Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home చరిత్ర, సంస్కృతి

మనప్రధానమంత్రులు : ఇందిరా గాంధీ – 2

param by param
May 12, 2024, 10:50 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Our Prime Ministers, Their Leadership and Administration Skills
– Special Series – Part 5

**************************************************************

సత్యరామప్రసాద్ కల్లూరి రచన :
మన ప్రధానమంత్రులు

**************************************************************

ఇందిరా ప్రియదర్శిని గాంధీ (19-11-1917 : 31-10-1984)
: 2

**************************************************************

ఇందిరాగాంధీ చరణ్‌సింగ్‌కు ఇచ్చిన మాటను వెనుకకు
తీసుకుని మళ్ళీ ఎన్నికలు జరపడానికి కారకురాలైంది. అయితే
, ఆ 1980
ఎన్నికలలో ఆమె ఘనవిజయాన్ని సాధించగలిగింది.

(తన ‘స్వంతగూటికి‘ మళ్ళీ
చేరాలని ఆశపడ్డ వైబీ చవాన్‌కు ఆరునెలల నిరీక్షణ తరువాతనే ఆ అవకాశం కలిగింది. ఇక
,
జనతా పార్టీ గెలిస్తే ప్రధాని పదవిని పొందవలసిన అభ్యర్థి జగ్‌జీవన్‌రామ్‌కు
మళ్ళీ కాంగ్రెసులో చేరే అవకాశము దొరకలేదేమో – ఆయన ఆ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెసు
(జె) అనే సొంత కుంపటి పెట్టుకున్నాడు.
1986లో
ఆయన మరణించడంతో ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది.)

ఇందిరమ్మ ఆ విధంగా మళ్ళీ ప్రధాని కావడంతో
చాలామంది ‘అల్లరి కుర్రాళ్ళు’ గట్టిగా లెంపలేసుకుని
, అమ్మగారి
పంచన చేరిపోయారు.

అదే సమయంలో ఆమె పార్టీకి బాగా కలిసివచ్చిన మరొక అదృష్టం
ఏమిటంటే – అధికారపు పగ్గాలు ఆవిడ చేతిలోకి వచ్చినప్పటినుండీ క్రమక్రమంగా
‘జనతాపార్టీ
విచ్చిత్తి. ఆ ఎన్నికలలో చరణ్‌ సింగ్‌ పార్టీకి 41 స్థానాలు రాగా
, అసలు
పార్టీ అయిన జనతాపార్టీకి వచ్చినవి 31 స్థానాలు మాత్రమే. (పాత జనసంఘ్‌ తదితర
పార్టీల స్థానాలతో సహా.)

జనతా పార్టీ నానాటికీ చీలికలు పేలికలైపోవడం మొదలైంది.
అందులోని కొందరు జనసంఘ్‌ సభ్యులు ఆరెస్సెస్‌ కార్యక్రమాలలో పాల్గొనడాన్ని జనతా
పార్టీ నేతలు తప్పుపట్టడం వంటి చర్యలతో విసుగుచెందిన వాజపాయి
, ఆడ్వాణీ
వంటి నాయకులు జనతా పార్టీ నుండి బైటకు వచ్చి
, 1980
ఏప్రిల్‌ 6న భారతీయ జనతా పార్టీ స్థాపించుకున్నారు. (నాటి ఆ జనతా పార్టీలో ముక్కలు
చెక్కలై
, చెట్టుకొకటీపుట్టకొకటీ
అయిపోయిన పార్టీలన్నిటిలో గట్టిగా నిలదొక్కుకుని
, ప్రస్తుతం
పరిపాలించే స్థితికి పెరిగినది భారతీయజనతా పార్టీ ఒక్కటి మాత్రమే. మిగతావన్నీ
కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయాయి.

ఇక, ప్రధానిగా మళ్ళీ పదవి చేపట్టిన ఇందిర
దృక్పథం ఏ మాత్రమూ మారలేదు సరికదా
, ఆమెనియంతృత్వ
పోకడలు అలాగే కొనసాగాయి. తర్వాత ఆమె పంజాబులో 1984 జూన్‌ 6న ‘ఆపరేషన్‌ బ్లూస్టార్‌’
(అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయంలో ఉగ్రవాదులను ఏరివేసే చర్య)
చేపట్టి,
దాని దుష్పరిణామాల కారణంగా 1984 అక్టోబర్‌ 31న తన సిక్కు అంగరక్షకుల
చేతుల్లో మరణించడంతో ఆమె శకం ముగిసింది. ఇందిర హత్య కారణంగా మరికొన్ని దురదృష్టకర సంఘటనలు
కూడా జరిగాయి.

ఇందిర వ్యక్తిత్వం విషయానికి వస్తే – ఆమె పోకడలను
నిశితంగా గమనించిన వ్యక్తులందరూ (ఆమెను మెచ్చుకున్నవారితో సహా) ఆమెను ఒక
కర్కోటకురాలిగా
అంగీకరించారు, పరిగణించారు.
భారత రాజకీయాలలో ఆమె అడుగుపెట్టిననాటినుండీ ఆమె పరమ స్వార్థపరురాలని
, అనుకొన్నది
సాధించడానికి ఎటువంటి సంకోచాలూ ఆమెకు ఉండేవి కావనీ అమె రాజకీయ జీవితాన్ని గమనిస్తే
అర్ధంకాక మానదు. ఆమెకున్న కృతఘ్నత ఇంతా అంతా కాదు. తన చెడ్డరోజుల్లో సాయం చేసిన వాళ్ళను
కూడా శంకరగిరి మాన్యాలు పట్టించిన సంఘటనలెన్నో. తాను ప్రధాని కావడానికి
ప్రత్యక్షంగాను
, పరోక్షంగానూ కారకుడైన కామరాజ్‌ నాడార్‌ను
ప్రక్కకు తోసివేసింది. ప్రధాని పదవి పోయినప్పుడు కర్ణాటక నుండి పార్లమెంటు
సభ్యురాలిగా తనకు పునరావాసాన్ని కల్పించిన దేవరాజ్‌ అర్స్‌ గతీ అంతే. అలాగే
,
నీలం సంజీవరెడ్డి పేరును రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించి, ‘అంతరాత్మప్రబోధం‘
అనే నినాదంతో ఆయన ఓడిపోయేటట్లు చేయగలిగిన దిట్ట ఆమె. (ఆ తరువాత ఈ ‘అంతరాత్మ
ప్రబోధానికి
‘ మరి ఎప్పుడూ ఆమె అవకాశం ఇవ్వలేదు. ఆమె పార్టీ
సభ్యులందరూ పార్టీ విప్‌ ప్రకారమే వోట్‌ చేయాల్సిందే.)

