Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సేయ్ నవల్నీ జైలులో మరణం

param by param
May 12, 2024, 06:59 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Russian Opposition Leader Alexei Navalny died in prison

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సేయ్ నవల్నీ (47) తాను
బందీగా ఉన్న జైలులో శుక్రవారం నాడు తుదిశ్వాస విడిచారు. అధ్యక్షుడు వ్లాదిమిర్
పుతిన్‌ విధానాలను నవల్నీ తీవ్రంగా విమర్శిస్తుండేవారు. త్వరలో రష్యా అధ్యక్ష
ఎన్నికలు జరగనున్న సమయంలో నవల్నీ మరణం పలు అనుమానాలకు తావిస్తోంది.

‘జైలు నెంబర్ 3లో కాసేపు వాకింగ్ చేసాక ఆయన
శారీరకంగా ఇబ్బందిపడ్డారు. కొంతసేపటికే స్పృహ తప్పి పడిపోయారు. వైద్యులు అత్యవసర
చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. నవల్నీ మరణించినట్లు వైద్యులు
ధ్రువీకరించారు’ అని ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ కార్యాలయం ప్రకటించింది.

నవల్నీ 2018లో రష్యా అధ్యక్ష పదవి కోసం పుతిన్‌తో
పోటీపడ్డారు. ఆ ఎన్నికల్లో పోటీకి ఆయనపై ప్రభుత్వం అనర్హత వేటు వేసింది.
అయినప్పటికీ పుతిన్ ప్రభుత్వ అవినీతిపై పోరాటం కొనసాగించారు.
 ఆ తర్వాత నవల్నీని అరెస్ట్ చేసారు. దేశద్రోహం
వంటి అభియోగాలు మోపి 19ఏళ్ళ జైలుశిక్ష విధించారు. తొలుత మాస్కోలోని జైలులో బంధించినా,
గతేడాది ఆర్కిటిక్ ప్రాంతంలోని స్పెషల్ రెజీమ్ పీనల్ కాలనీకి తరలించారు.
 
2020 ఆగస్టులో నవల్నీపై సైబీరియాలో విషప్రయోగం
జరిగింది. దానికి కొన్ని నెలలపాటు జర్మనీలో చికిత్స తీసుకున్నారు. 2021 జనవరిలో
మళ్ళీ రష్యాకు చేరుకున్నారు. ఆ వెంటనే ఆయనను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అయినా
నవల్నీ ధైర్యం కోల్పోలేదు.
  పుతిన్‌కు
వ్యతిరేకంగా పోరాటం కొనసాగించారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నవల్నీ వ్యతిరేకించారు.

నవల్నీ మరణం పుతిన్ పనే అని అమెరికా అధ్యక్షుడు
జో బైడెన్ విమర్శించారు. పుతిన్ తన అధికారం కోసమే నవల్నీని తుదముట్టించారని
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మండిపడ్డారు. నవల్నీ తన ధైర్యసాహసాలకు తన
ప్రాణాలనే పణంగా పెట్టారని జర్మనీ అధ్యక్షుడు ఒలాఫ్ స్కోల్జ్ వ్యాఖ్యానించారు.
జీవితాంతం ప్రాణగండాలను తట్టుకుంటూ ధైర్యంగా బ్రతికిన వ్యక్తి అని నవల్నీని
ఇంగ్లండ్ ప్రధానమంత్రి రిషి శునక్ కొనియాడారు. రష్యాలో స్వేచ్ఛ కోసం గళమెత్తే వారిని
ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్
మండిపడ్డారు.

నవల్నీది మరణ వార్తలపై ఆయన భార్య యూలియా నవల్నియా
అనుమానాలు వ్యక్తపరిచారు. అదే నిజమైతే దానికి పుతిన్, ఆయన అధికారులదే బాధ్యత అని
ఆరోపించారు. శుక్రవారం నాడు మ్యూనిక్‌లో నిర్వహించిన భద్రతా సదస్సులో పాల్గొంటున్న
యూలియా, పుతిన్ ఎప్పటికైనా శిక్ష తప్పించుకోలేరంటూ తన భర్త మృతికి
కన్నీరుమున్నీరయ్యారు.

Tags: Alexei Navalny deathFight on CorruptionOpposition leaderRussiaVladimir Putin
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.