Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆధ్యాత్మికం

బొట్టు లేని ఏడుపుగొట్టు మొహాలతో పండుగ సీజన్ యాడ్

param by param
May 11, 2024, 07:30 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Sabyasachi’s Heritage Bridal Collection
faces backlash

భారతదేశపు గొప్ప డిజైనర్స్‌లో
ఒకడిగా పేరుపొందిన సబ్యసాచి ముఖర్జీ తాజా దుస్తుల శ్రేణి కోసం రూపొందించిన ప్రకటన
తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పండుగలు, పెళ్ళిళ్ళ సీజన్‌ కోసం కొత్తగా హెరిటేజ్
బ్రైడల్ కలెక్షన్‌ దుస్తుల శ్రేణి వస్తోంది. దాని కోసం  రూపొందించిన ప్రకటనలో ఒక్క మోడల్ కూడా బొట్టు
పెట్టుకోకపోవడంపై నెటిజెన్లు మండిపడుతున్నారు.

దీపావళి పండుగ, ఆ తర్వాత
కార్తీకమాసం, పెళ్ళిళ్ళ సీజన్‌ని దృష్టిలో పెట్టుకుని సబ్యసాచి డిజైనర్ బ్రాండ్
కొత్త దుస్తుల శ్రేణిని రూపొందించింది. ప్రధానంగా భారతీయ హిందూ మహిళలకు
విక్రయించేందుకు ఉద్దేశించిన ఆ దుస్తుల ప్రమోషన్ కోసం ఒక ప్రకటన రూపొందించారు.
దాన్ని డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ తన సోషల్ మీడియాలో విడుదల చేసారు. ఐతే ఆ ప్రకటనలో
మోడల్స్‌ను చూపించిన విధానంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఆ ప్రకటనలో యువతులు సరికొత్త
చీరెల కలెక్షన్‌ ధరించి ప్రదర్శిస్తున్నారు. కానీ ఏ ఒక్కరి ముఖంలోనూ ఎలాంటి భావమూ కనిపించడం
లేదు. తీవ్రమైన బాధ అనుభవిస్తున్న వారిలా, చీరెలు ధరించడం బోర్ కొడుతోందనిపించేలా ఆ
మోడల్స్ ఉన్న తీరు, చాలామందికి చిరాకు కలిగించింది. పైగా, ఏ ఒక్క మోడల్ కూడా
బొట్టు ధరించలేదు. సాధారణంగా భారతీయ మహిళలకు బొట్టు లేకుండా సంప్రదాయిక అలంకరణ ఉండదు.
అది పండుగలు, పెళ్ళిళ్ళూ పేరంటాల సందర్భాలైతే ఇంక చెప్పనే అక్కర్లేదు. అలాంటిది, ‘హెరిటేజ్
బ్రైడల్ 2023’ కలెక్షన్ అని పేరు పెట్టి ఒక్క యువతికి కూడా బొట్టు లేకుండా,
ఏడుపుగొట్టు మొహాలతో వారిని చూపించడం నెటిజెన్లకు ఒళ్ళు మండించింది.

ఆ వీడియోను సోషల్ మీడియాలో
విడుదల చేసిన కొద్దిసేపటికే వినియోగదారులు తమ అసంతృప్తిని కామెంట్ల రూపంలో వెల్లడించడం
మొదలుపెట్టారు. ఎవరో చనిపోతే సంతాపం తెలుపుతున్నట్టు ఉన్నారా మోడల్స్ అంటూ
మండిపడుతున్నారు. ఇది బ్రైడల్ కలెక్షనా లేక ఫ్యునెరల్ కలెక్షనా అని కామెంట్
చేసారు. ఇంక జోక్స్, మీమ్స్‌కయితే అంతే లేదు.

ఇది డిప్రెషన్ కలెక్షన్ అని ఒక
నెటిజెన్ కామెంట్ చేసారు. ‘‘మోడల్స్ ఎందుకంత నిరాశగా కనిపిస్తున్నారు? ఇదేమైనా
డిప్రెషన్ కలెక్షనా? మోడల్స్ ముఖాన బొట్టు లేదేం? భావప్రకటనా స్వేచ్ఛ పేరిట
పండుగలను అపహాస్యం చేయడానికి అవకాశం లేదు’’ అని ఒక యూజర్ రాసారు.

మరొక నెటిజన్ ‘‘ఏడుపుగొట్టు
మహిళల ప్రపంచానికి స్వాగతం. ఇది సబ్యసాచి సంతాపం స్పెషల్ కలెక్షన్. అంత్యక్రియలకు
హాజరవడానికి ప్రత్యేకమైన డిజైనర్ చీరలు’’ అని కామెంట్ చేసాడు. ‘‘అసలు, వాళ్ళ సమస్య
ఏంటి? మలబద్ధకమా? మొలలా? లేక హెర్నియా సమస్యా?’’ అని ఇంకో నెటిజెన్ ప్రశ్నించారు.

‘‘పోలీస్ స్టేషన్‌లో ఫొటోలకు
పోజిస్తున్నారా? సబ్యసాచి కలెక్షన్ పేరిట బొట్టు కూడా లేకుండా ఎలాంటి చీరలు
అమ్ముతున్నారు? వాళ్ళకి కనీసం శవాలు నవ్వినట్లయినా నవ్వమని చెప్పండి. ఆధునికత
పేరిట మన సంస్కృతిని పాశ్చాత్యీకరించడం అలవాటైపోయింది’’ అంటూ మరో వ్యక్తి
వ్యాఖ్యానించారు.

 గత నెల దసరా పర్వదినం సందర్భంలో నల్లి సిల్క్స్
సంస్థ ప్రకటన కూడా ఇలాగే విమర్శలు ఎదుర్కొంది. బొట్టు లేని ముఖాలతో మోడల్స్‌ను
చూపుతూ పండుగ దుస్తులు విక్రయించే ప్రయత్నం వికటించింది. దాంతో నల్లి సిల్క్స్,
బొట్టు పెట్టుకున్న మహిళలతో మరొక ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పుడు
సబ్యసాచి ముఖర్జీ ప్రకటన కూడా అలాంటి విమర్శలనే ఎదుర్కొంటోంది.

ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం
Latest News

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం

దేవాలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి
general

దేవాలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి

భారత సాగర వాణిజ్య గతిని సమూలంగా మార్చేసే ‘విళింజం పోర్ట్’
Latest News

భారత సాగర వాణిజ్య గతిని సమూలంగా మార్చేసే ‘విళింజం పోర్ట్’

విళింజం ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
Latest News

విళింజం ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.