Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

పసుపు, సంగీత్, తలంబ్రాలు, పల్లకీ… హిందూ వివాహ సంప్రదాయాలు కావు: షర్మిల

param by param
May 12, 2024, 07:42 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Sharmila says Haldi, Sangeet, Palanquin etc are not Hindu marriage rituals 

తెలంగాణలో పార్టీ
పెట్టి, దాన్ని నిలబెట్టుకోలేక కాంగ్రెస్‌లో విలీనం చేసి, ఆంధ్ర కాంగ్రెస్‌కు
అధ్యక్షురాలిగా కొత్త ఆట మొదలుపెట్టిన షర్మిలక్క… హిందువులను విమర్శిస్తూ, వారి
వివాహ పద్ధతులను వారివి కానేకావు అని అపహాస్యం చేస్తూ మాట్లాడింది. పసుపు హిందువుల
సొంతమా అని ప్రశ్నించింది. పనిలో పనిగా దానికి రాజకీయ రంగు కూడా పూసి పసుపు,
ఆరెంజ్ ఏమైనా బీజేపీ సొంత రంగులా అని ప్రశ్నించింది. తన కొడుకు పెళ్ళిలో హిందూ
వివాహ వేడుకలు జరపడం మీద వచ్చిన వ్యాఖ్యలను తట్టుకోలేక వాటిని తప్పుపట్టింది. ఆవిడ
మాత్రం హిందూ వివాహ పద్ధతులను హిందువుల సొంతం కాదంటూ వ్యాఖ్యానించడం తప్పు కాదేమో.

ఇటీవల షర్మిలక్క
కొడుకు రాజారెడ్డి పెళ్ళి ప్రియా అట్లూరి అనే అమ్మాయితో జరిగింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో
‘డెస్టినేషన్ వెడ్డింగ్’ పద్ధతిలో పెళ్ళి జరిపించారు. ఆ సందర్భంగా హిందూ వివాహ
పద్ధతిలో పాటించే పసుపు పెట్టడం, సంగీత్, ఊరేగింపు, తలంబ్రాలు, దండలు
మార్చుకోవడం… అన్ని వేడుకలనూ జరుపుకున్నారు. దాంతో సోషల్ మీడియాలో రకరకాల
వ్యాఖ్యలు వచ్చాయి. ఓ పక్కన పెళ్ళి చేసుకోడానికి హిందూ పద్ధతులు కావాలి, కానీ
వాటిని హిందూ పద్ధతులు అని పిలిస్తే మాత్రం బాధ వస్తుంది. కరుడుగట్టిన
క్రైస్తవులుగా, తమ కొడుకు పెళ్ళిలో హిందువులను క్రైస్తవంలోకి మార్చామని చెప్పుకోడానికి
మాత్రం గర్వం వస్తుంది.

తన కొడుకు పెళ్ళి
క్రైస్తవ సంప్రదాయంలోనే జరిగింది అని షర్మిలక్క చెప్పుకుంది. అయితే క్రైస్తవ
పద్ధతిలో వేడుకలు ఏమీ ఉండవు కాబట్టి, హిందూ వివాహ వేడుకలను జరుపుకున్నాం అని
చెప్పుకోడానికి మాత్రం మతం అడ్డం వచ్చింది.

పసుపు రాయడం అని తెలుగువారు
అన్నా, హల్దీ అని ఉత్తర భారతీయులు అన్నా, అది హిందువుల వివాహ పద్ధతిలోనే ఉంటుంది.
సరే, తన కొడుకు పెళ్ళిలో హిందూ వేడుక చేసుకోవడం ఆవిడకి ఇష్టం. ఆ విషయాన్ని
ఒప్పుకోడానికి మాత్రం కడుపులో నుంచి బాధ వచ్చేసింది. పసుపు యాంటీసెప్టిక్ అట..
దాన్ని వంటల్లో వాడతారట… పసుపు హిందువులది అని ఎక్కడా లేదట. అందువల్ల
పెళ్లికూతురికి పసుపు రాయడం హిందూ పద్ధతి ఎలా అయిందో ఆవిడకు అర్ధం కాలేదట. ఏ క్రైస్తవ
వివాహ పద్ధతిలో పసుపు పూస్తారో మరి?