వీటన్నింటినీ అలా ఉంచి, మొత్తంమీద
మన దేశానికీ
, ముఖ్యంగా హిందువులకూ ఆమె విధానాలు కొన్ని ఎంతటి
హానిని కలిగించాయో పరిశీలిద్దాము. ఆమె చేసిన కొన్ని విపరీత చేష్టలను ఈనాడు
సరిదిద్దడం కూడా ఎంతో కష్టమే.

 

(అ) మన విద్యావిధానంలోనికి వామపక్షీయుల చొరబాటు

“1960వ దశకపు చివరి రోజుల్లోను, 1970వ
దశకపు తొలిరోజుల్లోనూ వామపక్షభావాలు కలిగిన చరిత్రకారులకు పెద్దపీట వేసి
, భారతదేశపు
చరిత్రను వక్రీకరించడానికి అవకాశం ఏర్పరచిన కాంగ్రెసు-కమ్యూనిస్టు భాగస్వామ్యపు
కుట్రకు ఆమె దారి ఏర్పరచింది. చట్టాలు చేయడానికి 1967 ప్రాంతాల్లో ఆమెకు తగినంత
ఆధిక్యం లేకపోవడంతో ఆమెకు ఆ రోజుల్లో ఆమెకు కమ్యూనిస్టుల ఆసరా కావలసివచ్చింది. దానితో
ఆమె
‘సోషలిస్టు మంత్రాన్ని‘ జపించక తప్పలేదు. (ఆ రోజుల్లో ఆమెను అడ్డుకున్న
ప్రముఖులు తన పార్టీలోనే ఉండేవారు.) ఫలితంగా 1971 ప్రాంతంలో
‘సయీద్‌
నూరుల్‌ హసన్‌
‘ ఆమె మంత్రివర్గంలో విద్యామంత్రిగా నియమితుడయాడు.
ఆరోజుకారోజు
‘భారతదేశపు చరిత్రమండలి (Indian Council of
Historical Research) వామపక్ష భావజాలం
కలిగిన చరిత్రకారులతో నిండిపోయి
, 
‘వర్గపోరాటంవైపు
మొగ్గు చూపిన కారల్‌ మార్క్స్ ఆలోచనా విధానానికి
‘ అనువైన
చట్రంలో బిగింపబడింది. మహారాజా రంజిత్‌ సింగ్‌ (పంజాబ్‌), లలితాదిత్య మహారాజు
(కశ్మీర్) వంటి గొప్ప నాయకులకు చరిత్రలో తగిన 
చోటు దొరకలేదు.ఎన్నో
అవలక్షణాలున్న చొరబాటుదారుల వంశాలకు చెందిన చిల్లర రాజులకేమో ప్రముఖ స్థానమే
కలిగించబడింది.

మోదీ పాలనలో ఇప్పటి పరిస్థితి:

మన విద్యావ్యవస్థలలో ‘మనకు
అసలు నాగరికత అన్నదే తెలియదన్నట్లుగా చూపెట్టడం ద్వారా జరిగిన 
దురాగతాలను దృష్టిలో ఉంచుకుని, ఎన్నో
పాఠశాలల
, విద్యాలయాల సిలబస్‌లు తగిన రీతిలో నిష్పాక్షికంగా 
పునఃపరిశీలించబడుతున్నాయి.

 

(ఆ) ‘సెక్యులర్‌’అనే
పదాన్ని రాజ్యాంగంలో ఇరికించడం ద్వారా మతపరమైన అల్పసంఖ్యాకుల సంతుష్టీకరణ:

‘తనకు అల్పసంఖ్యాకులపై అధిక ప్రేమ ఉన్నదని
చాటుకోవడానికో
, లేక అల్పసంఖ్యాకవర్గాల వోట్లను జారవిడుచుకోకూడదనే
దూరాలోచనతోనో’
అన్నట్లు ఇందిరా గాంధీ పదేపదే
ప్రయత్నిస్తూ
, ఎమర్జెన్సీ కాలంలో ‘అందరి
పురోభివృద్దికోసం
‘ అంటూ ప్రవేశపెట్టిన 20 సూత్రాల/15 సూత్రాలలోనే
కాక
, ఇతర సమయాలలో కూడా ‘మైనారిటీ సంక్షేమం’ అనీ పదాన్ని అవకాశం
దొరికినప్పుడల్లా ఉపయోగించుకునేది.

రాజ్యాంగ ప్రవేశికలో (Preamble) ఆమె
చేసిన 42వ సవరణలో ‘సెక్యులర్‌’ అనే పదం అనవసరంగా చేర్చబడింది. ఆ సవరణ అత్యయిక పరిస్థితి
కాలంలో (1976) ముఖ్యమైన ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ చెరసాలలలో ఉన్నప్పుడు
సునాయాసంగా చేయబడింది. దానిని హిందువుల మనోభావాలను లెక్కచేయని విధంగా
‘మైనారిటీ
సంతుష్టీకరణగా
‘ కాక, మరొకటిగా ఏ విధంగానూ భావించలేము.
నిజానికి “అనవసరమైన
, పక్షపాతపూరితమైన, కలహాలకు
తావిచ్చే ఈ పదాన్ని రాజ్యాంగంలో ఉంచవలసిన కారణం ఉన్నదా
?” అనే
విషయమై గతంలో నెహ్రూ
, అంబేద్కర్‌ వంటి ప్రముఖులు తమ హయాంలోనే ఎంతో
చర్చించి
, ఈ మాట ప్రాముఖ్యం రాజ్యాంగంలోని ఎన్నో ఇతర పదాల ద్వారా
ప్రకటితమైనది కాబట్టి
, ఆ పదాన్ని అసలు ఉంచకూడదనే నిర్ణయానికి వచ్చారు
కూడా.

