Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

పాకిస్తానీ హిందూ శరణార్థులకు సిఎఎ అర్హత సర్టిఫికెట్లు

param by param
May 12, 2024, 09:15 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

CAA eligibility certificates for Hindu immigrants from
Pakistan

పాకిస్తాన్‌లో దారుణమైన పీడనకు, మతహింసకూ గురై
భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులకు ఆశ్రయం కల్పించడం, వారికి చట్టబద్ధమైన
గుర్తింపు ఇప్పించడం కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ సంస్థ ‘సీమాజన్
కళ్యాణ్ సమితి’ కృషి చేస్తోంది. గత వారం రోజులుగా రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో
పాకిస్తానీ హిందూ శరణార్థులకు క్యాంపులు నిర్వహిస్తోంది. ఆ క్యాంపుల ద్వారా వారికి
అర్హత సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం 2019 కింద భారత
పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోడానికి ఆ అర్హత సర్టిఫికెట్లు అవసరం.

సీమాజన్ కళ్యాణ్ సమితి ప్రస్తుతం పాకిస్తాన్
సరిహద్దు ప్రాంతాల్లో పనిచేస్తోంది. బాఢ్‌మేర్, జైసల్మేర్, జోధ్‌పూర్‌లలో
నివసిస్తున్న 300కు పైగా శరణార్థులకు సహాయం అందజేసింది. శరణార్థులకు పౌరసత్వం కోసం
కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన అధికారిక వెబ్‌సైట్‌లో వారి డాక్యుమెంట్లను అప్‌లోడ్
చేస్తోంది.

సీమాజన్ కళ్యాణ్ సమితి కేంద్రప్రభుత్వం వద్ద రిజిస్టర్
అయిన సంస్థ కావడంతో శరణార్థులకు అర్హత సర్టిఫికెట్లు జారీ చేసేందుకు దానికి
అధికారం ఉందని ఆ సంస్థ సభ్యుడు, అడ్వొకేట్ అయిన విక్రమ్‌సింగ్ రాజ్‌పురోహిత్
వెల్లడించారు. ఆ సర్టిఫికెట్లను స్థానిక పూజారులు కూడా జారీ చేయవచ్చు. దరఖాస్తుదారులు
హిందువులే అని వారు నిర్ధారించి వారికి పౌరసత్వానికి అర్హత ఉందని సర్టిఫై చేయగలరు.
తద్వారా హిందూ శరణార్థులకు పౌరసత్వం పొందేందుకు వీలు కలుగుతుంది.

పాకిస్తాన్‌ నుంచి ఏదో ఒకరకంగా భారత్ వచ్చి,
ఇక్కడి పౌరసత్వం కోసం ఎన్నోయేళ్ళుగా అగచాట్లు పడుతున్న వారికి సీమాజన్ కళ్యాణ్
సమితి చేస్తున్న ఈ  సహాయం కొత్త ఊపిరులు
అందిస్తోంది. పౌరసత్వం పొందడానికి గతంలోనూ విధానాలున్నా, అవి ఎప్పుడూ సరిగ్గా అమలు
కాలేదు. అయితే మోదీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చింది. శరణార్థుల్లో
కొత్త ఆశలు చిగురించాయి. 1998లో భారత్‌కు వచ్చి ఇప్పటికీ ఇంకా పౌరసత్వం కోసం
ఎదురుచూస్తున్న ఒక మహిళ కష్టాలు తనను కలచివేసాయని రాజ్‌పురోహిత్ చెప్పుకొచ్చారు. ఒక్క
జోధ్‌పూర్‌లోనే పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న శరణార్థులు సుమారు 6వేల మంది
ఉన్నారు.

రాజస్థాన్ రాష్ట్రంలో పాకిస్తానీ హిందూ
శరణార్థులు నివసిస్తున్న సెటిల్‌మెంట్‌లు 400 వరకూ ఉన్నాయి. వాటిలో సుమారు 2లక్షల
మంది శరణార్థులు ఉన్నారు. వారంతా ఒకేసారి భారత్‌లోకి వచ్చిన వారు కారు.
గమనించాల్సిన విషయం ఏంటంటే వారందరూ భారత్‌లోకి చట్టబద్ధంగా, తమ ఉనికితో
వచ్చినవారే. తీర్థయాత్రల కోసమో, పర్యాటక వీసాల మీదనో వచ్చినవారే. వారందరూ 1955
నాటి పౌరసత్వ చట్టంలోని సెక్షన్లు 5,6 కింద భారత్‌లో పౌరసత్వం పొందడానికి అర్హత
ఉన్నవారే.

ఇప్పుడు అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ఆ శరణార్థులందరికీ
గొప్ప ఊరటగా నిలిచింది. భారతీయ పౌరసత్వాన్ని పొందడానికి ఒక మెరుగైన దారిని
చూపించింది. చట్టబద్ధమైన పద్ధతుల్లో భారత్‌లోకి శరణార్థులుగా ప్రవేశించిన వారికి
పౌరసత్వం పొందడానికి అర్హత వ్యవధిని 12ఏళ్ళ నుంచి 5ఏళ్ళకు తగ్గించారు. అయితే ఇంకా
కొన్ని సవాళ్ళు ఉన్నాయి. ఉదాహరణకి, పశ్చిమ బెంగాల్‌లోకి వచ్చిన మతువా తెగకు చెందిన
హిందువుల బంగ్లాదేశ్‌ నుంచి 1971 యుద్ధం సమయంలోనూ, ఆ తర్వాతా వలస వచ్చారు. వాళ్ళ
గురించి అదనపు సమాచారం కావాలని సీఏఏ పోర్టల్ అడుగుతోంది. అలాంటి కొన్ని సమస్యలను
పరిష్కరించి, హిందూ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి కేంద్రం సుముఖంగానే ఉంది.

Tags: caaEligibility CertificatesHindu ImmigrantsPakistanRSS
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.