వాజపేయి ప్రభుత్వం నిర్విఘ్నంగా, సమర్థంగా కొనసాగించింది. ఆ విధంగా
ప్రైవేటీకరణ చేసిన పరిశ్రమలలో కొన్ని…

– భారత్‌ అల్యూమినియం & హిందుస్తాన్‌
జింక్‌ – మెసర్స్ వేదాంత చేతులలోకి

– సిఎంసి – టాటాల చేతులలోకి

– విదేశ్‌ సంచార్‌ నిగమ్‌ (కమ్యూనికేషన్స్‌) – టాటాల చేతులలోకి

– మోడర్న్‌ ఫుడ్‌ ఇండస్ట్రీస్‌ – హిందుస్తాన్‌ లీవర్‌ చేతులలోకి

9) ఈశాన్య ప్రాంత అభివృద్ధికై ఒక
ప్రత్యేకశాఖ (DoNER) ఏర్పాటు : స్వాతంత్ర్యం
వచ్చినప్పటినుండీ సరిగా పట్టించుకోని గత ప్రభుత్వాలకు మల్లే కాకుండా, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధికి ఉన్న ఆవశ్యకతను వాజపేయి ప్రభుత్వం
గుర్తించింది. ఇదే తరువాత ఒక మంత్రిత్వశాఖగా ఎదిగింది. కాలక్రమేణా ఈ
ఈశాన్యరాష్టాలు – ముఖ్యంగా 2014 తరువాత అభివృద్ధి సాధించనారంభించగలిగాయి.రవాణా సదుపాయాలు కూడా గణనీయంగా
పెరిగాయి.

10) 2003 ఆర్థిక బాధ్యత చట్టం : వాజపేయి
మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా ఉన్న జస్వంత్‌సింగ్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టగా
,
తదుపరి అది చట్టంగా రూపొందింది. దాని ఉద్దేశం,
అవసరం ఏమిటంటే – “ఆర్థికలోటును గణనీయంగా
తగ్గించడం
,ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపరచడం”

11) సర్వశిక్షా అభియాన్‌:6-14 సంవత్సరాల మధ్య వయస్సున్న బాలబాలికలకు ప్రాథమిక హక్కు అయిన ‘‘ఉచితమైన,
తప్పనిసరైన’’ విద్యను అందించడంకోసం ఈ కార్యక్రమాన్ని
వాజపేయి ప్రభుత్వం మొదలుపెట్టింది. (
2004లో ఏర్పడిన UPA ప్రభుత్వం దీనినే ఆధారంగా చేసుకుని, 2009 విద్యా హక్కు చట్టాన్ని తెచ్చింది.

12) ఆస్తుల పునర్నిర్మాణంకోసం కంపెనీల
ఏర్పాటు : 
ఈ కంపెనీలు చేసే ముఖ్యమైన పని ఏమిటంటే
– బ్యాంకులనుండి “పనితీరు ఏ మాత్రమూ లేనిఆస్తులను పరస్పర
అంగీకారం ఉన్న ధరలకు కొనుగోలు చేయడంద్వారా వాటి బేలన్స్‌ షీట్లలో సమతౌల్యానికి
సాయంచేయడం

13) 2002 సమాచారాన్ని పొందే స్వేచ్ఛ : ఆ చట్టం కూడా వాజపేయి ప్రభుత్వంచేత
చేయబడింది; (తదుపరి వచ్చిన యూపీఏ ప్రభుత్వం దానిని మరికొంత సవరించి, 2005 సమాచారాన్ని పొందే హక్కుగా రూపొందించింది. దాని ప్రకారం దేశంలోని ఏ
పౌరుడికైనా ఏ ప్రభుత్వ శాఖనుండైనా సమాచారాన్ని అడిగి తెలుసుకునే హక్కు ఏర్పడింది.)


వాజపేయి ప్రభుత్వం అంతటి ప్రగతిని సాధించినా
2004
ఎన్నికలలో ఎందుకుగెలవలేకపోయింది?