నిజానికి ఈ పదాన్ని మన రాజ్యాంగంలో ఇరికించడంవలన
సానుకూలమైన ఏ ప్రయోజనమూ సిద్ధించకపోగా, ఎందరికో అది బాధాకరంగా పరిణమించింది. అది
అల్పసంఖ్యాకవర్గానికి (వారు తమ సామాజిక/వ్యక్తి సంబంధిత చట్టాలను మార్చుకునే అవసరం
కలిగించని కారణంగా) పరోక్షంగా లాభించిందని ఎందరో అభిప్రాయపడ్డారు. నిజానికి నేడు ఈ
దేశంలో పాటింపబడుతున్నది
‘కుహనా సెక్యులరిజమే‘ అని అధికసంఖ్యాకులైన
హిందువులు ఎందరో బాధపడడం వరకూ ఆ చర్య దారితీసిందనే చెప్పాలి.

మైనారిటీలకు పెద్దపీట వేయడంలో” ఇందిరమ్మ
తండ్రికంటే రెండాకులు ఎక్కువే చదివిందని
‘ చెప్పచ్చు. ఆమె కూడా పొరపాటునైనా ‘ఉమ్మడి
పౌరస్మృతి’ ఊసెత్తలేదు సరికదా
, పరోక్షంగా 1973లో ముస్లిం లా బోర్డు ఏర్పాటుకు దోహదం
చేసింది కూడా. (ఎట్టి పరిస్థితులలోనైనా అల్పసంఖ్యాకుల వోట్లు చేజారకూడదు కాబట్టి
భారతదేశంలో ఉన్న అల్పసంఖ్యాకులపైన అధికప్రేమను ఏదో విధంగా చూపిస్తూ ఉండాలి కదా.)

ఇందిరాగాంధీ పరిపాలించిన రోజుల్లోనే ఈ సంతుష్టీకరణకు
ఒక మచ్చుతునక – కేరళలో ప్రాంతీయపార్టీ అయిన ముస్లింలీగ్‌ (ఆ పేరులోనే మతం
ధ్వనిస్తున్నా సరే) కాంగ్రెస్‌ పెద్దన్న పార్టీ అయిన
‘ యూడీఎఫ్
(
UDF) ఎప్పుడు ఆ రాష్ట్రాన్ని పరిపాలించినా, కాంగ్రెసుతో
అధికారాన్ని పంచుకుంటూ వస్తూనే ఉంది.
ఎందుకంటే
కాంగ్రెస్‌ దృష్టిలో ఆ పార్టీ
‘పరమ సెక్యులర్‌ పార్టీయే. (ఇదే
విషయాన్ని ఆమె మనవడు రాహుల్‌ గాంధీ ఈ మధ్య కొన్ని సభల్లో తమ మైత్రి తన నాయనమ్మ
కాలంనాటినుండీ దృఢంగా ఉందని ధ్రువీకరించాడు కూడా) అదే విధంగా జాతీయభావాలకు
ప్రాముఖ్యమిచ్చే అలనాటి జనసంఘ్‌ గానీ
, నేటి భారతీయ జనతా పార్టీగానీ సెక్యులర్‌
పార్టీలు కానేరవు
, కాబట్టి పొత్తుకు పొరపాటున కూడా పనికిరావు. ఈ మాటలనే
కాంగ్రెస్‌ పార్టీ నేటికీ చెబుతూనే ఉన్నది
; ఎందరో
ఇప్పటికీ దీనినంతా నమ్ముతూనే ఉన్నారు కూడా.

మోదీ పాలనలో ఇప్పటి పరిస్థితి:

మోదీ ప్రయత్నిస్తున్న ‘ఉమ్మడి పౌరస్మృతి’ ఈ 42వ
రాజ్యాంగ సవరణ కలిగించిన జాడ్యాలను దారిలో పెట్టే అవకాశం త్వరలోనే ఉంది.

 

(ఇ) ఈశాన్య రాష్ట్రాలలోని పరిస్థితులలో నెహ్రూ
కాలం నాటికంటే ఏ మాత్రం మెరుగుదల లేకపోవడం:

ఈశాన్య రాష్ట్రాలలోని పరిస్థితుల విషయానికి వస్తే,
ఇందిరమ్మ కూడా క్రైస్తవ మైనారిటీలపైన ప్రత్యేకశ్రద్దను 
చూపించిందనే చెప్పాలి. ఉదాహరణకు మణిపూర్‌
(కొండప్రాంతాల) జిల్లా మండళ్ళ చట్టం 1971 ఆమె హయాంలోనే అమలులోకి వచ్చింది. దాని
కారణంగా కొండప్రాంతాలలో ఎక్కువగా నివసించే (ప్రముఖంగా కైస్తవులైన) కుకీ తెగలకు
ఎక్కువ హక్కులు ఏర్పడ్డాయి. అదే, 1972 కొండ ప్రాంతపు కమిటీ శాసనానికి దారి తీసింది.
దానితో అంతకుముందే అమలులో ఉన్న నెహ్రూ కాలం నాటి 1950 నాటి గిరిజనుల ప్రతిపత్తి
చట్టం
, 1960 నాటి మణిపూర్‌ భూసంస్కరణల, భూశిస్తుల
చట్టాలకు ఇది తోడై
, కేవలం మూడవ వంతు జనాభా ఉన్న 90% విస్తీర్ణానికి ఈ
చట్టాలు వర్తించడం మొదలైంది.

అంతేగాక, కేవలం ‘గిరిజన
జనాభా’కు మాత్రమే (అంటే చట్టరీత్యా కుకీలు
, నాగాలు
మాత్రమే
) మణిపూర్‌లో ఎక్కడైనా భూమి కొనుక్కోగల అధికారం
ఏర్పడింది. అయితే
, ఇదే సౌలభ్యం మైతీ తెగవారికి దక్కలేదు. (ఆ
కారణంగానే మైతీ తెగవాళ్ళు గత 70 ఏళ్ళుగా తమకూ గిరిజన హోదా కావాలని ఆందోళన చేస్తున్నారు.
ఈమధ్యనే కోర్టులు కూడా కేంద్ర
, రాష్ట్రప్రభుత్వాలను ఈ విషయమై సత్వర చర్యలు చేపట్టవలసిందిగా
ఆదేశించాయి.)