ఇంక ‘సంగీత్’ అనే
వేడుక జరుపుకుని అందులో 35 ఏళ్ళ తర్వాత తను డాన్స్ వేసానని కూడా షర్మిలక్క
చెప్పింది. తన కొడుకు పెళ్ళిలో తన తల్లితోనూ స్టెప్పులు వేయించానని
ముసిముసినవ్వులు నవ్వుకుంటూ చెప్పింది. సరే, ఎవరి ఆనందం వారిది. కానీ హిందూ పద్ధతి
పెళ్ళిళ్ళలో జరుపుకునే వేడుకలు చేసుకుని, వాటికీ హిందువులకీ సంబంధం లేదని ఎలా
అంటుంది?

షర్మిల చెప్పిన
ప్రకారం… పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు అమెరికాలో ఓ చర్చ్‌మేట్స్‌ అట. అక్కడ
ప్రేమించుకుని ఇక్కడ (హిందూ పద్ధతిలో వేడుకలు జరుపుకుంటూ) క్రైస్తవ పెళ్ళి
చేసుకున్నారు. పెళ్ళి పాస్టరు గారు చేసారట. అక్కడ అనిల్ గారు (షర్మిల భర్త,
పెళ్ళికొడుకు తండ్రి) వాక్యం చెబితే ఆ వాక్యం విని ‘అన్యులు అయిన ఒక జంట’
క్రీస్తుని అంగీకరించారు కూడానట. (అంటే ఇంకెవరు… హిందువులే. వారిని మతం మార్చిన
సంగతిని ‘అన్య’మైన మాటలలో చెప్పింది షర్మిలక్క) వారిని అలా మతం మార్చడం తనకు ఆనందం
కలిగించిందని కూడా చెప్పింది షర్మిలక్క.

ఆ తర్వాత ‘‘తలంబ్రాలు
పెట్టుకున్నాం. తలంబ్రాలు అంటే ఒక పురోహితుడు లేడు, ఒక మంత్రం లేదు, తలంబ్రాలు
అంటే మామూలుగా నార్త్ ఇండియన్స్ చేసినట్టు బారాత్ స్టైల్‌ అనుకున్నారు. గ్రూమ్స్
సైడ్ నుంచి బారాత్ స్టైల్‌లో వచ్చాము. అక్కడ కొన్ని స్టెప్పులు కూడా వేసాము. ఆ
తర్వాత పెళ్ళికూతురిని పల్లకీలో తీసుకొచ్చి కూచెబెడితే ఇద్దరూ ఒకరి మీద ఒకరు
ముత్యాలు వేసుకున్నారు. ఒకరి మీద ఒకరు పూలు చల్లుకున్నారు. ఆ తర్వాత బంతి
ఆడుకున్నారు. ఆ తర్వాత చెంబులో ఉంగరం వేసి ఎవరు తీస్తారు అని పోటీ పెడితే రాజా
తీసాడు’’ అని సవిస్తరంగా వివరించి చెప్పింది షర్మిలక్క. ఆ క్రమంలో షర్మిలక్క ఎంతో ఆనందంగా
ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆ వేడుకలను ఎంతలా ఎంజాయ్ చేసిందో ఆ ఆనందాన్ని
వ్యక్తీకరించింది. ఆ వెంటనే, ‘‘ఇందులో హిందూ పద్ధతి ఎక్కడుందో, మీరు నాతోపాటు
ఏకీభవిస్తారని, హిందూ పద్ధతి ఎక్కడుందో నాకైతే అర్ధం కాలేదు’’ అని ఎంతో అమాయకంగా
తన చర్చ్‌మేట్స్‌ను అడిగింది.

షర్మిలక్క అక్కడితో
ఆగలేదు. ‘‘సే ఫరెగ్జాంపుల్, బీజేపీ పార్టీ పసుపు రంగో, ఆరెంజ్ రంగో వాళ్ళెక్కువ
వాడితే, ఆ రంగేం వాళ్ళ సొంతం కాదు. ఆ రంగు వాళ్ళేం క్రియేట్ చెయ్యలేదు. ఆ రంగుల్ని
సృష్టించింది మన దేవుడు’’ అంటూ తమ పెళ్ళిలో వాడిన పసుపుకి రాజకీయ రంగు పూసేసింది. తన
కొడుకు పెళ్ళిలోకి బీజేపీని లాక్కొచ్చింది.

