Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home చరిత్ర, సంస్కృతి

మన ప్రధానమంత్రులు : ఉపోద్ఘాతం

param by param
May 12, 2024, 10:32 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Our Prime Ministers, Their Leadership and Administration Skills Special Series – Introduction 

***************************************

సత్యరామప్రసాద్ కల్లూరి రచన

***************************************

మన ప్రధానమంత్రులు:
ఉపోద్ఘాతం

***************************************

 

వివిధ ప్రధానమంత్రుల పరిపాలనలలో
భారతదేశపు ప్రజాస్వామ్యం ఎలా సాగింది?

 

నరేంద్రమోదీ 2014లో 14వ ప్రధానమంత్రి
పదవి చేపట్టినప్పటినుండి ఆయనంటే గిట్టనివాళ్ళు చాలామంది, ఆయన ‘మైనారిటీలకు
వ్యతిరేకి అనీ, పెట్టుబడిదారులపై పక్షపాతం చూపిస్తున్నాడనీ, నిరంకుశత్వపు పోకడలు
కలిగిన వాడనీ, అభివృద్ధి నిరోధకుడనీ’… ఇలా నిరంతరాయంగా ఎన్నో అపవాదులు వేస్తూనే
ఉన్నారు. వాటికి కారణాలేమిటో వాళ్ళకే తెలియాలి. నిజానికి వాస్తవాలు, గణాంకాలూ
వాళ్ళు ఆడిపోసుకుంటున్నదానికి వ్యతిరేకంగా ఉన్నాయి మరి.

గతంలో ‘పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు
తన కుర్చీలో కునికిపాట్లు తీసిన’ ఒక ప్రధాని గురించీ, ‘కేవలం తమకు వంశపారంపర్యంగా
సంక్రమించిన కారణంగా గద్దెనెక్కగలిగిన’ ప్రధానుల గురించీ, ‘ఏ నిర్ణయాలనూ సకాలంలో
తీసుకోని’ ప్రధానుల గురించీ, ‘ఈ దేశపు వనరులపైన మైనారిటీలదే మొదటి హక్కు’ అని సభలలో
ప్రకటించిన మరొక ప్రధాని గురించీ విని ఉన్నాం.

అయితే మోదీ విషయానికి వస్తే ఆయన మార్గమే
పూర్తిగా విలక్షణమైనది. ఆయన వినయశీలత, అంకితభావం ఉన్న ఒక రాష్ట్రీయ స్వయంసేవకుడిగా
(ఆర్ఎస్ఎస్) తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి, 1991లో కశ్మీర్‌లో ఉగ్రవాదం పెచ్చుమీరిన
తరుణంలో ఉగ్రవాదుల సవాలును స్వీకరించి కనీసం బులెట్‌ప్రూఫ్ జాకెట్ అయినా
వేసుకోకుండా శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో మురళీమనోహర్‌ జోషితో పాటు మువ్వన్నెల జెండాను
ఎగురవేసి తన దేశభక్తిలో పరాకాష్ఠను చాటుకున్నాడు. తదనంతరం ఆయన ఆర్ఎస్ఎస్‌లో
స్వయంసేవకుడిగా తన పని కొనసాగిస్తూ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమితుడై,
మచ్చలేని నాయకుడిగా ఆ పదవిలో 13ఏళ్ళపాటు ప్రతిభావంతంగా కొనసాగాడు. కాంగ్రెస్ పాలనతో
ప్రజలు విసిగిపోయారని భావించి భారతీయ జనతా పార్టీ తనను ప్రధానమంత్రి అభ్యర్ధిగా
ప్రకటించగా, ఆ పార్టీకి తగిన విధంగా ప్రచారం చేసి, దాని విజయానికి ముఖ్యకారకుల్లో
తాను కూడా ఒకడయ్యాడు. ప్రధానిగా ఆయన 2014-19 వ్యవధిలో సమర్థంగా పనిచేసిన కారణంగా
2019లో ఆయనకు దేశప్రజలు మరింత ఆధిక్యంతో తిరిగి పట్టం కట్టారు. ఆ ఎన్నికలలో కేవలం
భారతీయ జనతా పార్టీ సభ్యుల సంఖ్యే 300 దాటిపోయింది.