ఎన్నో చెప్పుకోదగిన విజయాలను, ఎంతో ప్రగతిని సాధించి, 2004 ఎన్నికలకు
“భారత్‌ వెలుగొందుతోంది
” అనే నినాదంతో వెళ్ళిన భాజపా/ఎన్‌డీఏ ప్రభుత్వం
అనుకోకుండా ఓటమి పాలయింది. దానికి ముఖ్యకారణాలలో కొన్నిటిని వివిధ మాధ్యమాలు క్రిందివిధంగా
పేర్కొన్నాయి –

(అ) భాజపా విస్తరణ కేవలం
ఉత్తరభారతానికే పరిమితమై ఉంది గానీ, దక్షిణాది
రాష్ట్రాలలో అప్పటికి దాని ప్రభావం అంతగా లేదు.

(ఆ) ఆనాటి
“భాజపా” నాయకులలో చాలామందిలో వాజపేయి ఆరెస్సెస్‌ భావజాలానికి దూరమైపోయారనే 
అపోహ ఏర్పడింది. దీనితో ఆ పార్టీ హిందువుల
వోట్లను పూర్తిగా కూడగట్టలేకపోయింది. దానికి తోడు ఆ సమయంలో వాజపేయి ఒత్తిడి మేరకు కళ్యాణ్‌సింగ్‌ను
ఆ పార్టీనుండి తాత్కాలికంగా బహిష్కరించడంతో ఆయన వేరే కుంపటి పెట్టుకున్నాడు. తత్కారణంగా
భాజపా వోట్లు చీలిపోయి, అది అత్యధిక స్థానాలను గెలుచుకునే
ఉత్తరప్రదేశ్‌ లోనే దెబ్బ తిన్నది. 60 సీట్లవరకూ
ములాయంసింగ్‌ సమాజ్‌ వాదీ పార్టీ, మాయావతి బహుజన్‌ సమాజ్‌ పార్టీలకు
వెళ్ళిపోయాయి.

(ఇ) ఆ రోజుల్లోని ఎన్నో ప్రసారమాధ్యమాలు బాహాటంగానే భాజపాకు వ్యతిరేకంగా పనిచేశాయి. “ఆ పార్టీ పాలనలో అల్పసంఖ్యాక వర్గాలు క్షేమంగా
ఉండలేవు” వంటి 
‘సుభాపితాలతో‘ “దాదాపు ఐదేళ్ళ పాటు అధికారంలో లేక అసహనంతో
ఉన్న కాంగ్రెసుతోపాటు అవి కూడా బాగా ప్రచారం చేశాయి.

(ఈ) కాంగ్రెసు
పార్టీ (ఇప్పట్లో
అదానీ మంత్రం పఠిస్తున్నట్లు)
“భాజపా దేశసంపదనంతా కార్పొరేట్లకు 
దోచిపెడుతోందనీ, సగటు మనిషిని పట్టించుకోవడంలేదనీ” చేసిన ప్రచారం కూడా బాగా
పనిచేసింది. అది గాక, “పెట్రోలు ధరలు, ఉల్లిపాయల ధరలు”వంటి తురుపు ముక్కలను (తన పరిపాలనలో ఎప్పుడూ పెరగనట్లు) కూడా ఆ పార్టీ ప్రకటనల ద్వారా,
మరికొంత సభల్లో ఆడిపోసుకోవడంద్వారా బాగానే
వాడుకుంది. (అందుకనే కాబోలు – “అధికారంలో లేని
కాంగ్రెసు అధికారంలో ఉన్నప్పటికంటే ఎక్కువ ప్రమాదకారి!” అని వాజపేయి తరచుగా అంటూ
ఉండేవారు) అదంతా ప్రజల మనఃఫలకాలపై బాగానేముద్ర వేసింది.

(ఉ) అవి గాక, కొత్తగా తెచ్చిన సంస్కరణల, అభివృద్ధి పథకాల
ఫలితాలు అప్పుడప్పుడే రావడం
మొదలు కావడంతో వాటి ప్రయోజనం సగటు
పౌరులకు తెలియడంలో జాప్యం జరిగింది.