తాను ప్రధాని అయిన తొలి రోజుల్లోనే (1966 మార్చి)
శ్రీమతి గాంధీ
‘మిజో నేషనల్‌ ఆర్మీ తిరుగుబాటును అణచివేయడంకోసం
అస్సాం (ఇప్పటి మిజోరం) లోని ఐజ్వాల్‌ పరిసర ప్రాంతాలపై బాంబింగుకై ఆజ్ఞ ఇచ్చింది.
దానికి కారణం ఆ తిరుగుబాటుదారులు 1966 మార్చి 1న స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోవడమే.
మార్చి 5న ఈ
‘అణచివేత చర్య‘ జరిగింది.
ఇందులో సుమారు 100మంది పౌరులు మరణించారు. (దేశ వైమానిక దళ బలగాలు దేశంలోని ఒక
ప్రాంతంపైనే బాంబులు వేయడమనే ఆ చర్య చాలా విడ్డూరమైనది.) ఎందరో విజ్ఞులు ఆ విధంగా
బాంబులను ప్రయోగించే పరిస్థితి ఏర్పడకుండా సకాలంలోనే తగిన చర్యలను తీసుకుని ఉంటే
బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఆ రోజుల్లోనే. (నేటికీ ప్రతి మార్చి 5న ఆ ప్రాంత
పౌరులు సంతాపదినం పాటిస్తారు.) సుమారు 20 ఏళ్ళ తరువాత 1986 జూన్‌లో ఇందిరాగాంధీ
కొడుకు రాజీవ్‌ గాంధీ, లాల్‌ డెంగాతో శాంతి ఒప్పందం కుదుర్చుకునే వరకూ ఆ ప్రాంతం
తిరుగుబాటు ప్రయత్నాలతో అట్టుడుకుతూనే ఉంది.

నెహ్రూ, ఆయన కుమార్తె సృష్టించిన ఆ గందరగోళమే
మణిపూర్‌లోని నేటి (జూలై 2023) వికృత పరిస్థితులకు ముఖ్య కారణమని చెప్పకతప్పదు.
ఇదిగాక
, పైన పేర్కొన్న మూడు తెగల మధ్య జరుగుతూన్న ‘ఆధిపత్యపు
పోరు’ మణిపూర్‌లోని నేటి దారుణాలకు మరొక ముఖ్యకారణం. (కుకీ తెగను ఇబ్బంది పెడుతున్న
మరి రెండు చర్యలు – ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మాదకద్రవ్యమైన ఓపియం పాపీని పెద్ద
ఎత్తున పట్టేయడం, పొరుగున ఉన్న బర్మా
, ఇతరదేశాల కుకీలను గుర్తించడం ద్వారా ప్రక్కదేశాలనుండి
మన దేశంలోకి చొరబడే కుకీల సాయంతో కుకీ తెగ తన మొత్తం జనాభాను పెంచే మార్మిక ప్రయత్నాలను
అడ్డుకోవడం.)

మోదీ పాలనలో ఇప్పటి పరిస్థితి:

బర్మా వైపు నుండి చొరబాటుదారులను నిలవరించే
ప్రయత్నాలు, మణిపూర్‌లోని కొండ ప్రాంతాలలో 
మాదకద్రవ్యాలకు ఉపయోగించే పంటలను నాశనం చేయడం
వంటి చర్యలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. 
అవి గాక రైల్వే, రోడ్డు, ఇతర రవాణా సదుపాయాలను
ఇబ్బడిముబ్బడిగా పెంచడం కూడా శరవేగంతో 
జరుగుతోంది.

 

(ఈ) ఇందిర నియంతృత్వ ధోరణి, ఎమర్జెన్సీ కాలంలో
జరిగిన దురాగతాలు:

శ్రీమతి గాంధీ ఎప్పుడూ తన కనుసన్నలలో ఉంటూ,
విధేయతతో ఉండే వ్యక్తులకే ప్రాముఖ్యం ఇచ్చేది. ఎన్నో సందర్భాలలో తన
మంత్రులో
, అధికారులో నిర్మాణాత్మక సలహాలను ఇచ్చినా భరించలేకపోయేది.
వాటిని వ్యక్తిగతంగా తీసుకునేది కూడా. ఒకానొక సమయంలో విధేయత కలిగిన న్యాయవ్యవస్థను
కూడా ఆమె ఆశించేదని ఆమె వందిమాగధ బృందం అప్పుడప్పుడు వార్తాపత్రికలతో చెప్పే
మాటలద్వారా తేటతెల్లమయేది.

ఇందిర 1971లోనే తన మాటను జవదాటేవాళ్ళను, తనతో
విభేదించేవాళ్ళను ‘దారిలో పెట్టడం’ కోసం ‘మీసా’ (అంతర్గత భద్రతా) చట్టాన్ని జారీచేసింది.

1975 జూన్‌ 25న ‘అత్యయిక
పరిస్థితిని ప్రకటించాక ఆమె పరిపాలన “ఇష్టారాజ్యం” అయిపోయింది. అధికారం
మొత్తం పూర్తిగా ఆమె కార్యాలయం గుప్పెట్లో కేంద్రీకృతమైపోయింది. లక్షకు పైగా
ప్రజలు – ముఖ్యంగా ఆమెను విమర్శించిన వారు
, ప్రతిపక్షపార్టీల
నాయకులు చెరసాలలో బంధించబడ్డారు. (అందులో సగానికి పైగా ఆరెస్సెస్‌ కార్యకర్తలే)
సహజంగానే ఆరెస్సెస్‌ నిషేధించబడింది. (1977లో ఎన్నికల ఫలితాలు వెలువడుతూన్నప్పుడు
పరిస్థితి తనకు ప్రతికూలంగా ఉన్నదని తెలియగానే ఆ అర్ధరాత్రే ఆమె ఆ అత్యయిక పరిస్థితిని
ఎత్తివేయడంతో ఆరెస్సెస్‌పై నిషేధాజ్ఞ కూడా విలువలేనిదైపోయింది.)