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల వేళ
మోదీ ప్రభుత్వం 10ఏళ్ళ పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకోబోతోంది. ఆ నేపథ్యంలో ‘లక్షణాల
రీత్యా, పరిపాలన రీత్యా, రాజనీతిజ్ఞత రీత్యా’ ఇతర ప్రధానుల పరిపాలనతో మోదీ జట్టు
పరిపాలనను పోల్చడానికి ప్రయత్నం జరిగింది.
[దాని ఆంతర్యం ఇతర ప్రధానుల దేశభక్తినీ, నిజాయితీని,
సామర్థ్యాన్నీ శంకిచడం కాదని పాఠకులు గ్రహించాలి. వ్యక్తిగత సామర్థ్యాలు కాక, ఆయా
ప్రభుత్వాల మొత్తం సమర్ధతలు మాత్రమే ఈ వ్యాసపరంపరలో పోల్చబడ్డాయి
]

అలా చేయడంలో
ముందుగా మోదీ గారి నాయకత్వ లక్షణాలను కొన్ని పేర్కొనడం అసమంజసం కాదు.

Ø  అనుకున్న పనులు నిర్వర్తించడానికి కావలసిన
దృఢ సంకల్పం, పట్టుదల : కశ్మీర్‌కు సంబంధించిన 370వ అధికరణం తొలగింపు, ‘ముస్లిం
మహిళల శ్రేయస్సుకై’ మూడుసార్లు చెప్పే విడాకుల పద్ధతిని నిషేధించే చట్టం, ‘మహిళా
రిజర్వేషన్ చట్టం’ ఇప్పటికే తెచ్చారు. ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ ఉమ్మడి
పౌరస్మృతి, మరికొన్ని చట్టాలకై కూడా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Ø  భారతదేశపు సాంస్కృతిక వారసత్వం పైన ఎనలేని
గౌరవం, వెన్నెముకగా మొక్కవోని దేశభక్తి (సర్వోచ్చ న్యాయాలయంలో రామజన్మభూమికి
అనుకూలంగా తీర్పు వచ్చాక తాను అయోధ్యలో జరిగిన ‘శిలాన్యాస’ కార్యక్రమంలో స్వయంగా
పాల్గొనడం)

Ø  అవినీతికి తావివ్వకపోవడం, బంధుప్రీతి
చూపకపోవడం (నేటికీ ఆయన కుటుంబ సభ్యుల వివరాలు చాలామందికి తెలియవు. ఎవరూ ఈయన పేరు
చెప్పుకుని తమ పనులు చేయించుకోవడం ఇంతవరకూ జరగలేదు’.

Ø   తాను చేసే ప్రతీ పనినీ ముక్కుసూటిగా చేస్తూ వృధాఖర్చులు
తగ్గించడం (ఢిల్లీ పార్లమెంటు క్యాంటీన్‌లోని విపరీతమైన రాయితీలను దాదాపు
తొలగించేయడంతో బొక్కసానికి సాలుకు రూ.8,000 కోట్ల చొప్పున మిగులుతున్నాయని అంచనా.

Ø  లెక్కకట్టిన తెగింపు (Calculated Risk)తో‘500, 1000 రూపాయల నోట్ల రద్దు’ మొదలైన
నిర్ణయాలు తీసుకోవడం

Ø  మన్‌ కీ బాత్ వంటి కార్యక్రమాల ద్వారా
ప్రజలతో తన భావాలు పంచుకునేందుకు మక్కువ చూపడం

Ø  అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తులకు (రాజ్యసభ
సభ్యత్వం వంటి) సముచిత స్థానం కల్పించి వారి ద్వారా వ్యవహారాలు నడిపించడం (విదేశాంగ
మంత్రి జయశంకర్, రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ మొదలైన వారు ఈ కోవకు చెందిన వారే)

Ø  అర్హులైన వ్యక్తులను వారి నేపథ్యంతో కానీ, వారి పార్టీల నేపథ్యంతో
కానీ పట్టించుకోకుండా ప్రోత్సహించడం (కరోనా రోజులలో హైదరాబాద్‌లోని ‘భారత్
బయోటెక్’ను 2020 నవంబర్‌లో సందర్శించడం, చంద్రయాన్-3 విజయవంతమైన సందర్భంలో తన
విదేశీ పర్యటన ముగియగానే 2024 ఆగస్టు చివరివారంలో ఎకాయెకీ బెంగళూరు వెళ్ళి ఇస్రో
శాస్త్రవేత్తలను అభినందించడం మొ
దలైనవి)

