Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆధ్యాత్మికం

క్రిస్మస్‌లో ‘మెర్రీ’ లేదు, న్యూ ఇయర్‌లో ‘హ్యాపీ’ లేదు

param by param
May 12, 2024, 01:58 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Neither so Merry, nor
so Happy

క్రిస్మస్ నుంచి ఆంగ్ల సంవత్సరాది (Christmas, New Year) వరకూ వేడుకలు పూర్తయ్యాయి. నిజానికివి వేడుకలేనా? అంటే సంతృప్తికరమైన
జవాబు ఉండదు. అసలు పుట్టాడో లేదో తెలీని వ్యక్తిని అడ్డం పెట్టుకుని ఒక మతాన్ని
సృష్టించి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న రోజు మొదటిది. ఏ ప్రాకృతిక మార్పూ
జరగని సాధారణమైన రోజును అడ్డదిడ్డంగా చేసిన కాలగణనలో మొదటిరోజుగా పరిగణించి జరిపే
వేడుక రెండోది. అది ఒక ఎత్తయితే, ప్రతీ హిందూ పండుగనూ విధ్వంసకరమైనదిగా
చిత్రీకరించే హైందవేతర దుర్మార్గులు ఈ రెండు సందర్భాల్లోనూ కుక్కిన పేలల్లా
కిక్కురుమనకుండా ఉండడం మరింత అమానుషం. ఈ రెండు సోకాల్డ్ పండుగల సందర్భాల్లోనూ చేసే
వేడుకల వెనుక ఉన్న అనర్ధాల గురించి ఎవ్వరూ నోరెత్తరు. ఆ అనర్ధాల గురించి మనం
తెలుసుకుందాం.


క్రిస్మస్ అంటే క్రైస్తవ మత ప్రబోధకుడైన ఏసుక్రీస్తు పుట్టినరోజు
(Jesus’ birthday) అంటారు. అందులో నిజం నేతిబీరకాయలో నెయ్యి అంతే అన్న సంగతి అందరికీ
తెలిసినా, ఆ మాట చెప్తే విరుచుకుపడేవాళ్ళే అందరూనూ. వారిలో హిందువులదే మెట్టువాటా
అవడం దౌర్భాగ్యం. అదలా పక్కన పెడితే, ప్రతీ హిందూ పండుగ అప్పుడూ, ప్రత్యేకించి
దీపావళి పండుగ నాడు, పర్యావరణానికి హాని జరిగిపోతోంది అంటూ గగ్గోలు పెట్టే
సోకాల్డ్ సిక్యులర్లు ఈ పండుగ ముందు రోజు డిసెంబర్ 24 నుంచి కొత్త సంవత్సరం తర్వాత
జనవరి 4 వరకూ కేవలం 12 రోజుల్లో జరిగే పర్యావరణ విధ్వంసం గురించి మాట్లాడరు.

అడవుల నరికివేత వల్ల పర్యావరణానికి
తీవ్రమైన ముప్పు వాటిల్లుతోందంటూ మొత్తుకుంటారు శాస్త్రవేత్తలు. కానీ ఆ ఆవేదనలు
ఎవరికీ పట్టవు. క్రిస్మస్ – న్యూ ఇయర్ సందర్భంగా కోట్లాది గ్రీటింగ్ కార్డులు
ప్రపంచమంతా పంపిణీ అవుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా 2వందల కోట్ల మందికి పైగా జనాభా
క్రిస్మస్ జరుపుకుంటారు.

— ఒక్క క్రిస్మస్ గ్రీటింగ్ కార్డుల
కోసమే సుమారు మూడున్నర కోట్ల చెట్లను నరికేస్తారు.

— ఇంక ‘క్రిస్మస్ ట్రీ’లను కూడా
కలుపుకుంటే యేటా 12కోట్లకు పైగా చెట్లు నరికివేతకు గురవుతాయి.

— అంతేకాదు, సుమారు 2-3వందల కోట్ల
కిలోగ్రాముల కర్బన ఉద్గారాలు వెలువడతాయి.

— క్రిస్మస్ కానుకల అలంకరణ కోసం
ప్రతీయేటా 2లక్షల 28వేల మైళ్ళ పొడవైన ర్యాపింగ్ పేపర్లు వాడతారు. ఆ రోజు తర్వాత అవన్నీ
చెత్తబుట్ట పాలే.

— క్రిస్మస్ సందర్భంగా ఒక్క ఇంగ్లండ్‌లోనే
పోగుపడే ప్లాస్టిక్ వ్యర్థాల బరువు 76వేల జిరాఫీల బరువుకు సమానం

— ఇంగ్లండ్‌లో క్రిస్మస్ చెత్తను
తొలగించడానికి అయ్యే ఖర్చు ఏటా 2.6కోట్ల పౌండ్లు.

