Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

బలహీనపడిన మిగ్‌జాం, సహాయ చర్యలపై సీఎం సమీక్ష

param by param
May 12, 2024, 01:09 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఈశాన్య
తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్నదక్షిణ ఛత్తీస్‌గడ్, దక్షిణ అంతర్గత ఒడిశా-కోస్తా
ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా కొనసాగుతోంది. ఉపరితల
ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఉపరితల ద్రోణి ఒకటి దక్షిణ తమిళనాడు
వరకు సగటు సముద్ర మట్టానికి 0 .9కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది అని వాతావరణ
శాఖ అధికారులు వెల్లడించారు.

తుపాను
బలహీనపడినప్పటికీ రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు అక్కడక్కడ వానలు కురిసే
అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు
వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

తుపాను ప్రభావంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్, సహాయ చర్యలపై అధికారులు
దృష్టిపెట్టాలని ఆదేశించారు. మానవతా దృక్పథంతో పనిచేయాలని  బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని
సూచించారు. ధ్వంసమైన ఇళ్ళకు అందించే సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేయాలని రేషన్
పంపిణీలో ఎలాంటి లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

రైతులు
అధైర్య పడాల్సిన అవసరం లేదన్న ముఖ్యమంత్రి, తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని
ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో పాటు అన్ని రకాలుగా తోడుగా నిలుస్తామని భరోసా
ఇచ్చారు. సబ్బీడీపై విత్తనాలు అందించే అంశంపై అధికారులు
దృష్టి సారించాలన్నారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమత్తులు చేపట్టి రవాణాకు
ఆటంకం లేకుండా చూడాలన్నారు. వానలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య
చర్యలు చేపట్టాలన్నారు.

కృష్ణా
జిల్లాలో తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది.
గడిచిన రెండు రోజులుగా
సుమారు
1.07 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. అత్యవసర నిధి కింద జిల్లాకు రూ.కోటి చొప్పున
సాయాన్ని ప్రభుత్వం అందజేయడంతో ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్ళు జరుగుతున్నాయి.

ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం12
అడుగుల గరిష్టానికి చేరింది. దీంతో 10 గేట్లు ఎత్తి 6000 క్యూసెక్కుల నీటిని
దిగువకు వదిలారు.
గుంటూరు
జిల్లా యంత్రాంగం సహాయక చర్యలపై దృష్టి సారించింది. జిల్లాలోని పలు ప్రాంతాలలో
దెబ్బతిన్న రోడ్లను, విరిగి పడిన చెట్లను తోలగించాలని
గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి అధికారులను ఆదేశించారు.
గుంటూరు
జిల్లా వ్యాప్తంగా 7694 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమికంగా
నిర్ధారించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 750 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి
పునరావాస కేంద్రాలకు తరలించారు.

తుపాను
ప్రభావంతో విశాఖ విమానాశ్రయం నుంచి నడిపే నాలుగు సర్వీసులను బుధవారం రద్దు చేశారు.
విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఉదయం 9 గంటల 05 నిమిషాలకు చేరుకోవాల్సిన ఇండిగో
విమానం రద్దు కాగా  అలాగే కర్నూలు-
విశాఖపట్నం సర్వీసును నిలిపివేశారు.
ఉదయం
9గంటల25 నిమిషాలకు విశాఖపట్నం నుంచి తిరుపతి బయలుదేరాల్సిన సర్వీసును,‌ విశాఖపట్నం నుంచి  మధ్యాహ్నం ఒంటిగంట పది నిమిషాలకు కర్నూలు
బయలుదేరాల్సిన సర్వీస్ రద్దు చేశారు.

అనకాపల్లి
జిల్లాలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.  శారదానదికి భారీగా వరద చేరుతుంది. అనకాపల్లి
ఆర్టీసీ కాంప్లెక్స్ వరద నీటితో నిండి చెరువును తలపిస్తోంది.
 పశ్చిమగోదావరి జిల్లా లో సగటున 183.6
మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా లో అత్యధికంగా పాలకొల్లులో 346.6 , ఆకివీడు లో 226.8 నమోదు కాగా
అత్యల్పంగా యలమంచిలిలో 130.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
విజయనగరం
జిల్లాలో సుమారు 1,900 ఎకరాల్లో వరి పొలాల్లోకి నీరు
చేరినట్లు గుర్తించామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన
అవసరం లేదని పంట నష్టం అంచనా చేపట్టి పరిహారం కోసం ప్రభుత్వానికి
ప్రతిపాదిస్తామన్నారు.

తుపాను ్
ప్రభావిత ప్రాంతాలపై రూపొందించిన  కార్యాచరణను
రానున్న మూడు రోజులు పకడ్బందీగా అమలుచేసి సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు కృషి
చేయాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సంబంధిత అధికారులను
ఆదేశించారు.
జిల్లాలో
సుమారు 13,677 హెక్టార్ల  విస్తీర్ణంలోని
పంటలపై తుఫాను ప్రభావం పడిందన్నారు. దీనిలో 13,311 హెక్టార్లలోని వరి పంటపై
ప్రభావం ఉందన్నారు.

గర్భిణీలను ఈరోజు  కూడా
ప్రభుత్వ ఆసుపత్రి లోనే ఉండేలా చూడాలన్నారు.
వైద్య
శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని, డెంగ్యూ, మలేరియా పరీక్షలతో పాటు, ఫీవర్ సర్వేను కూడా చేయించాలని డి ఎం
అండ్ హెచ్ ఓ ను ఆదేశించారు.  పునరావాస
కేంద్రాల్లో ఉండి ఇంటికి వెళ్తున్న సందర్భాల్లో ప్రతి కుటుంబానికి రూ.2,500
అందజేయాలన్నారు. ప్రతీ కుటుంబానికి 25 కేజీల బియ్యంతో పాటు ఇతర సరుకులు
అందజేయాలన్నారు.
 
అల్లూరి
సీతారామరాజు జిల్లాలో పోలవరం ముంపు ప్రాంతాలైన చింతూరు, ఎటపాక తదితర మండలాలలో మిర్చి, పొగాకు, వరి పంటలు నీటమునిగాయి. గిరిజనుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

చింతపల్లి, అరకు, పాడేరు ఘాట్లలో అక్కడక్కడ కొండచరియలు విరిగిపడ్డాయి. విశాఖపట్నం
కొత్తవలస అరకులోయ మీదుగా కిరం డోల్ వెళ్ళే రైలు మార్గంలో కొండ చరియలు విరిగిపడడంతో
రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

పలుచోట్లు
గిరిజనుల ఇళ్లు కూలడంతో బాధిత కుటుంబాలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో టార్పాలీన్ లు అందజేశారు.
విజయనగరం
జిల్లాలో 9 వ తేదీ తర్వాత పంటనష్టం సర్వే చేస్తామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు.

ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.