(ఊ) దానికి తోడు చంద్రబాబు నాయుడి సలహా
మేరకు ఎన్నికలను కొన్ని నెలలకు ముందే నిర్వహించడం ఆ 
ప్రభుత్వం చేసిన మరొక తొందరపాటు చర్య.
దానితో తాను చేసిన మేలును గురించి ప్రచారం చేసుకోవడానికి ఆ పార్టీకి తగినంత వ్యవధి లేకపోయింది.
మరొక పెద్ద దెబ్బ – డీఎంకే పార్టీ ఎన్‌డిఎ కూటమిని వదలిపెట్టి, దాని శత్రు కూటమియైన యుపిఎలో చేరడం, ఆ పార్టీ తమిళనాడు లోక్‌సభలోని దాదాపు అన్ని సీట్లూ గెలవగలిగింది.అదే యుపిఎ ఆధిక్యతకు ముఖ్యకారణమయింది.


14వ లోక్‌సభ ఎన్నికల పలితాలు – 2004

మొత్తం సీట్లు 543 కాంగ్రెస్ 145 డిఎంకె 029 సిపిఐ(ఎం) 43
సమాజ్‌వాదీ పార్టీ 36 రాష్ట్రీయ జనతాదళ్ 024 భాజపా 138 ఇతరులు 128

ఈసారి కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పడిన యుపిఎ
కూటమికి ఆధిక్యం (206) వచ్చింది.వామపక్షకూటమి, సమాజ్‌ వాదీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ మొదలైన పార్టీల మద్దతుతో ఆ సంఖ్య 335కు పెరిగి, పూర్తి 5 సంవత్సరాల వరకూ ఆ కూటమి
పరిపాలించగలిగింది.

ఈ 2004 ఎన్నికల ఫలితాలు NDA కూటమికి (ముఖ్యంగా భాజపాకు) పిడుగుపాటుగాతగిలాయి.
ఇంతకుముందే చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడి సలహా
మేరకు లోక్‌సభను
రద్దుచేయడం ఆ పార్టీకి చారిత్రక తప్పిదం అయిపోయింది. ఆ ఎన్నికలకు ముందుగానే కరుణానిధి
డీఎంకే ఎన్‌డిఎ కూటమినుండి యుపిఎ కూటమిలోనికి చేరడం ఆ కూటమికి బాగా కలిసివచ్చింది.
చంద్రబాబు పార్టీ ఆంధ్రప్రదేశ్‌ విధానసభలో ఘోరపరాజయాన్ని చవిచూచింది
.ఆ మేరకు ఆ రాష్ట్రంలోని దాదాపు అన్ని
లోక్‌సభ స్థానాలు రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌కు సంక్రమించాయి. ఇక తమిళనాడులో
ఆ కూటమిలో కాంగ్రెసుకు
10 స్థానాలు, డీఎంకే కూటమికి 29 స్టానాలు – మొత్తం అన్నీ యుపిఎ కూటమి
ఖాతాలోకి వెళ్ళిపోయాయి. ఇదిగాక దేశంలోని ముంబయి
, ఢిల్లీ వంటి పెద్ద నగరాలలో కూడా అనూహ్యంగా యుపిఎ కూటమి గెలిచి,
ఎన్‌డిఎ దెబ్బతింది.

ఏది ఏమైనా, ఒక విశ్లేషకుడు చెప్పినట్లు ఆ ఫలితాలు కేవలం వివిధ రాష్ట్రాల ఫలితాల సమాహారమే
గానీ
, ఏ విధమైన నిరసనల ఫలితం కాదని
చెప్పవచ్చు. విడిగా చూస్తే కాంగ్రెసుకు
, భాజపాకువచ్చిన స్థానాల తేడా 7 (145 – 138) మాత్రమే. ఎటొచ్చీ
అదృష్టదేవత కాంగ్రెసును మరోమారు వరించిందని అనుకోవాలి, అంతే!

Tags: Administration SkillsAtal Bihari VajpayeeHD Deve GowdaIK GujralLeadershipOur Prime Ministers
ShareTweetSendShare

Related News

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం
Latest News

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం

జీఎస్టీ వసూళ్లు : ఆల్‌టైం రికార్డు
general

జీఎస్టీ వసూళ్లు : ఆల్‌టైం రికార్డు

భారీగా తగ్గిన బంగారం ధర
general

భారీగా తగ్గిన బంగారం ధర

వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం
general

వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం
general

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.