ఆ ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిర రెండవ కుమారుడు
సంజయ్‌ గాంధీ అత్యుత్సాహం కారణంగా ఎన్నో దురదృష్టకరమైన
, భయానకమైన
సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ విపరీతమైన దాష్టీకం కారణంగా ఎందరో అధికారులు
, మంత్రులు,
సంస్థలు ఆమె పరిపాలనపట్ల అతి విదేయత చూపవలసి వచ్చింది. (ఆడ్వాణీ
మాటల్లో చెప్పాలంటే వాళ్ళను ఒంగోమంటే ప్రాకసాగారు.) జార్జ్ ఫెర్నాండెజ్‌, శ్రీమతి
గాయత్రీ దేవి మొదలైన నాయకులెందరో చెరసాలల్లో చిత్రహింసలకు గురయ్యారు. అమానుషంగా
బాధించబడిన శ్రీమతి స్నేహలతారెడ్డి వంటివారు (జార్జ్ ఫెర్నాండెజ్‌కు అనుకూలంగా
మాట్లాడినందుకు) కొందరు మరణించారు కూడా.

జనతా పార్టీ చేతికి పగ్గాలు వచ్చాక, ఆ
ప్రభుత్వం ఎమర్జెన్సీ నాటి దురాగతాల విచారణ కోసం సర్వోన్నత న్యాయస్థానం నుండి
విశ్రాంతుడైన శ్రీ జెసి షా నేతృత్వంలో విచారణ కమిషన్‌ను (షా కమిషన్) వేసింది. ఆ
కమీషన్‌ మూడు అంచెలలో 525 పేజీలు నివేదికను సమర్పించింది. మొదటిది – ఎమర్జెన్సీ
విధించవలసిన ఆవశ్యకత
, సమాచార సాధనాల స్వేచ్చపై అదుపుకు సంబంధించినది –
1978 మార్చి మొదటి వారంలో సమర్పించబడింది.
రెండవది
– తుర్క్‌మెన్‌గేట్‌ దగ్గర తమ ఇళ్ళను బలవంతంగా కూలగొట్టినందుకు నిరసనగా
శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న పౌరులపై ఆమె కుమారుడి నేతృత్వంలో జరిగిన
దురాగతాలకు సంబంధించినది.
మూడవది
– బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు
, ప్రతిపక్షపార్టీల నాయకులను చెరసాలల్లో
వేయడం
, ఆ చెరసాలలలోని వాతావరణం మొదలైనవాటికి
సంబంధించినది. ఆ రిపోర్టు 1978 ఆగస్టులో సమర్పించబడింది.

ఇందిర స్వభావానికి తగినట్లుగానే ఆమె ఆ విచారణకు
సహకరించలేదు. పైగా ఆ కమిషన్‌ అధికారాన్నీ
, పరిమితినీ ప్రశ్నించింది.వ్రాతపూర్వకంగా ఏ వాంగ్మూలాన్నీ ఇవ్వలేదు.
పైపెచ్చు
‘అదంతా తనను బాధించడానికి ఆ ప్రభుత్వం పన్నిన
కుట్ర
‘ అంటూ ఎదురుదాడికి దిగింది. (ఒక సమయంలో ఆమె సహాయనిరాకరణకు
షా ఆమెను చీవాట్లు కూడా పెట్టవలసి వచ్చిందట.)

జస్టిస్ షా తన నివేదికలో ఇందిరా గాంధీ, సంజయ్‌
గాంధీ
, ప్రణబ్‌ ముఖర్జీ, బన్సీలాల్‌
మొదలైనవారిపై, 
వారందరూ రాజ్యాంగేతరవిధానంలో ప్రవర్తించారంటూ
ఘాటైన విమర్శలు చేసాడు. అంతేగాక
, ఆ బృందం తమపై తెచ్చిన వత్తిడి కారణంగా ఎందరో
అధికారులు అసాధారణమైన చొరవతో ఎన్నో అన్యాయపూరితమైన
, రాజకీయ
దురుద్దేశాలతో కూడిన అకృత్యాలకు పాల్పడ్డారని కూడా ఆ నివేదికలో ఆయన పేర్కొన్నాడు.
(ఆ వెంటనే జరిగిన అనుకూల పరిణామాల కారణంగా ఆమె ఎన్నికై
తిరిగి
అధికారంలోకి రాగలగడం
, సహజంగానే ఆ కమిషన్‌ నివేదిక ‘బుట్టదాఖలా కావడం’ –
ఇదంతా ఆ తరువాత జరిగిన పరిణామం.)

 

(ఉ) ఆనువంశిక పాలనకోసం ఆరాటం:

 నెహ్రూ తన కుమార్తె తనకు రాజకీయ వారసురాలు
కావాలని కలలు కన్నాడో
లేదో
గానీ
ఆమె విషయంలో మాత్రం అది పచ్చి నిజం. ఇందిర
మొదట్లో పరిపాలన పగ్గాలను తన రెండవ కుమారుడు సంజయ్‌ గాంధీకి ఇవ్వడానికి
ప్రయత్నించింది గానీ
, విధి వక్రీకరించి అతడు ఒక హెలికాప్టర్‌ ప్రమాదంలో
మరణించడంతో అంతవరకూ కమర్షియల్‌ పైలట్‌ గా ఉన్న పెద్ద కొడుకైన రాజీవ్‌ గాంధీని
రాజకీయాల్లోకి క్రమక్రమంగా ప్రవేశపెట్టింది.

 

(ఊ) సజావుగా సాగుతూండే రాష్ట్రప్రభుత్వాలను
పడగొట్టి తన అనుకూలురను నియమించుకున వికృతక్రీడ:

ఇందిర రాచరికపు పోకడలకు అలవాటు పడిన వ్యక్తి
కాబట్టిఆమె చుట్టూ ఎప్పుడూ వందిమాగధులు తారాడుతూ
ఉండేవారు. ఎవరైనా సరే స్వయంకృషితో రాజకీయంగా ఎదుగుతూంటే ఆమె సహించలేకపోయేది. ప్రజాస్వామ్య
పద్ధతిలో ఎన్నికైన సుమారు 50 రాష్ట్రప్రభుత్వాలను పడగొట్టగలిగిన ఖ్యాతి ఆమెది.

1959లో కేరళ ముఖ్యమంత్రి ఇఎంఎస్ నంబూద్రిపాద్‌ కమ్యూనిస్టు
ప్రభుత్వాన్ని అప్రజాస్వామిక పద్ధతిలో పడగొట్టడంతో శ్రీకారం చుట్టిన ఆమె ఎంతో
సమర్ధంగా ఏవేవో చిల్లర కారణాలను చూపుతూ ఎన్నో ప్రభుత్వాలను పడగొట్టగలిగింది.