— సంవత్సరం పొడుగునా పేరుకునే చెత్త
కంటె ఒకేఒక్క క్రిస్మస్ రోజున పేరుకునే చెత్త 30శాతం ఎక్కువ

— క్రిస్మస్ సమయంలో 10కోట్లకు పైగా
చెత్తసంచీలు పోగుపడతాయి

 

ఇంక ఆహార పదార్ధాల వృధా, ప్లాస్టిక్‌తో
తయారుచేసే క్రిస్మస్ చెట్లు, నిజమైన క్రిస్మస్ ట్రీస్… ఇవన్నీ పర్యావరణానికి
కలుగజేసే హాని అంతాఇంతా కాదు. ఇంగ్లండ్‌ రాయల్ మెయిల్ గణాంకాల ప్రకారం ఒక్క
యూకేలోనే ఏటా 15కోట్ల క్రిస్మస్ కార్డులు పంపిణీ అవుతాయి. అమెరికాలో పరిస్థితి మరీ
ఘోరం. హాల్‌మార్క్ గ్రీటింగ్ కార్డ్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం 130 కోట్ల
కార్డులు బట్వాడా అవుతాయి. ఇంక క్రిస్మస్ ట్రీస్ విషయానికి వస్తే ఇంగ్లండ్‌లో ఏటా
80లక్షల చెట్లు విక్రయమవుతాయి. అదే అమెరికాలో ఐతే 4కోట్ల చెట్లు ‘క్రిస్మస్
ట్రీ’గా తెగిపడిపోతాయి.

ఇంగ్లండ్‌లో క్రిస్మస్ సందర్భంగా 20
లక్షల టర్కీకోళ్ళు, 50లక్షల క్రిస్మస్ పుడ్డింగ్స్, 7న్నర కోట్ల ‘మిన్స్ పై’ మాంసం
ముక్కలూ వృధాగా పారేస్తారు. మొత్తంగా ఒక్క ఇంగ్లండ్‌లోనే 3లక్షల టన్నుల
ఆహారపదార్ధాలు వృధా అవుతాయి. ఆస్ట్రేలియాలో ఐతే సుమారు 50లక్షల టన్నుల ఆహార
పదార్ధాలు నేలపాలవుతాయి. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే నుంచి న్యూ ఇయర్ డే వ్యవధిలో
రెండున్నర కోట్ల టన్నుల చెత్త పేరుకుంటుంది. సంవత్సరంలోని మిగతా రోజుల్లో కంటె ఇది
25శాతం ఎక్కువ.  

ఇంక, ఇతర ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా,
అమెరికా ఖండంలోని దేశాల్లో క్రిస్మస్ పేరుతో ఘనంగా కనిపించేవి బాణాసంచా. దీపావళి నాడు
చమురు దీపాలు మాత్రమే పెట్టుకోండి, బాణాసంచా కాల్చుకోవద్దు అంటూ నీతి కబుర్లు
చెప్పే పెద్దమనుషులకు కొదవ లేదు. రసాయనాలతో తయారు చేసే బాణాసంచా వల్ల వాయుకాలుష్య
కారకాలు విపరీతంగా పెరిగిపోతాయి. కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్
డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఇతర వాయువులు ఉసురు తీసేస్తున్నాయి.

అమెరికాలో 2021లో బాణాసంచా మీద పెట్టిన
ఖర్చు సుమారు 150 కోట్ల డాలర్లు. జర్మన్లు ఏటా కొత్త సంవత్సరం నాడు కాల్చే
బాణాసంచా ఖరీదు సుమారు 2.5కోట్ల డాలర్లు. పర్యావరణ స్పృహ పెరుగుతున్న తరుణంలో 2019లో
ఇంగ్లండ్‌లో బాణాసంచా అమ్మకాలను నిషేధించాలంటూ 300మందికి పైగా ప్రజలు పిటిషన్‌పై
సంతకాలు చేసారు. అయినా ఫలితం ఏమీ లేదు. 

 ఇంక కొత్త సంవత్సరం సందర్భంగా కాల్చే
బాణాసంచా వల్ల గాయపడే వారి సంఖ్యా అధికమే. ఆస్ట్రియాలో ఏటా సుమారు 200 మంది ఇలా
గాయపడుతుంటారు. ఆ దేశంలో 90శాతం ప్రమాదాలు ఈ సమయంలోనే జరుగుతాయి. చైనా రాజధాని
షాంఘై నగరంలో 2015 నూతన సంవత్సర వేడుకల ప్రమాదంలో 36మంది చనిపోయారు, కనీసం మరో
50మంది గాయపడ్డారు.

 ఈ సోకాల్డ్ పండుగల వల్ల
ప్రభావితం అయ్యే జంతువులు, పక్షుల సంఖ్య కూడా తక్కువేమీ లేదు. 2021లో ఇటలీ రాజధాని
రోమ్‌లో వందలాది పక్షులు చనిపోయాయి. ఇక డ్రంక్ ఎన్ డ్రైవ్ కేసులకయితే లెక్కే లేదు.
ఇలాంటి వినాశకర దినాలను పండుగలుగా భావించి వేడుకలు జరుపుకోవడం మూర్ఖత్వం కాక
మరేమిటి? వీటివల్ల ఆనందం, సంతోషం ఏమున్నట్టు?

ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
general

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

రెండు తెలుగు రాష్ట్రాలకు వాన గండం
general

రెండు తెలుగు రాష్ట్రాలకు వాన గండం

విజయవాడలో వర్ష బీభత్సం
general

విజయవాడలో వర్ష బీభత్సం

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం
general

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం

ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు
general

ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.