చివరిగా షర్మిలక్క
తన మతం గురించి మరోసారి తన మతస్తులకు వివరణ ఇచ్చుకుంది. ‘‘నేనూ, నా కుటుంబం క్రైస్తవులం.
మేము దేవుని బిడ్డలం. బైట మేము ఏసు రక్తంతో కప్పబడినవారం. లోపట మా గుండెలు
చీల్చినా ఏసు ఇచ్చిన నీతే కనిపిస్తుంది’’ అని చెప్పింది. తన కొడుకు పెళ్ళిలో హిందూ
వేడుకలు చేసినందుకు తమను ఎక్కడ హిందువులు అనేసుకుంటారేమో అనే ఆవేదనతో అంత వివరణ
ఇచ్చుకుంది.

బొట్టు పెట్టుకోవడం,
పట్టుబట్టలు కట్టుకోవడం, పసుపు రాసుకోవడం, పెళ్ళికొడుకువారు ఊరేగింపుగా వెళ్ళడం,
పెళ్ళికూతురును పల్లకిలో తీసుకెళ్ళడం, ముత్యాల తలంబ్రాలు పోసుకోవడం, పూలదండలు
మార్చుకోవడం… ఇవన్నీ, హిందూమతం సంగతి పక్కన పెట్టండి…. భారతదేశపు సంప్రదాయాలే
కావు… ఇజ్రాయెల్‌ నుంచి దిగుమతై వచ్చిన ఆచార వ్యవహారాలు. అసలు వాటితో హిందువులకు
ఏం సంబంధం? అసలిక్కడి వారికి అలా వేడుకగా పెళ్ళిళ్ళు చేసుకోవడం రాదు కదా… హిందువుల
జీవితం ఎప్పుడూ మేము పాపులము అంటూ ఏడవడమే కదా… ఇలా సంతోషంగా వేడుకలు చేసుకుంటూ పెళ్ళిళ్ళల్లో
ఆనందంగా ఆచరించే పద్ధతులన్నీ, పాపం, ఏసుక్రీస్తు సిలువ మీదనుంచి రక్తమోడుతూ బోధించిన
సంప్రదాయాలు. ఆ పద్ధతులను హిందువులే క్రైస్తవుల నుంచి కాపీ కొట్టారు. అంతకు ముందు
హిందువులకు ఏ సంస్కృతీ లేదు కదా. పెళ్ళి హిందువులకి ఓ కాంట్రాక్ట్ మాత్రమే కదా.. కొంతకాలంలో
హిందూ అజ్ఞానులకు ఇలాగే అర్ధమవుతుందేమో.

హిందువులను ప్రలోభాలకు
గురిచేసి మతం మార్చే క్రైస్తవ పద్ధతిలో ఆడే నాటకాల్లో ఇదీ ఒక భాగమే. హిందూ
సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, వేడుకలను చిన్నపాటి మార్పులతో తామూ అనుసరించి,
అసలు తమ పద్ధతులనే హిందువులు కాపీ కొట్టారన్నట్టుగా ప్రచారం చేసి, వారిలో
ఆత్మన్యూనతతో కూడిన అనుమానాలు రేకెత్తించి తమ మతంలోకి మార్చుకోడానికి క్రైస్తవులు
చేసే నాటకాల్లో ఇవీ ఒక భాగం. అయితే, రాజకీయ నాయకురాలిగా ఉన్న షర్మిల ఆ విషయాన్ని బహిరంగంగా
చెప్పడమే విశేషం. మరి, త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు
వస్తాయనుకుంటున్న క్రైస్తవ ఓట్లను పోగొట్టుకోవడం ఆమెకు ఇష్టం ఉండదు కదా.

Tags: Christian MarriageDestination WeddingHindu RitualsSon MarriageYS Sharmila
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.