బహుశః ఆ క్రీడలో ఆమె ఆఖరి ప్రయత్నం – 1984లో ఎన్‌టి
రామారావు ప్రభుత్వాన్ని కూడా పడగొట్టబోవడం. అది బెడిసికొట్టి ఇందిర భంగపడింది.

 

(ఋ) సోషలిజంపై
వల్లమాలిన మోజు,
జాతీయీకరణలో
వీరవిహారం:

పేదలకు సౌభాగ్యం పేరిట ఇందిర మొట్టమొదట దేశంలోని
14 పెద్ద ప్రైవేటు బ్యాంకులను జాతీయీకరణ చేసింది. ఆ చర్య మొదట్లో సత్ఫలితాలను
ఇచ్చినట్లు అనిపించినా
, కాలక్రమేణా అది పరోక్షంగా అస్మదీయుల పెట్టుబడిదారీ
విధానానికే
(Crony Capitalism) దారితీసి, దాని
దుష్ఫలితాలు 2004-14మధ్య (యుపిఎ ప్రభుత్వకాలంలో) పరాకాష్టకు చేరుకున్నాయి.
కోట్లాది రూపాయిలు మొండిబకాయిలై పోయాయి. ఎందరో వాటిని చెల్లించకుండానే కాలక్షేపం
చేయగలగడం
, కొందరైతే చక్కగా దేశంనుండే పారిపోగలగడం – అవన్నీ  మన కళ్ళెదుటే జరిగాయి. ప్రస్తుత ప్రభుత్వం ఆ
బకాయిలను సదరు ఎగవేతదారులనుండి రాబట్టడానికి పడని పాట్లంటూ లేవు.

తాను చేపట్టిన ఇటువంటి విప్లవాత్మకవిధానాల,రాజభరణాల రద్దువంటి మరికొన్ని జనాకర్షక చర్యల పేరు
చెప్పుకుని ‘గరీబీ హటావో’ వంటి నినాదాల హోరుతో ఇందిర 1977లో ఓట్లు సంపాదించుకుని
గద్దెనెక్కగలిగింది.

అక్కడతో ఆమె ఆగిపోలేదు – 1972లో 107 ప్రైవేటు
సాధారణ బీమా కంపెనీలను జాతీయం చేసి
, వాటిని నాలుగు ప్రభుత్వరంగ బీమా కంపెనీలుగా మార్చింది.
(నేషనల్‌ ఇన్సూరెన్స్‌
, న్యూ ఇండియా అస్యూరెన్స్‌, ఓరియెంటల్‌
ఇన్సూరెన్స్‌
& యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలు). ఆ
విధంగా ప్రభుత్వపు కనుసన్నలలోకి మరికొన్నిటిని తీసుకురావడంద్వారా
‘ప్రభుత్వ
పెత్తనానికి. మరొక అవకాశం ఏర్పడింది.

మరొకటి బొగ్గు రంగం. 1973 బొగ్గు గనుల చట్టం
ద్వారా ఆ రంగాన్ని కూడా జాతీయీకరణ చేసారు. నానాటికీ తీసికట్టు నాగంభొట్లూ
‘ అన్నట్లుగా
ఏయేటికాయేడు ఆ రంగంలోని ఫలితాలు క్షీణతను చూపించసాగాయి. దీని ప్రభావం ఎంత దారుణమైపోయిందంటే
– ప్రపంచంలో బొగ్గు నిల్వలలో 3వ స్థానంలో ఉన్న భారతదేశం 2014లో 200 మిలియన్‌
టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవలసిన దుస్థితి కలిగింది. కారణం
? వేరు
వేరు కారణాల వలన ఆ ‘కోల్ ఇండియా లిమిటెడ్’ తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని
పెంచుకోలేకపోవడమే.

అదిగాక, 1970లో శ్రీమతి గాంధీ మరొక చట్టాన్ని– Monopolies and Restrictive Trade
Practices Act (గుత్తాధిపత్యపు నియంత్రణ చట్టం) తీసుకువచ్చి,
ప్రైవేటు రంగాన్ని దాదాపుగా కూల్చివేసింది. (ఆ తరువాత ఎన్నో చర్చల తర్వాత
2002 ప్రాంతంలో దాని రద్దుకు అంకురార్పణ జరిగింది.)

ఆ తరువాత జాతీయీకరణ కోసం ఇందిర చేపట్టిన రంగం
చమురు రంగం. అది 1976లో జరిగింది.

నెహ్రూ, ఆయన కుమార్తె జాతీయీకరణ చేసిన సంస్థలలో
బహుకొద్ది మాత్రమే బ్రతికి బట్ట కట్టగలిగాయి – అది కూడా ఎంతోకాలం ఋణాత్మక ఫలితాలను
చవిచూసాక మాత్రమే) చాలామటుక్కు మూతపడ్డాయి. ఆ తరువాత పివి నరసింహారావు ప్రధానమంత్రిగా
,
మన్మోహన్‌ సింగ్‌ ఆర్థికమంత్రిగా ప్రభుత్వరంగ సంస్థలలో పాక్షికంగానో
సంపూర్ణంగానో పెట్టుబడుల ఉపసంహరణ మొదలుపెట్టడంతో (1991-96) పరిస్థితి కుదుటపడడం
మొదలైంది. ఆ ఉపసంహరణ
, మూసివేతలు వాజపాయి నేతృత్వంలో ఊపందుకున్నాయి.
అంతేగాక
, కాంగ్రెస్‌ ప్రధాన పార్టీగా ఉన్న యుపిఎ ప్రభుత్వం
కూడా (2004-2014) అదే ఉపసంహరణ/మూసివేత విధానాన్ని అనుసరించింది. (అయితే
, అదే
కాంగ్రెస్‌
, దాని అనుచర పార్టీలు ప్రైవేటీకరణ విషయమై మోడీ
ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడమనేది నేటి 
వింతలలో ఒకటి.)