Ø  ‘నిజంగా అర్హులైనవారికి శ్రేయస్సు’ కలిగించే
సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం (బీదసాదలకు రేషన్ల రూపేణా పెద్దమొత్తాలు
ఖర్చుపెట్టడం, కోవిడ్ వ్యాక్సిన్ల ఉచిత పంపిణీ మొదలైనవి)

Ø  రైల్వే, రోడ్డు రవాణా వంటి రంగాలలో
వేగవంతమైన, విప్లవాత్మకమైన మెరుగుదల ద్వారా మౌలిక సదుపాయాలను పెంపొందించడం, వేగవంతమైన
రైళ్ళను దశలవారీగా ప్రవేశపెట్టడం

Ø  గత ప్రభుత్వాలు తీసుకున్న ప్రయోజనకరమైన
సలహాలు, నిర్ణయాలను కూడా స్వీకరించి అమలు చేయడానికి సంసిద్ధత (గత యూపీయే ప్రభుత్వ
హయాంలో నందన్ నీలేకని ప్రతిపాదించిన ఆధార్ కార్డ్ విధానాన్ని అమలుపరచడం, అదే
ప్రభుత్వం తలపెట్టిన జిఎస్‌టి విధానానికి సంబంధించిన చట్టాన్ని తీసుకురావడం
మొదలైనవి)

Ø  సమస్యాత్మక, దేశద్రోహపూరిత సంస్థలపై జాతీయ
నిఘా సంస్థ వంటి విభాగాల సహాయంతో సకాలంలో కఠోర నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ
వేయకపోవడం (‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ అనే ఉగ్రవాద సంస్థను 2022లో నిషేధించడం
మొదలైనవి)

Ø  అంతే ముఖ్యమైన చివరి అంశం – మోదీ నేతృత్వంలో
భారత్ ఈమధ్యకాలంలో శత్రుదేశాల పైన సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడం వంటి చర్యల
ద్వారా అవసరమైనప్పుడల్లా యుద్ధసంసిద్ధతకు సంబంధించి తన సామర్థ్యాన్ని ఇప్పటికే చాటగలిగింది.
ఇదంతా మోదీకి ఉన్న అకళంక దేశభక్తిని, అవసరమైన సందర్భాలలో శత్రుదేశాలకు తగిన
గుణపాఠాలను నేర్పడానికి గల సంసిద్ధతనూ తెలియజేస్తోంది.

 

అన్నట్లు, ఈమధ్య
అంతర్జాతీయంగానూ, జాతీయంగానూ జరుపుతున్న ఎన్నో ప్రజాదరణ సర్వేలలోనూ మోదీదే ‘ప్రథమస్థానం’.

 

ఇక, భారతదేశం
1950 జనవరి 26న సర్వసత్తాక ప్రజాస్వామ్యంగా ఏర్పడినప్పటినుండి నేటివరకు ఒక్కొక్క
ప్రధాని ఆ పదవిని చేపట్టేందుకు దోహదపడిన అంశాలు, వారి పాలనలోని బాగోగులు, ఆ
ప్రభుత్వం సమాప్తం కావడానికి గల కారణాలు…. వరుసగా తెలుసుకుందాం.

Tags: Administration SkillsLeadershipNarendra ModiOur Prime Ministers
ShareTweetSendShare

Related News

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం
general

అయోధ్య రామయ్య ఆలయంలో సొరంగ మార్గం

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు
general

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్
Opinion

నెహ్రూది ఎప్పుడూ ముస్లిముల బుజ్జగింపు ధోరణే: అంబేద్కర్

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు
Opinion

అంబేద్కర్ పేరెత్తే అర్హత కాంగ్రెస్‌కు లేదనడానికి 11 కారణాలు

1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కారణం ఎవరు, ఎలా?
Opinion

1952 ఎన్నికల్లో అంబేద్కర్ ఓటమికి కారణం ఎవరు, ఎలా?

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.