Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

దేవాలయాలను గాలికి వదిలేస్తారా.. ఇదెక్కడి చోద్యం

param by param
May 11, 2024, 04:57 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రూ. 5లక్షల కంటె తక్కువ వార్షికాదాయం ఉన్న
దేవాలయాల నిర్వహణ బాధ్యతను అర్చకుడు లేదా ధర్మకర్తలకు విడిచిపెట్టాలని
సుప్రీంకోర్టు ఆదేశించింది. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంగీకరించింది.
అయితే దానికి అవసరమైన విధివిధానాలను అటు న్యాయస్థానం, ఇటు ప్రభుత్వం రెండూ చెప్పలేదు.
ఆ సంగతి పక్కన పెట్టినా, ప్రభుత్వాలు మొదట్నుంచీ అల్పాదాయ ఆలయాలను పట్టించుకోవడం
లేదు. ఆదాయం ఎక్కువ ఉన్నచోట్ల మాత్రం పెత్తనం చేస్తూ వచ్చాయి. ఆలయాల సహజ పవిత్రతను
దెబ్బతీస్తూ, అవినీతి కూపాలుగా మార్చేసాయి. ఆ పద్ధతిని సమూలంగా మార్చాలి తప్ప
ఇలాంటి పైపై చర్యల వల్ల హిందూ ధర్మానికి కలుగుతున్న గ్లాని ఎంతమాత్రం తగ్గదు
అంటున్నారు విశ్వహిందూపరిషత్
ఆంధ్రప్రదేశ్ ఉత్తర ప్రాంత మందిర-అర్చక,పురోహిత ప్రముఖ్ శ్రీ ఎస్.ఫల్గుణరావు.

సాక్షాత్తుగా దైవమే కొలువైయున్న పరమ పావనమైన
ప్రదేశాలు దేవాలయాలు అని హిందువుల ప్రగాఢవిశ్వాసం. 
దైవం తనకు తానుగా ఆవిర్భవించినవి
కొన్ని
.ఋషుల, మునుల, మహనీయుల, మహాభక్తుల చేత ప్రతిష్టించబడినవి
కొన్ని… ఇలా పలురీతులలో దైవం కొలువైయున్న పుణ్యప్రదేశాలు దేవాలయాలు. ఇవి
హిందూధర్మానికి మూలాధార కేంద్రాలు. తరతరాల ఈ దేశ సంస్కృతీ సంప్రదాయాలకు ఆనవాళ్ళు
దేవాలయాలు. ఇటువంటి దేవాలయాలపై పెద్దరికం చలాయించాలనే ఆలోచన పూర్వీకులెవరికీ
కలలోనైనా రాని దుర్మార్గపు ఆలోచన.

 విదేశీ దుర్మార్గ పాలకులైన  బ్రిటీషువారు 1817లో మద్రాసు ప్రెసిడెన్సీలోని ధార్మిక
సంపదలపై ఆధిపత్యం వహిస్తూ దేశ సంస్కృతిని రూపుమాపాలనే దుష్ట తలంపుతో ఆనాడు
దేవాలయాలను తమ గుప్పిట్లోకి తీసుకొన్నారు. అప్పటినుండి స్వాతంత్య్రం వచ్చాక కూడా
ఇప్పటివరకు 200 సంవత్సరాలకు పైబడి దేవాలయాలు కబంధ హస్తాల్లో చిక్కుకునిపోయి
ఉన్నాయి. హిందూ సమాజానికి దేవాలయానికీ మధ్య దేవదాయ ధర్మదాయ శాఖ ఎటువంటి పాత్రను
పోషిస్తోందో, హైందవ ధర్మ పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకొంటోందో, కనీసం భక్తులకు
,అర్చకులకు, కళాకారులకు,సకల వృత్తుల వారికీ ఎటువంటి స్థానాన్ని ఇస్తోందో జగమెరిగిన సత్యం.
దేవాలయ వ్యవస్థ ప్రక్షాళన జరగాలని ప్రతీ హిందువు తీవ్రంగా కోరుకొంటున్నారనే
విషయం  పాలకులకు అర్థమయ్యే తరుణం దగ్గర
పడుతోంది.

