Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

సందేశ్‌ఖాలీ కేసులో సీబీఐ విచారణకు కలకత్తా హైకోర్టు ఆదేశం

param by param
May 12, 2024, 09:32 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Calcutta High Court orders CBI probe in Sandeshkhali case

పశ్చిమబెంగాల్‌లో సంచలనాత్మక సందేశ్‌ఖాలీ కేసులో
కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ
ఆదేశించింది. ఆ కేసులో స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేతలు భూకబ్జాలు, లైంగిక వేధింపుల
ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఆ కేసులో హైకోర్టు తీర్పునిస్తూ సందేశ్‌ఖాలీ
వివాదంపై నిశిత విచారణ జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలనీ సీబీఐని ఆదేశించింది.
మరీ నిర్దిష్టంగా, హిందూ మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలపైనా, చేపల సాగు పేరుతో
భూమిని అక్రమంగా బదలాయింపు చేసే కుంభకోణాల పైనా దృష్టి సారించాలని స్పష్టం
చేసింది. భూ ఆక్రమణల ఆరోపణలపై విచారణ కోసం వెళ్ళిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
అధికారులపై దాడులు చేసిన ఘటన నేపథ్యంలో ఈ కేసు విచారణ విషయంలో న్యాయస్థానం మరింత
పట్టుదలగా ఉంది.

ఈ కేసులోని సంక్లిష్టతల కారణంగా నిష్పాక్షికమైన
విచారణ జరపాలని హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. సీబీఐ దర్యాప్తుకు
పూర్తిస్థాయిలో సహకారం అందించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసుకు
సంబంధించి ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రత్యేకంగా ఒక వెబ్‌పోర్టల్ లేదా ఇ-మెయిల్
ఐడీ ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

సందేశ్‌ఖాలీ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు, ఎల్‌ఈడీ
వీధిదీపాలూ 15 రోజుల్లోగా అమర్చాలని కోర్టు ప్రత్యేకంగా ఆదేశించింది. ఈ పనిని
ప్రాధాన్యతాంశంగా పరిగణించాలనీ, దానికి కావలసిన నిధులను రాష్ట్రప్రభుత్వమే
సమకూర్చాలనీ స్పష్టంగా తేల్చిచెప్పింది.

సందేశ్‌ఖాలీకి చెందిన తృణమూల్ నాయకుడు షేక్
షాజహాన్ అక్రమాలపై విచారణ జరిపేందుకు కొన్ని నెలల క్రితం ఈడీ అధికారులు అక్కడకు వెళ్ళారు.
ఆ సమయంలో వారిపై షాజహాన్ అనుచరులు దాడి చేయడం సంచలనం సృష్టించింది. అంతలో అక్కడి హిందూ
మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి షాజహాన్, అతని అనుచరులు నియోజకవర్గ పరిధిలోని
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలను బైటపెట్టారు.

ఆ విధంగా షేక్ షాజహాన్
బృందం అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత కూడా షాజహాన్‌ను అరెస్ట్ చేయకుండా
మమతా బెనర్జీ ప్రభుత్వం, పోలీసులు చాలా తాత్సారం చేసారు. కోర్టు జోక్యం తర్వాతనే
అతన్ని అరెస్ట్ చేసారు. ఇప్పటికీ మమతా బెనర్జీ పార్టీ షేక్ షాజహాన్‌ను నామమాత్రంగా
సస్పెండ్ చేసినా, అతన్ని రక్షించడానికి అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తూనే ఉంది. ఈ
నేపథ్యంలో సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags: Calcutta High CourtCBI probeMamata Banerjeesandeshkhali caseSheikh Shahjahantmc
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.