ఇక BSNL వంటి సంస్థలకు ఎప్పటికప్పుడు ఊపిరిపోయడం జరుగుతూనే
ఉంది. (ప్రస్తుత ప్రభుత్వం 2023 జూన్‌ లో సుమారు రూ. 89వేల కోట్లు ఖర్చుచేసి ఆ
కంపెనీ బ్రతకడానికి మరొక అవకాశమిచ్చింది.) నెహ్రూ
, ఇందిరల
కాలంలో ప్రారంభించబడిన కొన్ని ప్రభుత్వరంగసంస్థల పరిస్థితి ఈ క్రింది విధంగా ఉంది:

* ఎయిర్‌ ఇండియా Air India –
టాటాల చేతుల్లో (మోదీ హయాంలో)

* ఇండియన్‌ టెలిఫోన్‌ పరిశ్రమ (ITI) –
(మోదీ హయాంలో ఈమధ్యనే తిరిగి తెరవబడింది)

*భారత్‌
అల్యూమినియం
& జింక్‌ – M/S వేదాంతకు
అప్పగించారు (2001 వాజపేయి హయాంలో)

* హిందుస్తాన్‌ కాపర్‌ – ఎప్పటికప్పుడు తగిన
అజమాయిషీ ఉన్నందున నెమ్మదిగా పుంజుకుంటోంది

* విదేశ్ సంచార్ నిగమ్ – టాటాల చేతుల్లో
(2000-2001 : వాజపేయి హయాంలో)

* మాడర్న్‌ ఫుడ్‌ ఇండస్ట్రీస్‌ – హిందుస్తాన్‌
లీవర్‌ చేతుల్లో టాటాల చేతుల్లో (2000-2001: వాజపేయి హయాంలో)

 

(ౠ) పాకిస్తాన్‌తో సిమ్లా ఒప్పందం:

1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్‌
గెలిచినా
, నిజానికి దానివలన మనం లాభపడిందేమీ లేదు.జాగ్రత్తగా గమనిస్తే మనం ఎన్నో పోగొట్టుకున్నామని
అర్థమౌతుంది. నిజానికి భారత్‌ సాధించినది –
‘ఒక
శత్రుదేశం చెరొక ప్రక్కన రెండు శత్రుదేశాలుగా ఏర్పడడం
‘ మాత్రమే.
ఆ గొప్ప విజయాన్ని సాధించడానికి మన దేశప్రజలు రిలీఫ్‌ ఫండ్‌ వంటివాటి రూపేణా భారీ
మూల్యం చెల్లించవలసివచ్చింది.
పైగా ఈ
‘భవిష్యత్‌ కృతఘ్నులు’
ఎందరో
ఆ యుద్ధం పేరు చెప్పి మన సరిహద్దుల్లో తిష్ట వేసుకుని కూర్చున్నారు.
సుమారు కోటిమంది బాంగ్లాదేశీయులు యుద్ధం ముగిసినా,
తమ దేశానికి తిరిగి వెళ్ళలేదు కూడా. తరువాత దాదాపు 35 సంవత్సరాలపాటు
బెంగాల్‌ను ఏలిన కమ్యూనిస్టుల
, ఆ తరువాత వచ్చిన మమతా బెనర్జీ కృపాకటాక్షాలకు
పాత్రులై వారిలో చాలామంది అస్సాం
, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాలలో ‘భారతదేశ
పౌరులైపోయారు.
(ఇదిగాక, ఎన్నికల సమయాల్లో సరిహద్దులు దాటి వచ్చి, వోట్లేసి
పోయే ‘గెస్ట్‌ ఆర్టిస్టుల’కు కూడా కొదవ లేదు.)

ఆ పాకిస్తాన్‌ యుద్ధం మనలను ఆర్థికంగా కూడా దెబ్బ
తీసింది. ఇదిగాక
, శ్రీమతి ఇందిరా గాంధీ (ఢాకాలో ‘పాకిస్తాన్‌
1971లో లొంగిపోయిన దరిమిలా) 1972 జూలై 2న సిమ్లాలో చేసుకున్న ఒప్పందం కారణంగా కూడా
మనం ఎన్నో విధాలుగా నష్టపోయాము.

నిజానికి ఆ యుద్ధం సమాప్తమైన రోజున మనకు 15వేల
చదరపు కిలోమీటర్ల భూభాగం సంక్రమించింది.
93వేల మంది
యుద్ధఖైదీలు పట్టుబడ్డారు. ఆ ఒప్పందం ప్రకారం ఆమె ఆ రెండింటినీ వదలివేసింది. దానితో
నర హంతకులైన ఆ ఖైదీలను
‘విచారణ చేసే అవకాశమూ పోయింది. పైగా పాకిస్తాన్‌ చెరసాలల్లో
మగ్గుతున్న మన ఖైదీలు కొందరికి ఈనాటికీ విముక్తి కలగలేదు.

 

(ఎ) ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలు లేకపోవడం. బాహాటంగా
పాకిస్తాన్‌ను సమర్ధిస్తూన్న అరబ్బు దేశాలపై 
అమితమైన మోజు:

నెహ్రూ కనీసం మనతో మొదట్నుంచీ సంబంధబాంధవ్యాలను
కాంక్షిస్తూ వచ్చిన ఇజ్రాయెల్‌ ఉనికినైనా గుర్తించాడు గానీ
, ఇందిర
కనీసం ఆ దేశంతో ఏ విధమైన సత్సంబంధాలనూ పెట్టుకోలేదు. పైగా దాని శత్రువులైన అరబ్‌
దేశాల పట్ల మాత్రం ఎంతో ప్రేమ చూపేది. మొరాకో రాజధాని రాబాత్‌లో 1969లో మనకు పెద్ద
అవమానం జరిగిన ఉదంతమే దానికి పెద్ద ఉదాహరణ.

1969లో మొరాకో రాజధాని రాబాత్‌ లో ఒక ఇస్టామిక్‌
సభ జరిగింది. అది నూటికి నూరుపాళ్ళూ ఇస్లామిక్‌ దేశాల సభ. ఏవిధంగా చూచినా మనకు
బొత్తిగా సంబంధం లేనిది.
అందులో
మనం వేలు పెట్టవలసిన పనే లేదు. ‘ఆ దేశాలతో మన స్నేహం పాకిస్తాన్‌తో వారి
స్నేహాన్ని మించినది అని ఋజువు చేయడానికా’ అన్నట్లు మన ప్రభుత్వం ఎంతో శ్రమించి
ఆహ్వానాన్ని తెప్పించుకుంది.