*దైవం పట్ల విశ్వాసం లేనివారిని, దేవాలయ వ్యవస్థ
పట్ల అవగాహన లేనివారిని
, విదేశీ మతాల వారిని, విదేశీ
ఇజాల వారిని దేవాలయాలలో అధికారులుగా
, పాలకులుగా నియమించుకొంటూ ఇన్నాళ్ళుగా
దేవాలయ వ్యవస్థను ఉద్ధరించే మహత్కార్యాలు ఏం చేశారో భక్తసమాజానికి తెలియజేయాలి.

*దైవాన్ని 24గంటలూ కనిపెట్టుకొని ఉన్న
అర్చకులకు ఇస్తున్న గౌరవ మర్యాదలు ఎటువంటివి?

*కోటానుకోట్ల విలువ కలిగిన దేవాలయ
స్థిర
,చరాస్తుల వివరాలను హిందూసమాజం
ప్రశ్నిస్తోంది.

*దేవాలయాలను సొంత జాగీర్లవలె సిఫార్సు
లేఖల దర్శనాలు
, ప్రత్యేక దర్శనాలు, చెప్పులు దగ్గర నుండి మూలవిరాట్ దర్శనం వరకు ఎన్ని రకాలుగా ధనం వసూలు
చేయవచ్చో ఈ దేవదాయ ధర్మదాయ శాఖ నుండి నేర్చుకోవచ్చు.

*హుండీలపైనున్న రహస్య నేత్రాల
వీక్షణాలు దేవాలయాల భద్రత పట్ల లేకుండా పోతున్నాయి.

*అవినీతి అనకొండలను తిప్పి తిప్పి మరల
అందులోనే  నియమిస్తున్నారు.

*దేవాలయాలు తాగుబోతులు, పిచ్చోళ్ళు, మతిభ్రమించినవారు, మందమతులు అయినవారు దాడులు,దొంగతనాలు చేసే
ప్రదేశాలుగా మారుతున్నాయి

* కోట్లాది రూపాయల ధనం ప్రతీ నెలా ఈ
శాఖ పేరుతో ఖర్చులు జరుగుతున్నాయి.

దేవాలయ వ్యవస్థను పీల్చి పీల్చి పిప్పి
చేసిన ఎండోమెంట్ శాఖ ఈ రోజు 5లక్షలరూపాయల కంటె తక్కువ వార్షికాదాయం ఉన్న దేవాలయాల
బాధ్యత నుండి తప్పించుకోవడం పట్ల విశ్వహిందూపరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం
చేస్తోంది. దేవాలయ వ్యవస్థపట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

*ఇంతవరకు దేవాలయ వ్యవస్థను
చక్కదిద్దడంలో ఎండోమెంట్ పాత్రపై శ్వేతపత్రం విడుదల చేయాలి.

*దేవాలయాలలో ఉండవలసింది రాజకీయ ప్రమేయం
కలిగిన పాలక మండళ్ళు కాదు, కేవలం ధర్మం పట్ల అవగాహన కలిగిన భక్త మండలి.
అక్కడ భగవంతుడు మాత్రమే పాలకుడు.

*ఇంతకుముందు దేవాలయాలను ఏవిధంగా
తీసుకొన్నారో అదేవిధంగా హిందూసమాజానికి అప్పజెప్పాలి. అంతేతప్ప ఆదాయమున్న
దేవాలయాలను వాడుకొంటాం, ఆదాయం లేని దేవాలయాలను సమాజానికి అప్పజెప్పేస్తాం అంటూ
బయలుదేరడం ధార్మిక వ్యవస్థను భ్రష్టు పట్టించడమే అవుతుంది.

ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.