అప్పటి మన పరిశ్రమల మంత్రి ఫక్రుద్దీన్‌ అలీ
నాయకత్వంలో ఆ సభకు వెళ్ళిన మన బృందానికి మొదటి రోజు బాగానే గడిచింది. అసలు సమస్య
రెండవరోజు తలెత్తింది. అప్పటి పాకిస్తాన్‌ అధ్యక్షుడు యాహ్యాఖాన్‌ రెండవరోజున
‘ఈ
భారతదేశబృందాన్ని గనుక ఆ సభలోనికి రానిస్తే తాను ఆ సభకు రానంటూ మొండికేశాడు.
(అతడికి అప్పుడు మూడు దేశాలు ఆప్తదేశాలుగా ఉన్నాయి. జోర్డాన్‌ వాటిలో ఒకటి.)
దానితో మొరాకో రాజు ఆ సభకు ఇక రావద్దని చెప్పడంతో మన బృందానికి ఘోరావమానం జరిగింది.
గత్యంతరం లేక వాళ్ళు అవమానభారంతో స్వదేశానికి తిరిగి రావలసి వచ్చింది. (ఆ
ఫక్రుద్దీన్‌ అలీ గారే 1975లో విధించిన ఎమర్జెన్సీ ప్రకటనపై సంతకంపెట్టిన
రాష్ట్రపతి.)

మోదీ పాలనలో ఇప్పటి పరిస్థితి:

ప్రస్తుతం మోదీ హయాంలో ఇజ్రాయెల్‌ మనకు ముఖ్యమైన
ఆప్తదేశం.
అలాగని దాని శత్రుదేశాలైన అరబ్‌ దేశాలతోనూ మన
సంబంధబాంధవ్యాలు ఏమీ చెక్కుచెదరలేదు. అవీ మన మిత్రదేశాలే. ఈనాడు ఎన్నో దేశాలు మన
దేశపు మార్గదర్శకత్వాన్ని శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నాయి కూడా. దీనికంతటికీ
గతంలో విదేశాంగమంత్రిణిగా పనిచేసిన శ్రీమతి సుష్మా స్వరాజ్‌
, ప్రస్తుత
విదేశాంగమంత్రి జయశంకర్‌ కృషి కారణం అని మన ప్రతిపక్షాల వారిలో ఎంతోమంది కూడా
అంగీకరిస్తారు. (2023 అక్టోబర్‌ 7న హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌ పౌరులపై హఠాత్తుగా
దాడిచేసి
, ఎందరినో పొట్టన పెట్టుకున్నప్పుడు మన దేశం
నిర్ద్వంద్వంగా ఇజ్రాయెల్‌ను సమర్థించింది. ఆ తరువాత ఇజ్రాయెల్‌ గాజాపై బాంబుల
వర్షం కురిపించగా
, అక్కడ నిస్సహాయులైపోయిన పాలస్తీనా ప్రజలకు ఆహార,
వైద్యసదుపాయాలను అందిస్తోంది. ఇదే ఇప్పటి మన నిజమైన తటస్థ విధానం.)

 

(ఏ) ఇందిర మంత్రులలో చాలామంది విలాసాలకు పరిమితం
కావడం:

ఇందిర నియంతృత్వపు పోకడల మాట అటుంచి, ఆమె
మంత్రివర్గంలో చాలామంది అసమర్ధులు కావడంతో నిజమైన ప్రజాహిత కార్యక్రమాలు
జరగవలసినంతగా జరగలేదు. వారిలో చాలామంది విలాసవంతమైన జీవితాలను గడుపుతూ తమవాళ్ళను
బాగానే పైకి తెచ్చుకున్నారు. ఎమర్జెన్సీ కాలంలో (1975-77) విద్యాచరణ్‌ శుక్లా
,
సిద్దార్ధ్‌ శంకర్‌ రే, బన్సీలాల్‌ వంటి మంత్రుల పేర్లే ఎక్కువ వినిపించేవి.
ఇందిరాగాంధీ ప్రభ విపరీతంగా వెలిగిపోతున్న రోజుల్లో ఆమెను తెగ పొగిడే వ్యక్తులలో
ఒకడైన
‘దేవకాంత్‌ బారువా “ఇందిరాయే ఇండియా, ఇండియాయే
ఇందిరా” అంటూ నలుగురిలో అనేశాడు కూడా. (ఇందిర పదవి పోయినప్పుడు అదే బారువా
,
బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్‌లో చేరిపోయాడు) ఇక, ఆంధ్రప్రదేశ్‌కు
చెందిన ఒక మంత్రి ఐతే సంజయ్‌గాంధీతో ”మీ ముత్తాత చెప్పులు మోశాను
, మీ తాత
చెప్పులూ మోశాను
, మీ అమ్మవీ మోస్తున్నాను, నీవి
మోయడానికి కూడా సదా మి సేవకుడనే” అన్నాడు.

1980లో ఇందిర మళ్ళీ ప్రధాని ఐనప్పుడు
నియమించుకున్న మంత్రులలో కొందరు వాళ్ళ అసమర్థతకు
, నియంతృత్వానికీ
పేరొందారు. రైళ్ళద్వారా సమర్ధంగా నడుస్తున్న రైల్వే మెయిల్ సర్వీస్‌ను రద్దు చేసిన
ఘనత సిఎం స్టీఫెన్‌ అనే మంత్రిది. (అంతవరకూ సమర్థమైన సంస్థలలో ఒకటైన తపాలా సంస్థ
సేవలు కుంటుపడి పోయాయి.) అలాగే ఘనీఖాన్‌ చౌధురీ అనే అమాత్యుడు రైల్వేమంత్రిగా
ఎక్కడ లేని విలాసవంత సౌకర్యాలను తన మాల్దా నియోజకవర్గాని

Tags: Administration SkillsIndira GandhiLeadershipOur Prime Ministers
ShareTweetSendShare

Related News

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం
general

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు
general

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్
Opinion

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు
Opinion

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు

1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కారణం ఎవరు, ఎలా?
Opinion

1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కారణం ఎవరు, ఎలా?

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.